Valentine Day offer: ప్రేమికుల రోజు.. గిఫ్ట్ కొనేందుకు డబ్బుల్లేవా.. ఇది మీకోసమే..

మీ వాలెంటైన్ ను కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరచాలనుకుంటే వెంటనే మీ ప్రయత్నాలు మొదలుపెట్టండి. ఎందుకంటే ప్రేమికుల రోజున ఇచ్చే కానుకలు మీ పార్ట్ నర్ కు జీవితాంతం గొప్ప అనుభూతిని ఇస్తాయి. అది కొత్త ఇల్లు, కారు, లేదా ఖరీదైన ఆభరణం. ఇలా ఏదైనా మీ టార్గెట్ కావచ్చు. మీ జేబుకు చిల్లు పడకుండా మీకు అవసరమైన డబ్బును సమకూర్చేందుకు పలు బ్యాంకులు, యాప్ లు ముందుకు వచ్చాయి. ఇవి మీ లగ్జరీ అవసరాలను తీర్చేందుకు మంచి ప్రణాళికలను సూచిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు క్రెడిట్, డెబిట్ కార్డులపై ఇప్పటికే ఆఫర్లు ప్రకటించాయి.

Valentine Day offer: ప్రేమికుల రోజు.. గిఫ్ట్ కొనేందుకు డబ్బుల్లేవా.. ఇది మీకోసమే..
Valentine Day Gift

Edited By:

Updated on: Feb 12, 2025 | 12:38 PM

Valentine’s Day 2025: మీ వాలెంటైన్ ను కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరచాలనుకుంటే వెంటనే మీ ప్రయత్నాలు మొదలుపెట్టండి. ఎందుకంటే ప్రేమికుల రోజున ఇచ్చే కానుకలు మీ పార్ట్ నర్ కు జీవితాంతం గొప్ప అనుభూతిని ఇస్తాయి. అది కొత్త ఇల్లు, కారు, లేదా ఖరీదైన ఆభరణం. ఇలా ఏదైనా మీ టార్గెట్ కావచ్చు. మీ జేబుకు చిల్లు పడకుండా మీకు అవసరమైన డబ్బును సమకూర్చేందుకు పలు బ్యాంకులు, యాప్ లు ముందుకు వచ్చాయి. ఇవి మీ లగ్జరీ అవసరాలను తీర్చేందుకు మంచి ప్రణాళికలను సూచిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు క్రెడిట్, డెబిట్ కార్డులపై ఇప్పటికే ఆఫర్లు ప్రకటించింది.

మనీ కంట్రోల్ అనే యాప్ ద్వారా మీ రు ఈ వాలెంటైన్ డే కోసం ఏకంగా రూ. 50 లక్షల వరకు రుణం పొందొచ్చు. అది కూడా ఏడాదికి 10.5 పర్సెంట్ వడ్డీ నుంచి ఇవి ప్రారంభమవుతున్నాయి. అంతేకాదు ఇది వందశాతం పేపర్ ఫ్రీ ప్రక్రియ. అంటే మీరు ఇదంతా ఒక్క క్లిక్ ద్వారా పూర్తి చేయొచ్చు. మీకు తగిన లోన్ ఆఫర్ ను ఎంచుకుని ఈ కేవైసీని ఆన్ లైన్ లో పూర్తి చేస్తే సరిపోతుంది. ఇక ఇఎంఐ సెటప్ ను సెలక్ట్ చేసి మీకు కావలసిన మొత్తాన్ని పొందొచ్చు.

ఫోన్లపై ఆఫర్లు…

ఇప్పటికే పోకో తమ వాలెంటైన్స్ డే సేల్ ను ప్రకటించింది. వివిధ రకాల స్మార్ట్ ఫోన్లపై కళ్లుచెదిరే ఆఫర్లను తీసుకువచ్చింది. పోకో ఎం, ఎక్స్ సిరీస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఇవ్వనుంది. ఈ సేల్ ఫిబ్రవరి 14నే ముగియనుంది. పోకో ఎం6ప్లస్ 5జీ నుంచి మొదలుకుని ఎక్స్ 7ప్రో 5జీ వరకు ఈ ఆఫర్లు ఉన్నాయి. ధరలు రూ.10,249 నుంచి రూ.24,999 వరకు ఉన్నాయి.

ఐఫోన్ లపై తగ్గింపు..

ఐఫోన్ 13, 15, 16 సిరీస్ లపై బీఓబీ కార్డు ద్వారా రూ.5 వేల వరకు తగ్గింపు పొందే అవకాశాన్ని కల్పించింది. వీటికి ఈ ఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఆఫర్ ఈ నెల 15న ముగియనుంది.

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో…

బీఓబీ కార్డు ద్వారా అమెజాన్ లో కూడా షాపింగ్ చేసుకోవచ్చు. ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసిన వారికి 7.5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే టూవీలర్ పై రూ.5వేల వరకు ఈఎంఐ తగ్గింపు లభిస్తోంది.