Lifestyle: రాత్రి భోజనం చేశాక ఈ తప్పులు చేస్తున్నారా.? ఊబకాయం తప్పదు

|

Oct 15, 2024 | 11:02 AM

ప్రస్తుతం ఊబకాయం బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చిన్న వయసు వారు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ఊబకాయం కారణమని తెలిసిందే. అయితే ఊబకాయం బారిన పడడానికి మనం చేసే కొన్ని జీవనవిధానమైన తప్పులే కారణమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి భోజనం చేసిన తర్వాత...

Lifestyle: రాత్రి భోజనం చేశాక ఈ తప్పులు చేస్తున్నారా.? ఊబకాయం తప్పదు
Obesity
Follow us on

ప్రస్తుతం ఊబకాయం బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చిన్న వయసు వారు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ఊబకాయం కారణమని తెలిసిందే. అయితే ఊబకాయం బారిన పడడానికి మనం చేసే కొన్ని జీవనవిధానమైన తప్పులే కారణమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి భోజనం చేసిన తర్వాత చేసే కొన్ని తప్పులు ఊబకాయానికి దారి తీస్తాయని అంటున్నారు. ఇంతకీ భోజనం చేసిన తర్వాత చేయకూడని ఆ పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆహారం తీసుకున్న వెంటనే చాలా మంది నీళ్లు తాగుతుంటారు. అదే విధంగా భోజనం చేస్తున్న సమయంలో కూడా నీటిని తాగుతుంటారు. అయితే ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఆహారం తీసుకున్న వెంటనే నీటిని తాగితే కడుపులో జీర్ణానికి ఉపయోగపడే యాసిడ్స్‌ గాఢత తగ్గుతుంది. దీంతో తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమవ్వదు. ఇది ఊబకాయానికి దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి భోజనానికి ముందు లేదా వెంటనే నీటిని తాగకూడదు. కనీసం గంట గ్యాప్‌ తర్వాతే నీటిని తీసుకోవాలి.

ఇక మనలో చాలా మంది రాత్రి తిన్న వెంటనే పడుకుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. రాత్రుళ్లు తినగానే పడుకుంటే ఊబకాయం పెరుగుతుంది. ఆహారం తీసుకున్న వెంటనే పడుకుంటే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. అందుకే స్థూలకాయాన్ని తగ్గించుకోవాలంటే రాత్రి భోజనం చేసిన తర్వాత కచ్చితంగా కాసేపు నడవాలి. భోజనం చేసిన తర్వాత కనీసం 100 అడుగులు వేయాలని నిపుణులు చెబుతున్నారు.

కొందరు తిన్నవెంటనే టీ లేదా కాఫీ తాగుతుంటారు. ఇది కూడా ఊబకాయంకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి కాఫీలో యాసిడ్‌ను పెంచడానికి దారి తీస్తుంది. ఈ కారణంగా కడుపులో గ్యాస్‌, జీర్ణ సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. ఇది దీర్ఘకాలంగా ఊబకాయంకు దారి తీస్తుంది. కాబట్టి తిన్న వెంటనే టీ, కాఫీలకు పూర్తిగా దూరంగా ఉండాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..