చికెన్, మటన్ కన్నా పవర్‌ఫుల్.. చేప తల తింటే ఇన్ని లాభాలా..?

నాన్ వెజ్ ప్రియులు చేపలను ఇష్టంగా తింటారు..ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం.. చేప తలకాయ కూర తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. విటమిన్ ఎ కళ్ళకు మేలు చేయగా, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.. ఇంకా జ్ఞాపకశక్తిని పెంచుతాయి. అంతేకాకుండా, చేప తలలోని గుణాలు రాళ్ల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

చికెన్, మటన్ కన్నా పవర్‌ఫుల్.. చేప తల తింటే ఇన్ని లాభాలా..?
Fish Head Curry Recipe

Updated on: Feb 09, 2026 | 10:59 AM

ప్రస్తుత సమాజంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది.. ఈ నేపథ్యంలో, చాలామంది మటన్, చికెన్ కంటే చేపలను తమ ఆహారంలో భాగం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. డాక్టర్లు కూడా చేపల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. చేపలోని అన్ని భాగాలలో, చేప తలలు తినడం వల్ల మనకు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని పేర్కొంటున్నారు. పిల్లలు, వృద్ధులు అందరూ తప్పకుండా చేప తలకాయ కూరను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి నాన్‌వెజ్ ప్రియులు చేపలను ఇష్టంగా తింటారు.. వీటిలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. అయితే, చేప తల తింటే మరిన్ని పోషకాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చేప తలలో మాంసం కంటే 2-3 రెట్లు ఎక్కువ ఖనిజాలు ఉంటాయి. అందుకే చేప తల తినాలని సూచిస్తున్నారు.

చేప తలకాయ కూర.. ఎన్నో పోషకాలు..

చేప తలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ A, ఐరన్, జింక్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె, మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

చేప తలలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ళ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కంటిచూపును మెరుగుపరచడమే కాకుండా, ఇతర కంటి సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది. అందుకే వారానికి కనీసం ఒకసారైనా చేప తలలను ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

తరచుగా మతిమరుపుతో బాధపడేవారికి చేప తలలు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడుకు చాలా ఉపయోగకరమైనవి. వీటివల్ల మెదడు పదునుగా మారి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

ఈ రోజుల్లో చాలామంది కిడ్నీల్లో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చేప తలలను తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. చేప శరీరంలో రాళ్ల సమస్యను దూరం చేసే గుణాలు ఉన్నాయని వైద్య నిపుణులు వెల్లడించారు.

కాబట్టి, చేప తలలను వృధా చేయకుండా, వాటిని మీ ఆరోగ్యానికి, మెదడుకు మేలు చేసే విధంగా ఉపయోగించుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు..

చేప తలకాయ కర్రీని ఇలా చేసుకోండి..

చేప తల కర్రీని.. సాధారణంగా చేప కూరగా వండవచ్చు.. ముందుగా చేప తలలను శుభ్రం చేసుకుని మసాలా, ఉప్పు, పసుపు పట్టించి పక్కకు ఉంచాలి.. ఆ తర్వాత.. గిన్నెలో నూనె వేసి.. ఉల్లిపాయలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి తలలను వేయాలి.. ఆ తర్వాత.. కాస్తా ఉడకనివ్వాలి.. అనంతరం చింతపండు రసం, కొబ్బరి పేస్ట్, మసాలా దినుసులు వేసి.. ఉడికించాలి. నూనె పైకి తేలేవరకు ఉడికించి, కొత్తిమీరతో గార్నిష్ చేయండి.. అంతే.. వేడి వేడి చేప తలకాయ కూర సిద్ధమవుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us