Sprouting Potatoes: మీరూ మొలకెత్తిన బంగాళాదుంపలతో వంట చేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా..

|

Nov 08, 2024 | 1:23 PM

తెలిసో .. తెలియకో.. చాలా మంది గృహిణులు బంగాళా దుంపల విషయంలో పొరబాట్లు చేస్తుంటారు. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయని అవసరానికి మించి ఇంటికి తెచ్చుకుంటే కొన్ని రోజులకే అవి మొలకెత్తుతాయి. ఆ తర్వాత మొలకలను తొలగించి వాటిని వంటకు వినియోగిస్తుంటారు. నిజానికి ఇలా చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు..

Sprouting Potatoes: మీరూ మొలకెత్తిన బంగాళాదుంపలతో వంట చేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా..
Sprouting Potatoes
Follow us on

చాలా ఇళ్లల్లో ఎక్కువగా వండుకునే కూరగాయల్లో బంగాళాదుంపలు ఒకటి. దీనితో రకరకాల కర్రీలు, ఫ్రైలు, చిప్స్‌ ఇలా మూడ్‌ని బట్టి, సందర్భాన్ని బట్టి వండి వార్చేస్తుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వీటిని ఎంతో ఇష్టపడి తింటుంటారు. అయితే బంగాళాదుంపల నిల్వకు సంబంధించి తరచుగా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు కొంతమంది. వీటిని కొందరు ఫ్రిజ్‌లో స్టోర్‌ చేస్తే, మరికొందరేమో ప్లాస్టిక్‌ సంచుల్లో దాస్తుంటారు. నిజానికి పండ్లు, కూరగాయలతో పోల్చితే బంగాళాదుంపలను ఎక్కువ కాలం నిల్వ చేయచ్చు. అందుకే చాలా మంది అవసరానికి మించి కొనితెచ్చుకుని ఇళ్లల్లో నిల్వ చేస్తుంటారు. అయితే సరైన పద్ధతులు పాటించకపోతే బంగాళాదుంపలపై మొలకలు వస్తాయి. రంగు మారిపోయి తాజాదనం, రుచిని కూడా కోల్పోతాయి. ఇవి వండుకోవడానికి ఏ మాత్రం పనికిరావు.

ఆరోగ్య పరంగా చూస్తే.. బంగాళదుంపల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కానీ నూనెలో వేయించినవి తినడం అంత మంచిది కాదు. వండుకుని తింటే మంచిదని చెబుతారు. అయితే బంగాళాదుంపలను మార్కెట్ నుండి కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మీ ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మార్కెట్‌ నుంచి కొన్న తర్వాత బంగాళ దుంపలు ఇంట్లో దాస్తే కొన్ని రోజులకు మొలకెత్తుతాయి. ఇలా మొలకెత్తిన బంగాళాదుంపలను ఆహారంగి వినియోగించకూడదు.

ఈ విషయం తెలియక చాలా మంది వీటిని తీసివేసి వంటకు ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరమని పరిశోధనలు చెబుతున్నాయి. మొలకెత్తిన బంగాళదుంపలను తింటే ప్రాణాలకే ప్రమాదం అని బెంగళూరుకు చెందిన వైద్యుడు డా. దీపక్ ఆరాధ్య హెచ్చరించారు. నిజానికి, మొలకెత్తిన బంగాళదుంపలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఈ రకమైన బంగాళా దుంపలు లేదా లేత ఆకుపచ్చ బంగాళాదుంపలలో సోలనిన్, చకోనైన్ ఉత్పత్తి అవుతాయి. వీటిని తీసుకోవడం వల్ల విషపూరితంగా పనిచేస్తాయి. వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పికి కారణమవుతుంది. ఇది తలనొప్పి, మైకము వంటి నాడీ సంబంధిత లక్షణాలకు కూడా దారితీస్తుందని డా. దీపక్ హెచ్చరిస్తున్నాడు. కాబట్టి బంగాళాదుంపలను వండేటప్పుడు దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉపయోగించడం మంచిది. లేకుంటే అక్కర్లేని అనారోగ్య సమస్యలు వస్తాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.