AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌లకు బిగ్ షాక్.. లైసెన్సులు రద్దు చేసిన FDA..!

ఆన్‌లైన్‌లో విషపూరితమైన ధతూరా (ఉమ్మెత్త) పండ్లు, విత్తనాలను మానవ వినియోగానికి విక్రయించిన వ్యవహారంలో కర్ణాటక ఆహార భద్రత, ఔషధాల పరిపాలన విభాగం (FDA) కీలక చర్యలు చేపట్టింది. అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌లకు జారీ చేసిన ఫుడ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సస్పెండ్ చేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌లలో ధతూరా పండ్లు, విత్తనాలను ఆహారంగా విక్రయిస్తున్నట్లు విభాగం నిర్వహించిన విచారణలో తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌లకు బిగ్ షాక్.. లైసెన్సులు రద్దు చేసిన FDA..!
Fda Suspends Food Licences
Balaraju Goud
|

Updated on: Aug 25, 2026 | 8:46 AM

Share

ఆన్‌లైన్‌లో విషపూరితమైన ధతూరా (ఉమ్మెత్త) పండ్లు, విత్తనాలను మానవ వినియోగానికి విక్రయించిన వ్యవహారంలో కర్ణాటక ఆహార భద్రత, ఔషధాల పరిపాలన విభాగం (FDA) కీలక చర్యలు చేపట్టింది. అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌లకు జారీ చేసిన ఫుడ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సస్పెండ్ చేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌లలో ధతూరా పండ్లు, విత్తనాలను ఆహారంగా విక్రయిస్తున్నట్లు విభాగం నిర్వహించిన విచారణలో తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

విచారణలో కొన్ని ఉమ్మెత్త ప్యాకెట్లపై FSSAI లైసెన్స్, రిజిస్ట్రేషన్ నంబర్లు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విషపూరితమైన ధతూరాను మానవ వినియోగానికి ఆహారంగా విక్రయించడం, నిల్వ చేయడం లేదా పంపిణీ చేయడం అనుమతించరాదని FDA స్పష్టం చేసింది. ధతూరాలోని విషపూరిత పదార్థాలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

వెంటనే లిస్టింగ్‌లు తొలగించాలని ఆదేశం!

ఉమ్మెత్త పండ్లు, విత్తనాలను మానవ వినియోగానికి అందిస్తున్న అన్ని ఆన్‌లైన్ లిస్టింగ్‌లు, ప్రకటనలను వెంటనే తొలగించాలని FDA ఆదేశించింది. అలాగే ఆ ఉత్పత్తులను ఆహారంగా విక్రయించడం, పంపిణీ చేయడం, ప్రదర్శించడం పూర్తిగా నిలిపివేయాలని స్పష్టం చేసింది. ప్లాట్‌ఫామ్‌లకు సరఫరా చేస్తున్న విక్రేతలు, సరఫరాదారుల లైసెన్సులు, రిజిస్ట్రేషన్లపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

కంపెనీల వివరణలపై అసంతృప్తి

విచారణలో భాగంగా సోమవారం (ఆగస్టు 25) సంబంధిత కంపెనీల ప్రతినిధులు అధికారుల ముందు హాజరయ్యారు. అయితే అమెజాన్ తన తరఫున ఎలాంటి స్పందన సమర్పించలేదు. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ మాత్రం ధతూరా జాబితాలు, విక్రయంపై తీసుకున్న చర్యలకు సంబంధించిన పత్రాలను సమర్పించేందుకు అదనపు సమయం కోరింది. మరోవైపు బిగ్‌బాస్కెట్ ధతూరా విక్రయాన్ని నిలిపివేసినట్లు తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ఉత్పత్తులపై ‘మానవ వినియోగానికి కాదు’ అనే స్పష్టమైన లేబుల్‌ను ఉంచుతామని వెల్లడించింది. అయితే ఈ వివరణలు సంతృప్తికరంగా లేవని FDA పేర్కొంది.

తదుపరి ఏం జరుగుతుంది?

సంబంధిత సంస్థలు తమ కంప్లయెన్స్ రిపోర్టులను వెంటనే సమర్పించాలని FDA ఆదేశించింది. వాటిని పరిశీలించిన తర్వాతే లైసెన్సుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలా లేదా అన్నదానిపై ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయనుంది. అప్పటివరకు ధతూరా ఉత్పత్తుల విక్రయంపై నిషేధం కొనసాగుతుంది. ఈ వ్యవహారం ఆన్‌లైన్ ఫుడ్, క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో విక్రయించే ఉత్పత్తుల భద్రత, విక్రేతల పర్యవేక్షణపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us