
నేటి కాలంలో మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అయితే మన ఇంట్లోని వంటగదిలో సులభంగా లభించే చిన్న ఉల్లిపాయతో ఈ దీర్ఘకాలిక సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చని మీకు తెలుసా? ఉల్లిపాయ కేవలం వంటకు రుచిని అందించడమే కాకుండా, అనేక అనారోగ్య సమస్యలను నివారించే గొప్ప ఔషధ గుణాలను కలిగి ఉంది.
ఉల్లిపాయ రసం రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే అద్భుతమైన గుణం కలిగి ఉంది. ముఖ్యంగా చిన్న ఉల్లిపాయ రక్తాన్ని శుద్ధీకకరించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పరిశోధనల ప్రకారం, క్రమం తప్పకుండా ఉల్లిపాయ రసాన్ని తీసుకునేవారిలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి, చెడు కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గుతుందని నిరూపితమైంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడం చాలా ముఖ్యం. రాత్రి సమయాలలో నియంత్రణకు రానంతగా షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. ఈ పరిస్థితిలో ఉల్లిపాయ రసంలో ఉండే అల్లైల్ ప్రొపైల్ అనే ప్రత్యేక గుణం శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులోకి తీసుకురావడానికి సహాయపడుతుంది. ఇది డయాబెటిస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే ఒక సహజసిద్ధమైన ఔషధంలా పనిచేస్తుంది.
ఉల్లిపాయలో ఉండే ప్రీబయోటిక్ గుణాలు ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు పోషకాలు సరిగ్గా శోషించుకునేలా సహాయపడతాయి. జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయడం ద్వారా మెటబాలిజం మెరుగై, శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకుపోతాయి. అలాగే, ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
5 నుండి 6 చిన్న ఉల్లిపాయలు లేదా రెండు పెద్ద ఉల్లిపాయలను తీసుకుని తొక్క తొలగించాలి. దీన్ని మిక్సీ జార్లో వేసి, చిటికెడు జీలకర్ర, 2 మిరియాలు, చిటికెడు పింక్ సాల్ట్, 4 పుదీనా ఆకులు వేసి మెత్తగా గ్రాండ్ చేసుకోవాలి. ఇందులో గ్లాసు నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ రసాన్ని వడకట్టి ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం తర్వాత సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఉల్లిపాయను కేవలం రసంగానే కాకుండా, ప్రతిరోజూ కొద్ది మొత్తంలో పచ్చి ఉల్లిపాయగా తిన్నా కూడా మీకు ఈ ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా మధుమేహం, కొలెస్ట్రాల్ ఉన్నవారు ఈ సులభమైన పద్ధతిని పాటించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..