AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: పండ్లను కోసిన తర్వాత ఎంతసేపట్లో తినాలి..? లేట్‌గా తింటే ఏమవుతుంది..?

పండ్లు మన ఆరోగ్యానికి ఎంత మంచివో మనందరికీ తెలుసు. డాక్టర్లు సైతం ఆహారంలో పండ్లను చేర్చుకోవాలని చెబుతారు. కానీ చాలా మంది పండ్లను కోసి కొన్ని గంటల తర్వాత తింటారు. అయితే కోసిన తర్వాత ఎంతసేపట్లో తినాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే అది మన శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

Health Tips: పండ్లను కోసిన తర్వాత ఎంతసేపట్లో తినాలి..? లేట్‌గా తింటే ఏమవుతుంది..?
Fruits
Krishna S
|

Updated on: Jul 26, 2025 | 10:03 PM

Share

పండ్లు మన శరీరానికి మంచివని అందరికీ తెలుసు. ప్రతిరోజ పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిది. విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటివి పండ్లలో సమృద్ధిగా ఉంటాయి. పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో పండ్లను చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తారు. కొన్నిసార్లు మనం పండ్లను కోసి అలాగే ఉంచుతాం. ఆఫీసులు, ఏదైన ప్రయాణ సమయాల్లో కోసి తీసుకెళ్తుంటారు. కొంతమంది కోసి ఫ్రిజ్‌లో పెడతారు. కొన్ని గంటల తర్వాత వాటిని తింటారు. కానీ కోసిన పండ్లను ఎంతసేపట్లో తినాలి..? అవి ఎంతకాలం మంచిగా ఉంటాయి అనేది చాలా మందికి తెలియదు. ఇవి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

కోసిన తర్వాత ఎంతసేపట్లో తినాలి..?

కోసిన వెంటనే పండ్లు చెడిపోవు. కానీ వాటిని ఎంత త్వరగా తింటే అంత మంచిది. నిజానికి కోసిన పండ్లలో ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది. వేసవి, వర్షాకాలం సూక్ష్మజీవుల పెరుగుదలకు ఉత్తమ సమయాలు. ఈ సీజన్లలో కోసిన పండ్ల వల్ల ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు నిల్వ చేయకుండా వీలైనంత త్వరగా వాటిని తినాలి. పండ్ల నుండి అన్ని పోషకాలను పొందడానికి వాటిని కోసిన అరగంటలోపు తినడం ఎల్లప్పుడూ మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

పండ్లు తినడానికి సరైన సమయం ఏమిటి?

పండ్లను ఏ సమయంలో తిన్న మంచిదేనని నిపుణులు అంటున్నారు. అయితే కొన్నింటిని ఉదయం ఖాళీ కడుపుతో, మరికొన్నింటిని రాత్రి వేళలో తినకూడదని చెబుతారు. ఏదైనా సరే మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..