AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

33 ఏళ్ల వరల్డ్ ట్రిప్..రూ.14 కోట్లు ఖర్చు చేసి 233 దేశాలు చుట్టొచ్చాడు!

ప్రపంచాన్ని పూర్తిగా చుట్టిరావాలనే కసితో ఓ చైనా బిజినెస్‌మ్యాన్ ఏకంగా 33 ఏళ్లపాటు ప్రయాణించి గ్లోబల్ వైడ్‌గా 233 దేశాలను విజిట్ చేశారు. వరల్డ్ టూర్ కోసం ఆయన సుమారు 15 లక్షల అమెరికన్ డాలర్లు (మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.14 కోట్లు) ఖర్చు పెట్టారు.

33 ఏళ్ల వరల్డ్ ట్రిప్..రూ.14 కోట్లు ఖర్చు చేసి 233 దేశాలు చుట్టొచ్చాడు!
Chinese Businessman Spends Rs 14 Crore On 33 Year World Trip
Sharada V
|

Updated on: Sep 10, 2026 | 6:27 PM

Share

 53 ఏళ్ల చెన్ జిన్‌వెయ్ ఇటీవల పెరూలో పర్యటించి తన గ్లోబల్ జర్నీని విజయవంతంగా పూర్తి చేసారు. ఆ తర్వాత చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని ఇంటికి తిరిగి చేరుకున్నారు.

ఎలా స్టార్ట్ అయిందంటే

ఓ మెషిన్ల తయారీ కంపెనీని రన్ చేస్తున్న చెన్, 1993లో సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్ ట్రిప్పులతో గ్లొబల్ జర్నీ స్టార్ట్ చేసారు. అప్పట్లో ఇంటర్నెట్ లేకపోవడంతో, ప్రపంచ దేశాలలో మనుషుల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో స్వయంగా తెలుసుకోవాలనే ఆసక్తితో ప్రయాణాలు చేసారు.  అయితే వ్యాపారాన్ని, కుటుంబ బాధ్యతలను  నిర్లక్ష్యం చేయకుండా జర్నీని కంటిన్యూ చేయడం విశేషం. ఒక నెల పూర్తిగా ఇంటి దగ్గరే ఉంటూ బిజినెస్ చూసుకుంటే, నెక్స్ట్ మంత్ ట్రిప్స్ కి వెళ్లిపోయేవారు.  సాధారణ దేశాలే కాకుండా, వాతావరణం అనుకూలంగా ఉండని ప్రమాదకర  ధ్రువ ప్రాంతాలను సైతం ఆయన విజిట్ చేసారు.

అంటార్కిటికాను చేరుకునేందుకు ఆయన చేసిన ఫస్ట్ ప్రయత్నం ఫెయిల్ అయినప్పటికీ, పట్టువదలక 2016 జనవరిలో మరోసారి ట్రై చేసి సక్సెస్ ఫుల్‌గా అక్కడ అడుగుపెట్టారు. న్యూజిలాండ్‌కు చెందిన మారుమూల ద్వీప భూభాగమైన ‘టోకెలావ్‌’ చేరుకోవడం కోసం తను ఎంతో కష్టపడినట్లు చెప్పారు. ఆఫ్రికాలో మలేరియా బారిన పడటంతో పాటు, గ్రీస్‌లో ఊహించని భూకంపాన్ని ఎదుర్కొన్నారు.

కేవలం టూరిస్ట్ ప్లేసెస్ చూసి వచ్చేయకుండా, ఆ  ప్రాంతాల స్థానిక సంప్రదాయాలను తెలుసుకుని, తోటి వారితో కలిసి వాటిని ఆచరించడానికే చెన్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.  ఏకంగా 198 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లను సేకరించి, వాటిని ‘జు జియాకే మెమోరియల్ హాల్’ కు విరాళంగా ఇచ్చి గ్రేట్ అనిపించుకున్నారు.

33 ఏళ్ల వరల్డ్ టూర్ పూర్తి కావడంతో ఇకపై పిల్లలు, పేరెంట్స్‌తో ఎక్కువ టైమ్ గడపాలని డిసైడ్ అయ్యారు.  వేర్వేరు టూరిజం రంగాలకు చెందిన 100 మంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి, వారి స్ఫూర్తిదాయక కథనాలతో ఓ బుక్ పబ్లిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. జర్నీలో అయినా బిజినెస్ లో అయినా ఒడిదుడుకులు సాధారణం అని, వాటిని ఎదుర్కొంటూనే ముందుకు వెళ్లాలని చెన్ అంటారు.  ప్రయాణాలను వాయిదా వేస్తున్నవారికి ‘సమయం ఎవరి కోసం ఆగదు’ అంటూ పవర్‌ఫుల్ మెసేజ్ ఇచ్చారు.

Follow Us