చలికాలం చర్మం పగిలి అసహ్యంగా కనిపిస్తుందా..! ఈ 5 సహజ మాయిశ్చరైజర్ల గురించి తెలుసుకోండి..

| Edited By: Anil kumar poka

Nov 15, 2021 | 1:09 PM

Skin Care Tips: చలికాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో చర్మం జిడ్డుగా మారుతుంది. పెదాలు పగిలిపోయి అసహ్యంగా కనిపిస్తాయి. బయటికి వెళ్లలేన పరిస్థితి నెలకొంటుంది. అలాంటి

చలికాలం చర్మం పగిలి అసహ్యంగా కనిపిస్తుందా..! ఈ 5 సహజ మాయిశ్చరైజర్ల గురించి తెలుసుకోండి..
Skin Care
Follow us on

Skin Care Tips: చలికాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో చర్మం జిడ్డుగా మారుతుంది. పెదాలు పగిలిపోయి అసహ్యంగా కనిపిస్తాయి. బయటికి వెళ్లలేన పరిస్థితి నెలకొంటుంది. అలాంటి సమయంలో సహజ మాయశ్చరైజర్లు చక్కగా ఉపయోగపడుతాయి. వీటిని చర్మానికి అప్లై చేస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి. చర్మం ఎల్లప్పుడు తేమగా ఉంటుంది. పూర్వపు నిగారింపును సంతరించుకుంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువ. అయితే ఆ సహజ మాయశ్చరైజర్ల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

1. షియా బటర్
షియా బటర్ సహజమైన మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. చాలా చర్మ సంరక్షణ ఉత్పత్తులలో దీనిని వాడుతారు. మీ చర్మాన్ని మృదువుగా చేయడానికి ఇది సరైనది. చర్మానికి సన్‌స్క్రీన్‌గా పనిచేస్తుంది ఎందుకంటే ఇది సూర్యుని హానికరమైన UV కిరణాలను అడ్డుకుంటుంది.

2. అలోవెరా
మీరు చర్మానికి అలోవెరా జెల్‌ను మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. అలోవెరా జెల్ మాయిశ్చరైజింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మీ చర్మానికి గొప్పగా ఉపయోగపడుతుంది. చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది.

3. ఆల్మండ్ ఆయిల్
బాదం నూనెలో విటమిన్ ఈ, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. బాదం నూనె గొప్ప సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇది ముఖ రంధ్రాలలో పేరుకుపోయిన అదనపు మురికిని తొలగిస్తుంది. చర్మాన్ని తాజాగా మెరిసేలా చేస్తుంది.

4. జోజోబా ఆయిల్
జోజోబా ఆయిల్ జిడ్డు చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దీని లక్షణాలు చర్మంలో ఉండే సహజ నూనెలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.

5. గులాబీ రేకులు, కలబంద
గులాబీ రేకులు, కలబంద ఈ రెండు పదార్థాలను ఉపయోగించి మీరు ఇంట్లో మీ మాయిశ్చరైజర్‌ను సిద్ధం చేసుకోవచ్చు. గులాబీ రేకులు, కలబంద రెండూ జిడ్డు చర్మానికి గొప్పగా ఉపయోగపడుతాయి. గులాబి రేకులు టోనింగ్, ఆస్ట్రింజెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. అలోవెరాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. ఇది జిడ్డు చర్మానికి మేలు చేస్తుంది.

NZ vs AUS, T20 World Cup 2021 Final: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఘన విజయం..

Backache: వెన్నునొప్పితో బాధపడుతున్నారా..! ఒక్కసారి ఈ ఆయుర్వేద చిట్కాలు ట్రై చేయండి..

Skin Care: మెడపైన ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..! ఈ ఐదు మార్గాలను తెలుసుకోండి..