AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిమ్మకాయ, లవంగాలతో దోమలను ఇంట్లోంచి ఈజీగా తరిమేయండి..  రూపాయి ఖర్చు లేని సహజ చిట్కా!

సాయంత్రం కాగానే ఇంట్లోకి దోమలు గుంపులు గుంపులుగా వచ్చి చేరడం, రాత్రివేళ ప్రశాంతమైన నిద్రను పాడు చేయడం చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య. దోమల నివారణకు మార్కెట్లో లభించే కెమికల్ కాయిల్స్, లిక్విడ్స్ లేదా స్ప్రేలు ఎక్కువగా వాడుతుంటారు. అయితే వీటి నుంచి వచ్చే పొగ, రసాయనాల వల్ల శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు పరిష్కారంగా మన వంటగదిలోనే లభించే నిమ్మకాయ, లవంగాలతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని నాచురల్ మస్కిటో రిపెల్లెంట్ తయారు చేసుకోవచ్చని హెల్త్, లైఫ్‌స్టైల్ నిపుణులు సూచిస్తున్నారు.

నిమ్మకాయ, లవంగాలతో దోమలను ఇంట్లోంచి ఈజీగా తరిమేయండి..  రూపాయి ఖర్చు లేని సహజ చిట్కా!
Natural Mosquito Repellent
Jyothi Gadda
|

Updated on: Sep 07, 2026 | 3:50 PM

Share

వర్షాకాలం, ఉక్కపోత వాతావరణంలో ఇళ్లలోకి దోమల తాకిడి విపరీతంగా పెరుగుతుంది. వీటిని తరిమికొట్టేందుకు మార్కెట్లో లభించే కెమికల్ కాయిల్స్, స్ప్రేలు వాడటం కంటే ఇంట్లోనే లభించే నిమ్మకాయ, లవంగాలతో సహజ సిద్ధమైన పరిష్కారం పొందవచ్చు. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సురక్షితమైన ఆయుర్వేద చిట్కా.

నిమ్మకాయ-లవంగాల సింపుల్ హ్యాక్: ఈ చిట్కా కోసం ఒక తాజా నిమ్మకాయను తీసుకుని దాన్ని రెండు భాగాలుగా కోయాలి. ఇప్పుడు ఆ నిమ్మకాయ ముక్కలపై కొన్ని లవంగాలను గుచ్చాలి. మొగ్గ భాగం పైన కనిపించేలా ఉండాలి. ఇలా సిద్ధం చేసిన నిమ్మకాయ ముక్కలను కిటికీలు, తలుపుల వద్ద, పరదాల వెనుక లేదా సోఫాల కింద దోమలు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో ఉంచాలి. లవంగాలలోని యూజెనాల్ అనే కాంపౌండ్, నిమ్మకాయ సిట్రస్ వాసన కలిసి దోమలను ఆ ప్రాంతం నుంచి దూరంగా తరిమివేస్తాయి.

నిమ్మకాయ-వాము దీపం చిట్కా: ఇంట్లో దోమల ఉధృతి చాలా ఎక్కువగా ఉంటే మరొక ప్రభావవంతమైన పద్ధతిని ప్రయత్నించవచ్చు. ఒక నిమ్మకాయ పైన కొంత భాగాన్ని కోసి, లోపలి గుజ్జును తీసి ప్రమిదలా తయారు చేయాలి. అందులో కొద్దిగా ఆవనూనె, 4-5 లవంగాలు, కొద్దిగా వాము వేయాలి. దూదితో వత్తి చేసి ఆ ప్రమిదలో దీపం వెలిగించాలి.

ఇవి కూడా చదవండి

వాములోని థైమాల్‌, ఆవనూనె పొగ దోమలను, ఇతర చిన్న కీటకాలను తక్షణమే పారదోలుతాయి. ఈ సహజ సిద్ధమైన చిట్కాలతో పాటు, దోమల సంతతి పెరగకుండా ఉండటానికి ఇంట్లో లేదా పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కిటికీలకు నెట్ అమర్చుకోవడం, ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల ముప్పు నుంచి శాశ్వతంగా విముక్తి పొందవచ్చు. నిద్రపోయే ముందు ఈ చిన్న చిట్కాలను పాటించి, ప్రశాంతమైన ఆరోగ్యకరమైన నిద్రను పొందండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
2 కోట్లతో బడ్జెట్.. 122 కోట్ల కలెక్షన్స్.. 21 ఏళ్ల అమ్మాయి సంచలనం
2 కోట్లతో బడ్జెట్.. 122 కోట్ల కలెక్షన్స్.. 21 ఏళ్ల అమ్మాయి సంచలనం
నిమ్మకాయ,లవంగాలతో దోమలను ఇంట్లోంచి ఈజీగా తరిమేయండి..ఖర్చులేని పని
నిమ్మకాయ,లవంగాలతో దోమలను ఇంట్లోంచి ఈజీగా తరిమేయండి..ఖర్చులేని పని
పాలు, గుడ్లు కన్నా పవర్ఫుల్.. రోజూ గిన్నెడు తింటే చాలు
పాలు, గుడ్లు కన్నా పవర్ఫుల్.. రోజూ గిన్నెడు తింటే చాలు
కొలెస్ట్రాల్, బీపీ టెన్షన్ పోవాలంటే.. రోజూ తిన్న తర్వాత ఈ చిన్న..
కొలెస్ట్రాల్, బీపీ టెన్షన్ పోవాలంటే.. రోజూ తిన్న తర్వాత ఈ చిన్న..
NEET PGలో కీలక మార్పు.. ప్లీజ్ చెక్!
NEET PGలో కీలక మార్పు.. ప్లీజ్ చెక్!
స్పీకర్ గడ్డం ప్రసాద్ కంటతడి.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
స్పీకర్ గడ్డం ప్రసాద్ కంటతడి.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మూడు శుభ గ్రహాలు అనుకూలం.. వీరికి ఇక సమస్యలు లేని జీవితం
మూడు శుభ గ్రహాలు అనుకూలం.. వీరికి ఇక సమస్యలు లేని జీవితం
కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు పునాది లెవల్‌ వరకు ఎంత ఖర్చు ?
కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు పునాది లెవల్‌ వరకు ఎంత ఖర్చు ?
మంచి జీవితం చూపిస్తానని చెప్పి.. తీసుకెెళ్లి వ్యభిచార కూపంలోకి..
మంచి జీవితం చూపిస్తానని చెప్పి.. తీసుకెెళ్లి వ్యభిచార కూపంలోకి..
66 కిలోల గోల్డ్.. 335 కిలోల వెండి.. రూ.703 కోట్ల బీమా! మహాగణపతి..
66 కిలోల గోల్డ్.. 335 కిలోల వెండి.. రూ.703 కోట్ల బీమా! మహాగణపతి..