AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Migraine vs Normal Headache: మైగ్రేన్‌ తల నొప్పి.. సాధారణ తలనొప్పికి తేడా తెలుసా? ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వద్దు..

తరచుగా వచ్చే తలనొప్పులు సాధారణమని చాలా మంది భావిస్తుంటారు. అందుకే నొప్పి నివారణ మందులు తీసుకుని కొంత విశ్రాంతి తీసుకుని సరిపెట్టుకుంటారు. కానీ తలనొప్పి పదే పదే వచ్చినప్పుడు, ఇది తీవ్రంగా ఉన్నప్పుడు, రోజువారీ పనులు చేయలేనప్పుడు ఈ నొప్పిని తేలికగా తీసుకోవడం..

Migraine vs Normal Headache: మైగ్రేన్‌ తల నొప్పి.. సాధారణ తలనొప్పికి తేడా తెలుసా? ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వద్దు..
Differences Of Migraine Or Headache
Srilakshmi C
|

Updated on: Feb 16, 2026 | 8:30 PM

Share

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో తలనొప్పి అనుభవం ఉంటుంది. ఇది ఒక సాధారణ సమస్య. ఇలా తరచుగా వచ్చే తలనొప్పులు సాధారణమని చాలా మంది భావిస్తుంటారు. అందుకే నొప్పి నివారణ మందులు తీసుకుని కొంత విశ్రాంతి తీసుకుని సరిపెట్టుకుంటారు. కానీ తలనొప్పి పదే పదే వచ్చినప్పుడు, ఇది తీవ్రంగా ఉన్నప్పుడు, రోజువారీ పనులు చేయలేనప్పుడు ఈ నొప్పిని తేలికగా తీసుకోవడం సరైనది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ రకమైన నొప్పి కూడా మైగ్రేన్ కావచ్చు. కాబట్టి మైగ్రేన్, సాధారణ తలనొప్పి మధ్య తేడా ఏమిటి? ఈ సమస్యకు కారణాలు ఏమిటి? దానిని నివారించడానికి ఏమి చేయాలో తెలుసుకుందాం..

మైగ్రేన్ – సాధారణ తలనొప్పి మధ్య తేడా ఏమిటి?

లేడీ హార్డింగ్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎల్.హెచ్. ఘోటేకర్ మాట్లాడుతూ.. మైగ్రేన్, సాధారణ తలనొప్పుల మధ్య చాలా తేడా ఉంది. సాధారణ తలనొప్పులు సాధారణంగా తేలికపాటివి. నుదిటిపై ఒత్తిడి లాగా ఉంటాయి. అలసట, ఒత్తిడి, నిద్ర లేకపోవడం, ఎక్కువసేపు స్క్రీన్ సమయం వల్ల సాధారణ తలనొప్పి వస్తుంది. అదే మైగ్రేన్ నొప్పి అయితే తీవ్రంగా ఉంటుంది. తలకి ఒక వైపున ఇది వస్తుంది. మైగ్రేన్ తలనొప్పులు వాంతులు, వికారం కూడా కలిగిస్తాయి. అంతేకాకుండా ఈ నొప్పి చాలా రోజులపాటు ఉంటుంది. కానీ సాధారణ తలనొప్పులు విశ్రాంతి లేదా మందులతో ఉపశమనం పొందవచ్చు. కానీ మైగ్రేన్‌లకు ప్రత్యేక చికిత్స, జాగ్రత్తలు అవసరం. అందుకే రెండింటి మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

మైగ్రేన్ తలనొప్పి నివారించడానికి చిట్కాలు

జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా మైగ్రేన్‌లను నివారించవచ్చు. ప్రతిరోజూ తగినంత నిద్రపోవాలి. ప్రకాశవంతమైన కాంతికి గురికావడం, పెద్ద శబ్దం, మొబైల్ లేదా టీవీని ఎక్కువగా ఉపయోగించడం తగ్గించాలి. అధిక ఒత్తిడి మైగ్రేన్‌లను పెంచుతుంది. కాబట్టి యోగా, ధ్యానం, లోతైన శ్వాస తీసుకోవడం వంటివి అలవాటు చేసుకోవాలి. వీటన్నింటితో పాటు ఎక్కువసేపు ఆకలితో ఉండకూడదు. సమతుల్య ఆహారం తీసుకోవాలి. కెఫిన్, వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం తగ్గించాలి. అవసరమైతే డాక్టర్‌ని సంప్రదించి సూచించిన విధంగా మందులు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

తలనొప్పి నివారణకు చిట్కాలు

సాధారణ తలనొప్పిని నివారించడానికి రోజువారీ అలవాట్లపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. అలాగే డీహైడ్రేషన్ తలనొప్పికి దారితీస్తుంది. అందుకే పుష్కలంగా నీళ్లు తాగాలి. ఎక్కువసేపు మొబైల్, కంప్యూటర్‌ను చూడటం మానుకోవాలి. కళ్ళకు క్రమం తప్పకుండా విశ్రాంతి ఇవ్వాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. తేలికపాటి వ్యాయామాలు చేయాలి. సరైన భంగిమలో కూర్చోవాలి. మెడ, భుజాలపై ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా ఉండాలి. సమయానికి తినడం, తగినంత నిద్రపోవడం వల్ల తలనొప్పిని నివారించవచ్చు. తలనొప్పి తరచుగా వస్తుంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us