Health: తరచూ మూత్ర విసర్జన వేధిస్తుందా.? ప్రాణాంతక వ్యాధి కావొచ్చు..

కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. తరచూ మూత్ర సమస్య వేధిస్తున్నా అది ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు ప్రాథమిక లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. మూత్ర విసర్జనలో ఇబ్బంది ఉన్నా, మూత్రంలో లేదా వీర్యంలో రక్తం పడుతున్నా...

Health: తరచూ మూత్ర విసర్జన వేధిస్తుందా.? ప్రాణాంతక వ్యాధి కావొచ్చు..
Prostate Cancer
Follow us

|

Updated on: Mar 19, 2024 | 7:00 PM

మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా క్యాన్సర్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఒత్తిడితో కూడుకున్న జీవితం, మారిన పని విధానం కూడా క్యాన్సర్‌ బారిన పడేందుకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా పురుషుల్లో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 40 ఏళ్లు నిండిన పురుషుల్లో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ అంటే ఏంటి.? ఈ క్యాన్సర్‌ ప్రాథమిక లక్షణాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. తరచూ మూత్ర సమస్య వేధిస్తున్నా అది ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు ప్రాథమిక లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. మూత్ర విసర్జనలో ఇబ్బంది ఉన్నా, మూత్రంలో లేదా వీర్యంలో రక్తం పడుతున్నా, మూత్రం ధారగా రాకపోవడం వంటి లక్షణాలు కూడా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు కారణమంటున్నారు. ఇక మరికొందరిలో కాళ్లవాపు, ఎముకలలో నొప్పి, పొత్తికడుపు ఇబ్బందిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయని సూచిస్తున్నారు.

వయసు మీద పడటం, కుటుంబంలో ఎవరికైనా ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ఉన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ను విస్మరిస్తే అది ఇతర భాగాలకు వ్యాపించడం, అంగస్తంభన సమస్యలు మొదలైనవి రావడానికి అవకాశం ఉంది. 50 ఏళ్లు నిండిన పురుషులు కచ్చితంగా ప్రొస్టేట్ స్క్రీనింగ్ పరీక్షను నిర్వహించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ప్రాణంతకం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

వృద్ధాప్యం, జన్యుశాస్త్రం, హార్మోన్ స్థాయిలలో మార్పులు, ఆహారం, జీవనశైలిలో మార్పు కారణంగా ప్రొస్టేట్‌ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించడం వల్ల వ్యాధి నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్‌ను గుర్తించడానికి, వైద్యులు ప్రోస్టేట్ నిర్దిష్ట యాంటిజెన్ పరీక్ష, ప్రోస్టేట్ బయాప్సీ వంటి పరీక్షలను నిర్వహిస్తారు. చికిత్స ఎంపికలలో శస్త్రచికిత్స, రేడియేషన్, కీమోథెరపీ, హార్మోన్ థెరపీ వంటివి ఉన్నాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..