AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముఖానికి విటమిన్ E క్యాప్సూల్ నేరుగా రాస్తున్నారా? స్కిన్ ఎక్స్‌పర్ట్ హెచ్చరిక!

చర్మ సౌందర్యం కోసం విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను నేరుగా ముఖానికి రాసుకోవడం సరైనదేనా అనే సందేహానికి ప్రముఖ చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ ఆంచల్ పంత్ స్పష్టత ఇచ్చారు. విటమిన్ ఇ చర్మానికి మేలు చేసినప్పటికీ, క్యాప్సూల్‌ను కట్ చేసి నేరుగా ముఖానికి రాసుకోవడం వల్ల కలిగే లాభనష్టాలేంటో ఆమె వివరించారు. చర్మం లోపలికి ఇంకేలా ప్రత్యేకంగా తయారుచేసిన విటమిన్ ఇ ఉన్న మోయిశ్చరైజర్లు లేదా క్రీమ్‌లను మాత్రమే వాడాలని ఆమె సూచించారు.

ముఖానికి విటమిన్ E క్యాప్సూల్ నేరుగా రాస్తున్నారా? స్కిన్ ఎక్స్‌పర్ట్ హెచ్చరిక!
Vitamin E Capsules On Face
Jyothi Gadda
|

Updated on: Sep 26, 2026 | 7:34 AM

Share

అందమైన, మెరిసే చర్మం కోసం చాలామంది ఇంట్లోనే రకరకాల చిట్కాలను ప్రయత్నిస్తుంటారు. అందులో ముఖ్యంగా విటమిన్ ఇ క్యాప్సూల్‌ను కట్ చేసి, దానిలోని నూనెను నేరుగా ముఖానికి రాసుకోవడం లేదా ఇతర ఫేస్ ప్యాక్‌లలో కలిపి వాడటం ఈమధ్య బాగా పెరుగుతోంది. అయితే, ఇలా విటమిన్ ఇ క్యాప్సూల్‌ను నేరుగా చర్మానికి పూయడం నిజంగానే మంచిదేనా? దీనిపై ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఆంచల్ పంత్ ఏమంటున్నారో తెలుసుకుందాం.

నేరుగా రాస్తే ప్రయోజనం ఉండదు!

డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఆంచల్ పంత్ తెలిపిన వివరాల ప్రకారం, విటమిన్ ఇ చర్మానికి ఎంతో మేలు చేస్తుందనేది వాస్తవమే అయినా, క్యాప్సూల్‌ను కట్ చేసి నేరుగా ముఖానికి రాసుకోవడం వల్ల చర్మానికి ఎలాంటి పోషణ అందదు. విటమిన్ ఇ చర్మం లోపలి పొరల్లోకి చొచ్చుకెళ్లడానికి వీలుగా ప్రత్యేకమైన సాల్వెంట్లు, ఎమల్సిఫైయర్లు అవసరమవుతాయి. ఇవి చర్మ సంరక్షణ క్రీమ్‌లు లేదా మోయిశ్చరైజర్లలో మాత్రమే ఉంటాయి. క్యాప్సూల్‌లోని నూనె నేరుగా చర్మంపై ఇంకిపోలేదని ఆమె స్పష్టం చేశారు.

క్యాప్సూల్ నూనె వల్ల కలిగే నష్టాలు:

రంధ్రాలు మూసుకుపోవడం: విటమిన్ ఇ క్యాప్సూల్‌లోని ఆయిల్ చాలా జిడ్డుగా, చిక్కగా ఉంటుంది. దీన్ని నేరుగా రాయడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి ముఖంపై పింపుల్స్, ఆక్నె సమస్యలు పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

అలర్జీలు, మంట: సున్నితమైన చర్మం ఉన్నవారు ఈ నూనెను నేరుగా వాడితే ముఖం ఎర్రబడటం, దురద, మంట లేదా అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది.

సరైన పద్ధతి ఏమిటి?

విటమిన్ E మోయిశ్చరైజర్లు: చర్మానికి విటమిన్ ఇ అందాలంటే, విటమిన్ ఇ సమృద్ధిగా ఉండే మోయిశ్చరైజర్లు లేదా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌ను మాత్రమే ఎంచుకోవాలి.

వైద్యుల సలహా: శరీరానికి విటమిన్ ఇ లోపం ఉన్నట్లయితే, నిపుణుల సలహా మేరకు ఆ క్యాప్సూల్స్‌ను మాత్రల రూపంలో మింగవచ్చని, కానీ, ముఖానికి పూయకూడదని డాక్టర్ పంత్ వివరించారు. అందుకే, సోషల్ మీడియా చిట్కాలను గుడ్డిగా నమ్మకుండా, చర్మానికి ఏది సురక్షితమో తెలుసుకుని వాడటం ఎంతో ముఖ్యం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తులా రాశిలో రవి సంచారం.. ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వీరు జాగ్రత్త
తులా రాశిలో రవి సంచారం.. ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వీరు జాగ్రత్త
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్
వెస్టిండీస్ సంచలనం.. భారత్‌పై 24 పరుగుల విజయం.. సిరీస్ సమం
వెస్టిండీస్ సంచలనం.. భారత్‌పై 24 పరుగుల విజయం.. సిరీస్ సమం
సింహాలతో సీతక్క సవారీ.. మామూలుగా లేదుగా!
సింహాలతో సీతక్క సవారీ.. మామూలుగా లేదుగా!
లంచ్ బాక్స్ లోకి టమాటో రైస్ రుచిగా.. 10 నిమిషాల్లోనే ఇలా ఈజీగా..
లంచ్ బాక్స్ లోకి టమాటో రైస్ రుచిగా.. 10 నిమిషాల్లోనే ఇలా ఈజీగా..
బెంగాల్‌లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
బెంగాల్‌లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!