వాతావరణం క్రమంగా మారుతోంది. నవంబర్ ఇలా మొదలైందో లేదో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇక వింటర్‌లో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం సర్వసాధారణం. మరీముఖ్యంగా గర్భిణీలు చలికాలంలో మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో గర్భిణీల్లో జలుబు, దగ్గు, జలుబు, వైరల్ ఇన్‌ఫెక్షన్ వంటి ప్రమాదం ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇది తల్లితో పాటు కడుపులో బిడ్డపై కూడా ప్రభావం పడుతుంది. మరి ఇలాంటి సమయంలో గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* వింటర్‌లో గర్భిణీలు చలి పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ముఖ్యంగా కూల్ డ్రింక్స్ తీసుకోవడం, కూల్ వాటర్ తాగడం వంటి వాటివల్ల జలుబు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. సహజంగానే గర్భం దాల్చిన సమయంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
* తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్వీట్స్ ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే వేయించిన ఆహార పదార్థాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఉప్పు ఎక్కువగా ఉండే ఫాస్ట్ ఫుడ్, చిప్స్‌ను తీసుకోకూడదు. ఈ సమయంలో జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సహజంగానే గర్భిణీల్లో జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే త్వరగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి.
* వాకింగ్ చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానేయకూడదు. సాధారణంగా చలికి బద్దగించి ఎక్కువసేపు పడుకుంటారు. కానీ దీని వల్ల నడుము నొప్పి వంటి సమస్యలు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే ఉదయం, సాయంత్రం కనీసం 15 నుంచి 20 నిమిషాలు వాకింగ్ చేయాలి.
* గర్భిణీలు కచ్చితంగా చలికాలంలో ఉన్ని దుస్తులను వాడాలి. అలాగే చేవుల్లోకి గాలి వెళ్లకుండా మఫ్లర్ వంటి వాటిని ఉపయోగించాలి. చలికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయితే త్వరగా జలుబు, జ్వరం వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..