Lifestyle: రోజూ 15 నిమిషాలు ఈ పని చేయండి.. గుండె పదిలంగా ఉంటుంది

|

Nov 01, 2024 | 3:09 PM

ప్రస్తుతం గుండె సంబంధిత సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే రోజూ మెట్లను ఉపయోగించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి..

Lifestyle: రోజూ 15 నిమిషాలు ఈ పని చేయండి.. గుండె పదిలంగా ఉంటుంది
Heart
Follow us on

ఎక్కువ కాలం జీవించాలని చాలా మంది ఆశిస్తుంటారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో ఉండాలనే అంతా ఆశిస్తుంటారు. అయితే మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా చిన్న వయసులోనే అనారోగ్యం బారిన పడుతున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది.

అయితే గుండె ఆరోగ్యంగా ఉండాలంలే జీవన విధానంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజూ వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నిద్ర, ఒత్తిడి లేని జీవన విధానాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిసిందే. అయితే మెట్లు ఎక్కడం వల్ల కూడా గుండె పనితీరు మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మెట్లు ఎక్కడం వల్ల హృదయ స్పందన రేటు పెరగడంతో పాటు గుండెకు రక్త ప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇందుకు సంబంధించి డెయిలీ మెయిల్‌లో ఓ నివేదికను ప్రచురించారు. ఈ పరిశోధనలో భాగంగా 5 లక్షల మంది ఆరోగ్య డేటాను విశ్లేషించారు. శారీరక శ్రమ చేసే వ్యక్తులు ఎక్కువ కాలం జీవిస్తారని అధ్యయనంలో తేలింది. మెట్లు ఎక్కే వారిలో గుండె సంబంధిత వ్యాధులతో మరణించే ప్రమాదం 24 శాతం మందిలో 39 శాతం తగ్గిందని అధ్యయనం పేర్కొంది. దీంతో హార్ట్‌ స్ట్రోక్‌ వంటి సమస్యలు దూరమవుతాయి. రోజుకు కనీసం 15 నుంచి 20 నిమిషాలు మెట్లపై నడవడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుందని అంటున్నారు.

మెట్లు ఎక్కడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియాకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ సోఫీ పాడాక్ మాట్లాడుతూ..లిఫ్ట్‌, మెట్లు రెండు ఆప్షన్స్‌ ఉంటే మెట్లను ఎంచుకోవాలి. ప్రతీరోజూ 15 నుంచి 20 నిమిషాలు మెట్లు ఎక్కడం వల్ల శరీరంలో క్యాలరీలు కరిగిపోతాయి. ఇది బరువుత తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కాళ్ళ కండరాలను బలోపేతం చేస్తుంది. మెట్లు ఎక్కడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..