ఉక్కులాంటి ఎముకలకోసం హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. మీ పిల్లలకు రోజూ పెడితే హాస్పిటల్‌కు వెళ్లే పనిలేదు!
Ragi Idli Recipe: మీ పిల్లలు వీక్‌గా ఉన్నారా.. ఎన్ని హాస్పిటల్స్‌కు తీసుకెళ్లినా ఫలితం ఉండట్లేదా.. టెన్షన్ పడాల్సిన పనిలేదు.. కేవలం వారి రోజుల వారి బ్రేక్ ఫాస్ట్‌లో చిన్న ఛేంజేస్ చేస్తే సరిపోతుంది. అవును మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌లోకి సాధారణ ఇడ్లీ, దోసలు కాకుండా ఇకపై పోషకాలతో నిండిన రాగి ఇడ్లీ పెట్టండి.. కొన్ని రోజుల్లో వారిలో మార్పు మీరు గమనిస్తారు. కాబట్టి ఈ ఇడ్లీలను ఇండ్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.

మన సౌలిండియాలో ముఖ్యంగా మన తెలుగురాష్ట్రాల్లో బ్రేక్‌ఫాస్ట్ అనగా గుర్తుకొచ్చేది ఇడ్లీ, దోశ.. అయితే ఆరోగ్య కరమైన బ్రేక్ ఫాస్ట్ కోరుకునే వారు ఎక్కవగా ఇడ్లీ తినేందుకు ఇష్టపడతారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఇడ్లీ ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్.. అయితే మీకు ఎప్పుడూ రోటీన్ ఇడ్లీ తిని బోర్ కోడితే.. ఈ సారి మేం చెప్పబోయే రాగి ఇడ్లీ ట్రై చేయండి. ఇది టేస్ట్‌తో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తయారు చేయడానికి మనం పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు.. మన నార్మల్ ఇడ్లీ చేసుకున్న మాదిరిగానే ఇది కూడా చేసుకోవచ్చు. కాబట్టి రాగి ఇడ్లీ తయారీకి ఏం పదార్థాలు.. కావాలి? దీన్ని ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.
రాగి ఇడ్లీ తయారీకి కావలసిన పదార్థాలు:
రాగి పిండి: 1 కప్పు
పచ్చ బియ్యం (పచ్చి బియ్యం): 1 కప్పు
మినపప్పు: 1/2 కప్పు
అటుకులు: 1/4 కప్పు
మెంతులు: 1/2 టీస్పూన్
ఉప్పు, నీరు: తగినంత
తయారుచేసే విధానం:
రాగి ఇడ్లీ తయారు చేసేందుకు ముందుగా మనం బియ్యం, మినపప్పు, మెంతులను బాగా కడిగి వేర్వేరు పాత్రల్లో 4 నుండి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ మెత్తగా సాఫ్ట్‌గా వచ్చేందుకు అందులో మనం అటుకులను యాడ్ చేసుకోవాలి.. ఇందుకోసం పిండి రుబ్బడానికి 10 నిమిషాల ముందు అటుకులను నీటిలో నానబెట్టండి.
ఇప్పుడు ముందుగా నానబెట్టిన మినపప్పు, మెంతులు, అటుకులు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన బియ్యాన్ని కూడా చేర్చి తగినంత నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. అలాగు అందులో రుబ్బిన పిండిలో 1 కప్పు రాగి పిండిని వేసి, ఎక్కడా ఉండలు లేకుండా చేతితో లేదా గరిటెతో బాగా కలపాలి.
ఇప్పుడు మీరు రుబ్బి సిద్దం చేసుకున్న పిండిని మూత పెట్టి 8 నుండి 10 గంటల పాటు బాగా పులియనివ్వాలి. ఇలా చేయడం వల్ల టేస్ట్‌తో పాటు పోషకాలు కూడా పెరుగుతాయి.
ఇక మార్నింగ్ పిండిలో తగినంత ఉప్పు వేసి నెమ్మదిగా కలపాలి. ఇడ్లీ పాత్ర రేకులపై కొద్దిగా నూనె రాసి, పిండిని పోసి 10-12 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. అంతే వేడివేడిగా మొత్తగా స్పాంజ్‌లా ఉండే రాగి ఇడ్లీ రెడీ అయినట్టే.. దీన్ని కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది.
రాగి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు
ఎముకల బలం : ఇతర ధాన్యాలతో పోలిస్తే రాగిలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది పిల్లల ఎముకల పెరుగుదలకు, పెద్దవారిలో ఎముకలను బలోపేతం చేస్తుంది.
షుగర్ నియంత్రణ: రాగిలో ఫైబర్ పుష్కంగా ఉంటుంది, అంతేకాదు ఇందులోని లో గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది.
రక్తహీనత నివారణ: రాగిలో ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి సహాయపడుతుంది.
బరువు తగ్గేందుకు: రాగిలో కలోరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది తిన్నప్పుడు కడుపు నిండిన భావన కలిగి, ఎక్కువ సమయం ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
