AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటి డోర్‌ దగ్గర ఈ ఒక్కటి పెడితే ఆ చిక్కులన్నీ మాయం.. ఇక లక్ష్మీదేవి తాండవమే..

మనం ఎంత కష్టపడినా ఆర్థిక ఇబ్బందులు వదలడం లేదా? ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతోందా? వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంటి ప్రధాన ద్వారమే ఇందుకు కారణం కావచ్చు. గుమ్మం వద్ద కేవలం ఒక చిన్న పటిక ముక్కను వేలాడదీయడం ద్వారా మీ తలరాతను ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటి డోర్‌ దగ్గర ఈ ఒక్కటి పెడితే ఆ చిక్కులన్నీ మాయం.. ఇక లక్ష్మీదేవి తాండవమే..
Vastu Tips For Main Door
Krishna S
|

Updated on: May 03, 2026 | 12:09 PM

Share

మనిషి జీవితంలో వాస్తు అనేది కేవలం ఇల్లు కట్టేటప్పుడు చూసుకునే కొలతలు మాత్రమే కాదు.. అది మన దైనందిన జీవితాన్ని, ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసే ఒక గొప్ప శక్తి. మనం రోజంతా చేసే పనులన్నీ ఇంటి నుంచే ప్రారంభమవుతాయి కాబట్టి ఆ ఇంట్లోని వాతావరణం మన విజయావకాశాలను నిర్ణయిస్తుంది. వాస్తు దోషాలు ఉంటే ఆర్థిక నష్టం, మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. వీటన్నింటికీ పరిష్కారం మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గరే ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ప్రధాన ద్వారం: సానుకూల శక్తికి నిలయం

ఇంటి గుమ్మం కేవలం రాకపోకలకు ఉపయోగపడే ద్వారం మాత్రమే కాదు విశ్వంలోని సానుకూల శక్తులను ఇంట్లోకి ఆహ్వానించే అతి పెద్ద ప్రవేశ మార్గం. అందుకే గుమ్మం వద్ద చేసే చిన్న చిన్న మార్పులు సంపదను, శ్రేయస్సును తెచ్చిపెడతాయి.

ఆర్థిక ఇబ్బందులా..? పటికతో ఇలా చేయండి

మీరు నిరంతర ఆర్థిక ఒత్తిడి, ఇంట్లో కలహాలు లేదా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారా? అయితే వాస్తు శాస్త్రం ఒక సులభమైన, తక్కువ ఖర్చుతో కూడిన పరిహారాన్ని సూచిస్తోంది. అదే పటిక. ఒక చిన్న పటిక ముక్కను ఎర్రటి గుడ్డలో కట్టి, ఇంటి ప్రధాన ద్వారం ముందు వేలాడదీయండి. ఇలా చేయడం వల్ల ఇంటిపై ఉన్న చెడు దృష్టి తొలగిపోవడమే కాకుండా, ఇంట్లోకి ప్రవేశించే శక్తులు శుద్ధి చేయబడతాయి.

ఇది ఎలా పనిచేస్తుంది..?

వాస్తు శాస్త్రం ప్రకారం పటికకు ప్రతికూల శక్తిని గ్రహించే అద్భుత శక్తి ఉంది.

శుద్ధి: ఇది పరిసరాల్లోని నెగటివ్ వైబ్రేషన్స్‌ను ఆవిరి చేసి, వాతావరణాన్ని సమతుల్యం చేస్తుంది.

శాంతి: ఇంట్లో ఎల్లప్పుడూ సానుకూల శక్తి ఉండేలా చూస్తూ, కుటుంబ సభ్యుల మధ్య శాంతి, సంతోషాలను పెంచుతుంది.

లక్ష్మీ కటాక్షం: ఏ ఇంట్లో అయితే సానుకూల శక్తి నిరంతరం ప్రవహిస్తుందో, అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు చెబుతారు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి, సంపద వృద్ధి చెందుతుంది.

చిన్న చిన్న అనారోగ్యాలకు మందులు వాడినట్లే, ఇంటి వాస్తు దోషాలకు ఇలాంటి సహజసిద్ధమైన పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఖర్చు లేని ఈ చిన్న మార్పు మీ జీవితంలో పెద్ద వెలుగులను నింపగలదు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం వాస్తుశాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది.  వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us
గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది!
గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది!
బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.!
బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.!
తక్కువ బడ్జెట్‌కే మార్కెట్‌లో నోకియా 2660 ఫ్లిప్‌ 4G.. ఎంతంటే
తక్కువ బడ్జెట్‌కే మార్కెట్‌లో నోకియా 2660 ఫ్లిప్‌ 4G.. ఎంతంటే
ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? అసలు నిజాలు..
ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? అసలు నిజాలు..
WiFi రూటర్‌పై కాయిన్ పెడితే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందా?
WiFi రూటర్‌పై కాయిన్ పెడితే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందా?
విడాకుల రూమర్స్ పై సింగర్ హేమచంద్ర క్లారిటీ..
విడాకుల రూమర్స్ పై సింగర్ హేమచంద్ర క్లారిటీ..
అనుపమకు జరిగినట్లే.. వీడియో రిలీజ్ చేసిన జబర్దస్త్ పవిత్ర
అనుపమకు జరిగినట్లే.. వీడియో రిలీజ్ చేసిన జబర్దస్త్ పవిత్ర
డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలంటే ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారు?
డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలంటే ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారు?
అద్భుతమైన హీరోయిన్.. అయినా అదృష్టమే కలిసి రాలేదు..
అద్భుతమైన హీరోయిన్.. అయినా అదృష్టమే కలిసి రాలేదు..
ఒకట్రెండు కాదు.. ఏకంగా ఒకే మ్యాచ్‌లో 103 నో బాల్స్..!
ఒకట్రెండు కాదు.. ఏకంగా ఒకే మ్యాచ్‌లో 103 నో బాల్స్..!
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర