AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peel Garlic Fast: కుస్తీలు పడే పనిలేదు.. ఈ 3 చిట్కాలతో క్షణాల్లో వెల్లుల్లి పొట్టు తీసేయొచ్చు!

వంటిట్లో చాలా మంది మహిళలు ఎదుర్కొనే ప్రధాన సమస్య.. వెల్లుల్లి రెబ్బలు తీయడం. ఇది చిన్న పనే అయినప్పటికీ, కొన్నిసార్లు అది చాలా సమయం తీసుకుంటుంది. కానీ కొన్ని చిన్న కిచెన్ చిట్కాలను పాటిస్తే ఈ పనిని చాలా సులభంగా చేయవచ్చని మీకు తెలుసా? అవును మూడు సింపుల్‌ చిట్కాలతో క్షణాల్లో వెల్లుల్లి రెబ్బలను తీసేయొచ్చు అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.

Peel Garlic Fast: కుస్తీలు పడే పనిలేదు.. ఈ 3 చిట్కాలతో క్షణాల్లో వెల్లుల్లి పొట్టు తీసేయొచ్చు!
Easy Garlic Peeling
Anand T
|

Updated on: May 27, 2026 | 6:19 PM

Share

వంటిట్లో చాలా మంది మహిళలు ఎదుర్కొనే ప్రధాన సమస్య.. వెల్లుల్లి రెబ్బలు తీయడం.. అయితే ఇదో పెద్ద పనా.. క్షణాల్లో వలిచేస్తాం అనుకుంటారు చాలా మంది. కానీ వొలవడానికి కూర్చుంటేనే అసలు సంగతి తెలుస్తుంది.ఆ చిన్న రెబ్బలలకు గట్టిగా అంటుకుపోయే పొట్టు.. తీసే వారిని నానా తిప్పలు పెడుతుంది. దీని వల్ల అనుకున్నదానికంటే ఎక్కువ టైం పడుతుంది. ముఖ్యంగా వంట హడావిడిలో ఉన్నప్పుడు ఇది కాస్త విసుగు తెప్పిస్తుంది. కానీ షెఫ్‌లు మాత్రం వాటిని క్షణాల్లో వలిచేస్తుంటారు. అది ఎలా సాధ్యమని మీరెప్పుడైనా ఆలోచించారా?. అందుకు వారు కొన్ని సింపుల్ ట్రిక్స్ ఫాలో అవుతారు అవేంటో ఇప్పుడు చూద్దాం.

కంటైనర్‌లో వేసి ఊపడం: మీకు ఒకేసారి ఎక్కువ మొత్తంలో వెల్లుల్లి రెబ్బలు కావాలనుకున్నప్పుడు ఈ పద్ధతి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ముందుగా వెల్లుల్లిపాయ తీసుకొని దాని నుంచి రెబ్బలను వేరు చేయండి. వాటిని ఒక మూత ఉన్న గిన్నెలో లేదా స్టీల్ బాక్స్‌లో వేయండి. ఇప్పుడు ఆ బాక్స్‌ను ఒక 10 నుండి 15 సెకన్ల పాటు గట్టిగా ఊపండి. ఇలా చేయడం ద్వారా వెల్లుల్లి రెబ్బలు ఒకదానికొకటి బలంగా తగలి వాటి పొట్టు లూజ్ అవుతుంది. మీరు బాక్స్ తెరిచి చూసేసరికి చాలా వరకు పొట్టు దానంతట అదే ఊడిపోయి ఉంటుంది. అప్పుడు మీరు ఈజీగా ఆ పొట్టును తొలగించవచ్చు.

కత్తితో పొట్టును లూజ్ చేయడం: ఒకటి లేదా రెండు రెబ్బలు మాత్రమే త్వరగా కావాలనుకుంటే ఈ పద్ధతి చాలా బాగా ఉపయోగపడుకుంది. ఇందుకోసం మీరు వెల్లుల్లి రెబ్బను చాపింగ్ బోర్డ్ మీద ఉంచండి. తర్వాత కత్తి తీసుకొని నీ సైడ్‌తో వెల్లుళ్లిపై పెట్టి చేత్తో మెల్లగా నొక్కండి. ఇలా చేయడం ద్వారా వెల్లుల్లి నలిగిపోతుంది. అప్పుడు పొట్టును ఈజీగా తొలగించవచ్చు. వంటల్లో వెంటనే వెల్లుల్లిని కట్ చేసి వేయాలనుకున్నప్పుడు ఈ ట్రిక్ బాగా పనిచేస్తుంది.

నీటిలో నానబెట్టడం: శ్రమ లేకుండా పొట్టు సులభంగా వచ్చేయాలంటే ఈ చిట్కా బలే పనిచేస్తుంది. ఇందుకోసం మీరు వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా గోరువెచ్చని నీటిలో ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టండి. నీటి వల్ల వెల్లుల్లి పొట్టు మెత్తబడి, దానంతట అదే వదులవుతుంది. ఐదు నిమిషాల తర్వాత పొట్టును చేత్తో లాగితే చాలా సులభంగా వచ్చేస్తుంది. ముఖ్యంగా బాగా ఎండిపోయి, పొట్టు అస్సలు రాని పాత వెల్లుల్లిపాయలకు ఈ పద్ధతి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సింపుల్‌ చిట్కాలతో మీరు కష్టపడకుండానే ఈజీగా వెల్లుల్లి రెబ్బలను తొలగించవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us