AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Care: మీ వయస్సు 40 దాటిందా..? గుండెపోటు రిస్క్ తగ్గాలంటే ఇలా చేయండి..

40 ఏళ్లు దాటిన తర్వాత గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో ముఖ్యం. అనారోగ్యకరమైన ఆహారం, వ్యాయామం లేకపోవడం, పొగతాగడం, మద్యం, ఒత్తిడి, నిద్రలేమి వంటి జీవనశైలి అలవాట్లతో పాటు అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు గుండెపోటు ముప్పును పెంచే అవకాశం ఉంది. గుండెపోటు అకస్మాత్తుగా వచ్చినట్లు అనిపించినా, దీని వెనుక ఏళ్ల తరబడి కొనసాగిన అనారోగ్యకరమైన అలవాట్లు ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Heart Care: మీ వయస్సు 40 దాటిందా..? గుండెపోటు రిస్క్ తగ్గాలంటే ఇలా చేయండి..
Heart Care
Janardhan Veluru
|

Updated on: Aug 22, 2026 | 4:42 PM

Share

గుండెపోటు కారణంగా యువకులు కూడా హఠాన్మరణం చెందుతున్న సంఘటనలు మనం నిత్యం చూస్తునే ఉన్నాం. మరీ ముఖ్యంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో 40 ఏళ్ల వయస్సు పైబడిన వారిలో హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతోంది. వీరు గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గుండెపోటు ఒక్కసారిగా వచ్చినట్లు అనిపించినప్పటికీ, చాలా ఏళ్లుగా గుండె ఆరోగ్యం విషయంలో మనం చేసిన చిన్నచిన్న తప్పులే దీనికి కారణం అవుతున్నాయి. అనారోగ్యకరమైన ఆహారం, వ్యాయామం లేకపోవడం, పొగతాగడం, మద్యం, ఒత్తిడి, నిద్రలేమి, అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి అనేక అంశాలు క్రమంగా గుండె సంబంధిత సమస్యలకు కారణమవుతాయి.

ఉదయం అల్పాహారం మానేయడం, తరచూ నూనెలో వేయించిన ఆహారం ఇష్టంగా తినడం, రోజంతా కూర్చునే జీవనశైలి వంటి అలవాట్లు గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్, రక్తపోటు నియంత్రణలో లేకపోతే గుండెకు వెళ్లే రక్తనాళాల్లో సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది.

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే..

  • రోజూ 30 నుంచి 45 నిమిషాల పాటు వేగంగా నడవడం వంటి శారీరక కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
  • హోటల్ ఫుడ్స్‌కు దూరంగా ఉంటూ ఇంట్లో తయారు చేసిన సాధారణ ఆహారం తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలను ఆహారంలో పెంచాలి.
  • నూనె, ఉప్పు, చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని తగ్గించాలి. శరీర బరువును నియంత్రణలో ఉంచడం కూడా ముఖ్యమే.
  • పొగతాగడం, మద్యం తాగడం పూర్తిగా మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
  • తగినంత నిద్ర, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
  • 40 ఏళ్లు దాటిన తర్వాత కనీసం ఏడాదికి ఒకసారి రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ వంటి పరీక్షలు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

(గమనిక: ఇది ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు లేదా గుండెపోటు లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించాలి)

Follow Us