
జిడ్డుగల చర్మం ఉన్నవారు తరచుగా మొటిమలు, మృత కణాలు, అధిక నూనె ఉత్పత్తి సమస్యలను ఎదుర్కొంటారు. దీనిని నియంత్రించడానికి సరైన రోజువారీ చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. సరైన జీవనశైలి, సమతుల్య ఆహారంతో జిడ్డు చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా ఉంచుకోవచ్చు. ఇందుకోసం పాటించాల్సిన మరికొన్ని చిట్కాలు, నియమాలేంటో పూర్తి డిటెల్స్ ఇప్పుడు చూద్దాం..
జిడ్డు చర్మం ఉన్నవారు ముఖాన్ని తరచుగా కడుక్కుంటూ ఉంటారు. కానీ, అలా చేయడం వల్ల చర్మం మరింత పొడిగా మారి, మరింత ఎక్కువ నూనె ఉత్పత్తి అవుతుంది. కాబట్టి, రోజులో కేవలం రెండు సార్లు మాత్రమే ఆయిల్-ఫ్రీ, జెల్-బేస్డ్ లేదా ఫోమింగ్ ఫేస్‌వాష్‌ను ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖంపై పేరుకున్న ఆయిల్, జిడ్డు అదనపు సెబమ్‌ను తొలగిస్తుంది.
క్లెన్సింగ్ తర్వాత ఆల్కహాల్ లేని టోనర్‌ను ఉపయోగించడం చాలా ముఖ్యం. ఇది చర్మం pH స్థాయిలను సమతుల్యం చేయడంతో పాటు, పెద్దదిగా మారిన రంధ్రాలను బిగుతుగా మార్చడంలో సహాయపడుతుంది.
చర్మంపై పేరుకున్న మృతకణాలను తొలగించడానికి వారానికి ఒకటి లేదా రెండు సార్లు మైల్డ్ స్క్రబ్‌తో ఎక్స్‌ఫోలియేట్ చేయాలి. ఇది రంధ్రాలు మూసుకుపోకుండా నివారిస్తుంది. చర్మాన్ని తాజాపరుస్తుంది. అయితే అతిగా స్క్రబ్ చేయడం వల్ల చర్మానికి హాని జరుగుతుంది కాబట్టి జాగ్రత్త వహించాలి.
చర్మం జిడ్డుగా ఉంది కదా అని మాయిశ్చరైజర్ రాయడం మానేయకూడదు. ఇది చాలా పెద్ద పొరపాటు. చర్మానికి తగిన తేమ అందకపోతే గ్రంథులు మరింత నూనెను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి, ఎప్పుడూ లైట్-వెయిట్, వాటర్-బేస్డ్ లేదా ఆయిల్-ఫ్రీ మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి.
ఉదయం పూట బయటికి వెళ్లే ముందు తప్పనిసరిగా నాణ్యమైన సన్‌స్క్రీన్‌ను రాసుకోవాలి. ఇది సూర్యుని నుండి వచ్చే హానికరమైన యూవీ (UV) కిరణాల నుండి చర్మాన్ని రక్షించి, ముఖంపై ముడతలు పడకుండా కాపాడుతుంది. అదనంగా, తగినంత నీరు త్రాగడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా జిడ్డు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..