Onion Cutting: ఉల్లిపాయలు తరుగుతుంటే కన్నీళ్లు వస్తున్నాయా..అయితే ఈ సింపుల్ చిట్కాలు మీకోసమే

|

Apr 10, 2021 | 6:17 PM

Onion Cutting: సాధారణంగా ఉల్లి పాయ లేకుండా చాలావరకు ఏం కూర వండలేం. అందుకే ఎంత రేటు పెట్టైనా ఉల్లిపాయలు కొంటుంటారు..ప్రతి ఇంట్లోనూ..

Onion Cutting: ఉల్లిపాయలు తరుగుతుంటే కన్నీళ్లు వస్తున్నాయా..అయితే ఈ సింపుల్ చిట్కాలు మీకోసమే
onion cutting
Follow us on

Onion Cutting: సాధారణంగా ఉల్లి పాయ లేకుండా చాలావరకు ఏం కూర వండలేం. అందుకే ఎంత రేటు పెట్టైనా ఉల్లిపాయలు కొంటుంటారు..ప్రతి ఇంట్లోనూ వివిధ రకాల వంటకాలలో విరివిగా వాడుతారు. అలాగే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామెత కూడా ఉంది. అయితే ఉల్లి మేలేమోగానీ దానిని కట్‌ చేసేటప్పుడు ఆ ఘాటుకు కళ్ల వెంట నీళ్లు కారడం మాత్రం గ్యారెంటీ. అయితే ఎంతటి ఘాటైన ఉల్లినైనా ఒక్కచుక్క కన్నీళ్లు రాకుండా కోయవచ్చంటూ తాజాగా ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కాగా, మ్యాక్స్‌ మెక్‌కెన్‌ అనే వ్యక్తి ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. కళ్ల వెంట నీళ్లు రాకుండా ఉల్లిపాయలు ఎలా కోయవచ్చో వివరించాడు. ఈ వీడియో ప్రకారం మొదట తడిగా ఉండే వస్త్రాన్ని తీసుకుని దాన్ని ఉల్లిపాయలు కట్ చేసే చాపింగ్‌ బోర్డ్ మీద ఉంచాలి. ఆ తరువాత ఉల్లిపాయలు తరగడం మొదలు పెడితే మీ కళ్ల వెంట ఒక్క చుక్క కూడా నీరు రాదంట. సాధారణంగా ఉల్లిని కట్‌ చేసినప్పుడు వాటినుంచి నుంచి వచ్చే కొన్ని ఆమ్లాలు కళ్ల వెంట నీళ్లు తెప్పిస్తాయి. తడి వస్త్రాన్ని చాపింగ్ బోర్డు మీద ఉంచడం వలన అది ఆమ్లాలను పీల్చుకుంటుంది. ఫలితంగా ఉల్లిలో ఉండే ఘాటైన యాసిడ్స్ కళ్లను చేరవు కాబట్టి కళ్ల నుంచి నీళ్లు రావని మ్యాక్స్ వీడియోలో వివరిస్తున్నారు. వైరల్‌ అవుతోన్న ఈ వీడియో చాలా సింపుల్‌గా ఉంది. కాబట్టి మీరూ ఒకసారి ప్రయత్నించి ఈ చిట్కా ఎంతవరకు పనిచేస్తుందో తెలుసుకోండి.

Also Read : ప్రపంచంలోనే అత్యున్నత ఆహారం ఈ ‘నాచు మొక్క’ …. ప్రతి రోజూ తినమంటున్న న్యూట్రీషియన్స్

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఇక్కడ దేవుడు.. ఆయన్ని దర్శించుకోవాలంటే హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్న వారికి మాత్రమే ప్రవేశం