AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేదులోనే ఉంది మహా ఆరోగ్యం.. వేప వల్ల కలిగే ఈ అద్భుత ప్రయోజనాలు మీకు తెలుసా?

వేప చెట్టును ఆయుర్వేదంలో అద్భుతమైన దివ్యౌషధంగా పరిగణిస్తారు. వేప ఆకులు, పుల్లలు, పువ్వులు, గింజల్లో క్రిమిసంహారక, యాంటీబాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.చర్మ సమస్యలైన మొటిమలు, దురద, చర్మవ్యాధులకు వేప ఎంతో మేలు చేస్తుంది. వేప పుల్లలతో పళ్లు తోముకోవడం వల్ల పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలు దూరమై నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరిన్ని ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

చేదులోనే ఉంది మహా ఆరోగ్యం.. వేప వల్ల కలిగే ఈ అద్భుత ప్రయోజనాలు మీకు తెలుసా?
Neem BenefitsImage Credit source: Tv9 marathi
Jyothi Gadda
|

Updated on: Sep 09, 2026 | 9:27 PM

Share

మన ఇంటి ఆవరణలో లేదా చుట్టుపక్కల సులభంగా కనిపించే వేప చెట్టు ఒక శక్తివంతమైన ప్రకృతి ప్రసాదించిన ఔషధం. ఆయుర్వేదంలో వేపకు విశిష్ట స్థానం ఉంది. వేప వేరు నుండి ఆకుల వరకు ప్రతి భాగం ఏదో ఒక రకమైన ఆరోగ్య ప్రయోజనాన్ని అందిస్తుంది. వేపలోని క్రిమిసంహారక, యాంటీబాక్టీరియల్ మరియు యాంటీఫంగల్ గుణాలు పలు రకాల వ్యాధుల నుండి మనల్ని కాపాడుతాయి. వేప వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రక్తాన్ని శుద్ధి చేస్తుంది: వేప ఆకులు లేదా వేప రసాన్ని ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు పోతాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రక్తం శుభ్రపడటం వల్ల చర్మంపై సహజమైన కాంతి వస్తుంది.

చర్మ సమస్యలకు చెక్: వేపలోని యాంటీఫంగల్ గుణాలు చర్మ రోగాలను నివారించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వేప ఆకుల పేస్ట్‌ను ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమలు, నల్లటి మచ్చలు తగ్గుతాయి. తామర, దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఉన్న ప్రాంతంలో వేప నూనె లేదా వేప నీళ్లతో శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మధుమేహ నియంత్రణ: వేప ఆకులలో ఉండే హైపోగ్లైసిమిక్ గుణాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ ఉదయాన్నే పరగడుపున కొన్ని లేత వేపాకులను నమలడం లేదా కొద్దిగా వేప రసం తాగడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం పెరిగి బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది.

నోటి ఆరోగ్యం: పూర్వం నుండి వేప పుల్లలతో పళ్లు తోముకునే అలవాటు ఉంది. వేప పుల్లలలో ఉండే ప్రాకృతిక క్రిమిసంహారకాలు నోటిలోని హానికర బాక్టీరియాను నశింపజేస్తాయి. ఇవి చిగుళ్ల వాపు, పంటి నొప్పి మరియు నోటి దుర్వాసన సమస్యలను నివారిస్తాయి.

జుట్టు సంరక్షణ, రోగనిరోధక శక్తి: చుండ్రు సమస్యతో బాధపడేవారు వేప నీళ్లతో తలస్నానం చేయడం లేదా వేప నూనె రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా, వేపలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి తరచూ వచ్చే జలుబు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
చేదులోనే ఉంది మహా ఆరోగ్యం.. వేప వల్ల కలిగే ఈ అద్భుత ప్రయోజనాలు
చేదులోనే ఉంది మహా ఆరోగ్యం.. వేప వల్ల కలిగే ఈ అద్భుత ప్రయోజనాలు
సెంచరీతో వైభవ్‌కు ఇచ్చిపడేసిన ఐపీఎల్ టీంమేట్..!
సెంచరీతో వైభవ్‌కు ఇచ్చిపడేసిన ఐపీఎల్ టీంమేట్..!
అయ్యో పాపం.. బిగ్ బాస్ షాలినీ జీవితంలో ఇంతటి విషాదం ఉందా..?
అయ్యో పాపం.. బిగ్ బాస్ షాలినీ జీవితంలో ఇంతటి విషాదం ఉందా..?
వినాయకుడికి ఇష్టమైన పాలతాలికలపాయసం..ఇంట్లోనే సులభంగా ఎలా చేయాలంటే
వినాయకుడికి ఇష్టమైన పాలతాలికలపాయసం..ఇంట్లోనే సులభంగా ఎలా చేయాలంటే
రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. హైదరాబాద్-వరంగల్ రూట్‌లో..
రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. హైదరాబాద్-వరంగల్ రూట్‌లో..
క్రేన్లు, జేసీబీలు వచ్చినా కదలని హనుమాన్..!
క్రేన్లు, జేసీబీలు వచ్చినా కదలని హనుమాన్..!
అప్పుడు దాచుకున్న ఈ గింజలు.. ఇప్పుడు ఎంత మేలు చేస్తాయో తెలుసా..?
అప్పుడు దాచుకున్న ఈ గింజలు.. ఇప్పుడు ఎంత మేలు చేస్తాయో తెలుసా..?
ఓ ప్రేమ జంటకు దగ్గరుండి పెళ్లి చేశా.. కానీ ఆ హీరో గ్యాంగ్ వచ్చి..
ఓ ప్రేమ జంటకు దగ్గరుండి పెళ్లి చేశా.. కానీ ఆ హీరో గ్యాంగ్ వచ్చి..
ఫ్రాన్స్‌లో మన స్టార్టప్‌ల సత్తా.. భారత్ ఇన్నోవేట్స్ ప్రత్యేక..
ఫ్రాన్స్‌లో మన స్టార్టప్‌ల సత్తా.. భారత్ ఇన్నోవేట్స్ ప్రత్యేక..
ప్రపంచ క్రికెట్ లోనే పరమ వరస్ట్ టీం ఇదే..!
ప్రపంచ క్రికెట్ లోనే పరమ వరస్ట్ టీం ఇదే..!