Lifestyle: కారం ఎక్కువగా తింటే నష్టాలే కాదు.. లాభాలు కూడా ఉన్నాయండోయ్‌

|

Oct 15, 2024 | 12:38 PM

మనలో చాలా మంది స్పైసీ ఫుడ్‌ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. వంటకు రుచిని ఇవ్వడంలో కారందే ముఖ్య పాత్ర. ఘాటైన మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలు కూరకు రుచిని అందిస్తాయి. అయితే కారం ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలకు స్పైసీ ఫుడ్‌ కారణం అవుతుంది...

Lifestyle: కారం ఎక్కువగా తింటే నష్టాలే కాదు.. లాభాలు కూడా ఉన్నాయండోయ్‌
Spicy Food
Follow us on

మనలో చాలా మంది స్పైసీ ఫుడ్‌ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. వంటకు రుచిని ఇవ్వడంలో కారందే ముఖ్య పాత్ర. ఘాటైన మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలు కూరకు రుచిని అందిస్తాయి. అయితే కారం ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలకు స్పైసీ ఫుడ్‌ కారణం అవుతుంది. అయితే స్పైసీ ఫుడ్‌ కారణంగా కేవలం నష్టాలు మాత్రమే లేవని, లాభాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ కారం ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే లాభనష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల గట్‌ హెల్త్‌ ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గట్‌లోని చెడు బ్యాక్టీరియాను తగ్గించి, మంచి బ్యాక్టీరియాను పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. స్పైసీ ఫుడ్స్‌ గట్‌ ఆరోగ్యానికి మంచివని నిపుణులు అంటున్నారు. మసాలా ఫుడ్‌ని తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగవుతుంది.

ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోజతంగా కేలరీలను అధికంగా తీసుకోవడాన్ని తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. ఒంటి నొప్పులను తగ్గించడంలో కూడా స్పైసీ ఫుడ్‌ ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. స్పైసీ ఫుడ్స్ ఆస్టియో ఆర్థరైటిస్, డయాబెటిస్ ఉన్నవారిలో నొప్పిని తగ్గించేందుకు సహాయపడతాయి.

ఇక స్పైసీ ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కారం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇది దీర్ఘకాలంలో గుండె సంబంధిత సమస్యలు దరిచేరే అవకాశం ఉంటుంది. కారం ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అల్సర్‌ వంటి సమస్యలతో బాధపడేవారిపై ప్రతికూల ప్రభావం పడేలా చేస్తుంది. ఇక ఇన్‌ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి ఉన్న వారు స్పైసీ ఫుడ్స్ తింటే సమస్యలొస్తాయి. దీని వల్ల గుండెలో మంట, అతిసారం, వికారం, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..