AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లల నుంచి పెద్దల వరకు.. త్వరగా శక్తినిచ్చే సూపర్‌ ఫుడ్.. రోజూ ఒక కప్పు తింటే..

అటుకులు లేదా పోహా భారతీయ ఆహారంలో సులభంగా లభించే అల్పాహార పదార్థం. ఇందులో కార్బోహైడ్రేట్లు, కొంత ప్రోటీన్, ఫైబర్, ఐరన్ వంటి అద్భుతమైన పోషకాలు లభిస్తాయి. కూరగాయలు, పప్పులు, వేరుశెనగలు వంటి పదార్థాలతో కలిపి తీసుకుంటే సమతుల ఆహారంలో భాగంగా ఉపయోగపడవచ్చు..

పిల్లల నుంచి పెద్దల వరకు.. త్వరగా శక్తినిచ్చే సూపర్‌ ఫుడ్.. రోజూ ఒక కప్పు తింటే..
Poha Health Benefits
Shaik Madar Saheb
|

Updated on: Sep 07, 2026 | 4:55 PM

Share

మనం నిత్యజీవితంలో చూసే అటుకులు కేవలం ఒక సాధారణ స్నాక్ మాత్రమే కాదు. అవి ఆరోగ్యానికి చేసే మేలు అపారం.. వీటిలో దాగి ఉన్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అటుకులను అస్సలు వదిలిపెట్టరు. వడ్ల నుంచి తయారుచేసే ఈ అటుకులు.. సరైన పద్ధతిలో తీసుకుంటే అనేక శారీరక సమస్యలకు పరిష్కారం చూపుతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి, జీర్ణ సమస్యలు ఉన్నవారికి, తక్షణ శక్తిని కోరుకునే వారికి అటుకులు ఒక అద్భుతమైన ఆహారంగా చెప్పవచ్చు.

పోషకాల నిధి అటుకులు

అటుకులలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది రక్తహీనత సమస్యను చాలా సులువుగా నివారిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో అటుకులు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా, అటుకులలో విటమిన్స్ ఏ, బీ, సీ, కే వంటివి లభిస్తాయి. ఇవి శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లను అందిస్తాయి. ఈ సమగ్ర పోషకాల సమ్మేళనం మొత్తం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

తక్షణ శక్తికి ఉత్తమ పరిష్కారం..

నీరసంగా, డీహైడ్రేట్ అయినవారు అటుకులను పాలలో నానబెట్టుకుని తింటే తక్షణమే శక్తి లభిస్తుంది. శరీరానికి వెంటనే శక్తిని అందించే గుణం అటుకులకు ఉంది. ముఖ్యంగా ఉదయం పూట అల్పాహారంగా తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఇది అలసటను తగ్గించి, రోజంతా చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి అటుకులు

బరువు తగ్గాలి అనుకునేవారికి అటుకులు ఒక గొప్ప ఆహారం. రోజూ అటుకులను పాలలో నానబెట్టుకుని తినడం వల్ల చాలా త్వరగా బరువు తగ్గుతారు. దీనికి ప్రధాన కారణం అటుకులలో గ్లూకోజ్ కానీ, కొవ్వు పదార్థాలు కానీ అస్సలు ఉండవు. పైగా, వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది, కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.. తద్వారా అధిక ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది.

జీర్ణక్రియకు అద్భుతమైన ఔషధం

అధిక ఫైబర్ కారణంగా అటుకులు జీర్ణ సమస్యలను తొలగించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక మంచి పరిష్కారం. క్రమం తప్పకుండా అటుకులు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

శరీర రక్షణకు యాంటీఆక్సిడెంట్లు..

అటుకులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు అనేక వైరస్‌ల నుంచి మన శరీరాన్ని చక్కగా కాపాడతాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల బారి నుంచి రక్షించడంలో సహాయపడతాయి.

మధుమేహులు, గుండె ఆరోగ్యానికి..

మధుమేహం ఉన్నవారు కూడా అటుకులను చాలా సులువుగా తినవచ్చు. షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండటంతో పాటు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అన్నం తినకూడదు అనుకునే షుగర్ పేషెంట్స్ రోజూ ఒక కప్పు అటుకులు తినడం వల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి, జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. అటుకులు గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

అన్ని వయసుల వారికీ అనువైనది..

పిల్లలకు, పెద్దలకు, అలాగే కడుపుతో ఉన్న గర్భిణీలకు అటుకులు ఒక మంచి ఆహారంగా చెప్పవచ్చు. గర్భిణులలో ఐరన్ లోపాన్ని నివారించడంలో, శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఇవి తోడ్పడతాయి. కాబట్టి, అటుకులను తేలికగా తీసిపారవేయకుండా, ప్రతిరోజూ ఒక కప్పు మీ డైట్‌లో చేర్చుకోవడానికి ప్రయత్నించండి. పాలలో నానబెట్టుకుని తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆటోమేటిక్‌గా పొందవచ్చు.. అందుకే.. అటుకులను డైట్ లో చేర్చుకోవాలని డైటీషియన్లు చెబుతున్నారు.

ఏమైనా అనారోగ్య సమస్యలుంటే నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

Follow Us