చిన్న వయసులోనే పిల్లల్లో మానసిక సమస్యలు.. కారణం అదేనని అంటున్న నిపుణులు!

చిన్న వయసులోనే పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వడం వల్ల వారి మానసిక, శారీరక అభివృద్ధి కుంటుపడుతుంది. కొంతమంది పిల్లలు ఈ మొబైల్ ఫోన్లకు ఎంతగా బానిసలయ్యారంటే తమ తల్లిదండ్రులతో కూడా సమయం గడపడం లేదు. వారి నుంచి మొబైల్ ఫోన్లను లాక్కుంటే తీవ్ర స్థాయిలో కోపం, అసహనం, మానసిక ఒత్తిడిని ప్రదదర్శిస్తుంటారు..

చిన్న వయసులోనే పిల్లల్లో మానసిక సమస్యలు.. కారణం అదేనని అంటున్న నిపుణులు!
Screen Time And Emotional Problems In Children

Updated on: Feb 13, 2026 | 10:53 AM

మొబైల్ ఫోన్లు, టీవీలు పిల్లల బాల్యాన్ని దోచుకుంటున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. నేటి కాలంలో పిల్లలు బయట ఆడుకునే బదులు టీవీ చూస్తూ, ఫోన్లు వాడుతూ సమయం గడుపుతున్నారు. ఇది వారి మానసిక ఆరోగ్యం, శారీరక అభివృద్ధిని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తోంది. కాబట్టి ఈ సమస్యను ఎలా నివారించాలో వైద్యుల మాటల్లో తెలుసుకుందాం..

న్యూరో కేర్ సెంటర్‌కు చెందిన డాక్టర్ జాలీ జైన్ గుప్తా మాట్లాడుతూ.. సాధారణంగానే నేటితరం తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత సమయం ఇవ్వలేకపోతున్నారు. అంతేకాకుండా పిల్లలు అల్లరి చేయకుండా ప్రశాంతంగా ఉంచడానికి మొబైల్ ఫోన్లు, టీవీల ముందు కూర్చోబెడుతున్నారు. ఇది పిల్లల మానసిక సమతుల్యతను మరింత దిగజార్చుతుంది. అంతేకాకుండా వారి సామాజిక, శారీరక అభివృద్ధి కూడా కుంగిపోతుంది. ఆటలు, క్రీడలు వంటి సహజ కార్యకలాపాలు కూడా తగ్గుతున్నాయి. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలతో పాటు తమకు తాముగా కఠినమైన పరిమితులను ఏర్పరచుకోవడం వంటి కొన్ని చిట్కాలను పాటించడం మంచిదని అన్నారు.

2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలను మొబైల్ ఫోన్లకు పూర్తిగా దూరంగా ఉంచాలి. వారికి వీడియో కాల్స్ చేయడానికి కూడా అనుమతించకూడదు. ఈ వయస్సులో స్క్రీన్ వాడకంవల్ల మెదడు అభివృద్ధిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. 2 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పిల్లలకు స్క్రీన్ సమయం చాలా పరిమితం చేయాలి. చదవడానికి ఉపయోగించినప్పటికీ రోజుకు 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఇవ్వకూడదు. వారిని ఆన్‌లైన్‌ గేమ్స్, వీడియోలు, రీల్స్‌కు దూరంగా ఉంచాలి. వీటన్నిటితో పాటు మొబైల్ ఫోన్లు ఉపయోగించే సమయాన్ని పరిమితం చేయాలి.

ఇవి కూడా చదవండి

పేరెంట్స్ ఏం చేయాలి?

  • ప్రతిరోజూ మీ పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలి.
  • బహిరంగ ఆటలు ఆడటానికి ప్రోత్సహించాలి.
  • ఇంట్లో ఫోన్ లేని సమయం సెట్ చేసుకోవాలి.
  • తల్లిదండ్రులు కూడా స్క్రీన్ వాడకాన్ని బాగా తగ్గించాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చయండి.