
మందార, మల్లె మొక్కలు పూలతో నిండిపోవాలా? వంటగదిలోని ఈ ఒక్క మసాలా దినుసు వాడితే చాలు!
ఇంటి గదిలోనో, బాల్కనీలోనే చిన్న పూల తోటను పెంచుకోవడం చాలా మందికి ఇష్టమైన వ్యాపకం. ముఖ్యంగా మందార (Hibiscus), మల్లె (Mogra) మొక్కలను దాదాపు ప్రతి ఇంట్లోనూ పెంచుతుంటారు. అయితే, చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య ఏమిటంటే.. మొక్కలు పచ్చగా పెరుగుతాయి కానీ వాటికి ఆశించిన స్థాయిలో పూలు పూయవు, లేదా మొగ్గలు రాకముందే రాలిపోతుంటాయి. దీనికోసం మార్కెట్లో దొరికే కెమికల్ ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. మన వంటగదిలో ఉండే దాల్చినచెక్క (Cinnamon) ఈ మొక్కలకు అద్భుతమైన హోమ్‌మేడ్ ఫెర్టిలైజర్‌గా పనిచేస్తుంది.
దాల్చినచెక్క కేవలం వంటల రుచిని పెంచడానికే కాదు, మొక్కల సంరక్షణకు కూడా రామబాణంలా పనిచేస్తుంది. ఇందులో సహజసిద్ధమైన యాంటీఫంగల్ (Anti-fungal), యాంటీసెప్టిక్, యాంటీబాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
వేర్ల రక్షణ: వర్షాకాలంలో లేదా ఎక్కువ నీరు పోయడం వల్ల మొక్కల వేర్లకు ఫంగస్ (బూజు) పడుతుంటుంది. దాల్చినచెక్క పొడిని వాడటం వల్ల వేర్లు కుళ్ళిపోకుండా ఆరోగ్యంగా ఉంటాయి.
మట్టి నాణ్యత: ఇది మట్టిలోని సూక్ష్మజీవులను ఉత్తేజపరిచి, మొక్కలకు అవసరమైన నైట్రోజన్, పొటాషియం వంటి పోషకాలు సులభంగా అందేలా చేస్తుంది. దీనివల్ల మొక్కల్లో రోగనిరోధక శక్తి పెరిగి ఎక్కువ మొగ్గలు వస్తాయి.
కీటకాల నివారణ: దీని ఘాటైన వాసనకు చీమలు, తెల్ల దోమలు వంటి తెగుళ్లు మొక్కల దరిచేరవు.
మొక్కలకు దాల్చినచెక్కను రెండు పద్ధతుల్లో ఉపయోగించవచ్చు:
నేరుగా పొడి చల్లడం: వారానికి లేదా పది రోజులకు ఒకసారి మందార, మొగ్రా మొక్కల మొదళ్లలో మట్టిని కొద్దిగా తవ్వి, ఒక చెంచా దాల్చినచెక్క పొడిని చల్లి నీళ్లు పోయాలి.
లిక్విడ్ ఫెర్టిలైజర్: ఒక లీటరు నీటిలో ఒక చెంచా దాల్చినచెక్క పొడిని కలిపి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టి మొక్కల వేర్లకు పోయాలి లేదా ఆకులపై స్ప్రే చేయాలి.
ఈ సహజసిద్ధమైన చిట్కాను పాటించడం వల్ల ఎండకాలం, వర్షాకాలంలో కూడా మీ ఇంట్లోని మందార, మల్లె చెట్లు పెద్ద పెద్ద పూలతో, సువాసనలతో కళకళలాడుతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..