
జీవితంలో విజయం సాధించిన అనేక మంది ప్రముఖులు తమ దినచర్యను ఉదయం 5 గంటలకంటే ముందే ప్రారంభిస్తారు. వేకువజామునే నిద్రలేవడం వల్ల రోజంతా పనులను ప్రశాంతంగా, ఎలాంటి గందరగోళం లేకుండా నిర్వహించుకోవడానికి అదనపు సమయం లభిస్తుంది. ఈ క్రమశిక్షణతో కూడిన మార్నింగ్ రోటిన్ మనకు మానసిక ఉల్లాసాన్ని, రోజంతా కావాల్సిన శక్తిని అందిస్తుంది. పూర్తి డిటెల్స్‌లోకి వెళితే..
సాధారణంగా చాలామంది ఉదయం కళ్లు తెరవగానే సోషల్ మీడియా నోటిఫికేషన్‌లు, వాట్సాప్ మెసేజ్‌లు చూస్తుంటారు. కానీ, సక్సెస్‌ఫుల్ పీపుల్ ఉదయం లేచిన వెంటనే మొదటి 30 నిమిషాల పాటు ఫోన్‌ను అస్సలు ముట్టుకోరు. దీనివల్ల మనసు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉంటుంది. రోజంతా మన ఆలోచనలు మన నియంత్రణలో ఉంటాయి.
ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగి, కొన్ని నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చోవడం చాలా మంచిది. దీనినే మెడిటేషన్ అంటారు. ఆ రోజు చేయాల్సిన పనుల గురించి మనసులో ఒక స్పష్టత తెచ్చుకోవడం వల్ల మానసిక ఆందోళన చాలా వరకు తగ్గిపోతుంది. ఏకాగ్రత పెరుగుతుంది.
ఉదయం ప్రశాంత వాతావరణంలో కాసేపు మంచి పుస్తకాలు లేదా న్యూస్‌పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. రోజుకు కనీసం 10 పేజీలు చదివినా నెలకు ఒక పూర్తి పుస్తకం పూర్తవుతుంది. ఇది మన మెదడును చురుగ్గా ఉంచడంతో పాటు విజ్ఞానాన్ని గణనీయంగా పెంచుతుంది.
విజయవంతమైన వ్యక్తులు తమ రోజువారీ పనులను ముందుగానే ఒక జర్నల్ లేదా నోట్‌బుక్‌లో రాసుకుంటారు. ఆ రోజు పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం వల్ల ఎలాంటి గందరగోళం ఉండదు. అనుకున్న సమయానికి పనులన్నీ పర్ఫెక్ట్‌గా పూర్తవుతాయి.
ఉదయం పూట నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండి, మొలకలు, పండ్లు, గుడ్లు లేదా ఓట్స్ వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి. అలాగే చిన్నపాటి యోగా లేదా వాకింగ్ చేయడం వల్ల మెదడులో హ్యాపీ హార్మోన్స్ విడుదలలై రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.
మీరు కూడా మీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలనుకుంటే ఉదయం 5 గంటలకు నిద్రలేచే 5AM ఛాలెంజ్ స్వీకరించండి. కనీసం 21 రోజుల పాటు ఈ క్రమశిక్షణను పాటిస్తే, అది మీ దైనందిన అలవాటుగా మారి మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..