Honey For Face: తేనెతో ఇలా ఫేస్‌ ప్యాక్‌ ట్రై చేశారంటే.. వారం రోజుల్లో ముడతలు మాయం!

మనం అందంగా, ఆరోగ్యంగా కనిపించడానికి రకరకాల సౌందర్య ఉత్పత్తులను వాడుతుంటాం. అయితే, మన వంటింట్లో లభించే సహజ సిద్ధమైన పదార్థాలతో కూడా చర్మాన్ని మెరిపించుకోవచ్చు. అలాంటి వాటిలో తేనె ముందుంటుంది. చర్మ సంరక్షణలో తేనెను చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. అయితే ముఖానికి తేనె రాయడం వల్ల నిజంగానే ప్రయోజనం ఉంటుందా? దీనిని ఎలా ఉపయోగించాలో ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఆంచల్ పంత్ కొన్ని విలువైన సూచనలు అందించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Honey For Face: తేనెతో ఇలా ఫేస్‌ ప్యాక్‌ ట్రై చేశారంటే.. వారం రోజుల్లో ముడతలు మాయం!
Honey For Face

Updated on: Oct 21, 2026 | 9:03 AM

ప్రతి ఒక్కరూ కాంతివంతమైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని కోరుకుంటారు. దీనికోసం వివిధ చిట్కాలు పాటిస్తుంటారు. ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఆంచల్ పంత్ ప్రకారం, ముఖానికి తేనె రాయడం వల్ల చర్మానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆయిలీ లేదా మొటిమలు వచ్చే చర్మ తత్వానికి ఇది ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పూర్తి ప్రయోజనాలేంటో తెలియాలంటే.. ఫుల్‌ డిటెల్స్‌లోకి వెళ్లాల్సిందే…

ముఖానికి తేనె రాస్తే కలిగే ప్రయోజనాలు:

చర్మ నిపుణుల అభిప్రాయం ప్రకారం, తేనె అన్ని రకాల చర్మాలకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఆయిలీ స్కిన్, మొటిమల సమస్య ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మొటిమల కారణంగా చర్మంపై ఏర్పడే ఎరుపును తగ్గించడంలో తేనె చక్కగా పనిచేస్తుంది. అంతేకాకుండా, తేనెలో తేమను నిలుపుకునే గుణం ఉంటుంది. ఇది చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతూ, ముఖాన్ని ఎల్లప్పుడూ మృదువుగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

తేనెను ముఖానికి ఎలా ఉపయోగించాలి?:

తేనెను ఎప్పుడూ సరైన పద్ధతిలో ఉపయోగిస్తేనే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి. డెర్మటాలజిస్ట్ సూచన ప్రకారం, తేనెను కేవలం ఒంటరిగా కాకుండా గులాబీ నీటితో కలిపి రాస్తే మరింత మంచి ఫలితం ఉంటుంది. ఇది చర్మంపై ఉండే రంధ్రాలను తగ్గిస్తూ, ముఖ కాంతిని రెట్టింపు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

హోమ్‌మేడ్ హనీ-రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ తయారీ విధానం:

ఒక చెంచా స్వచ్ఛమైన తేనెలో 4 నుంచి 5 చెంచాల రోజ్‌వాటర్ కలపాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి ఒక పల్చని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్లీన్ బ్రష్ సహాయంతో ఈ ప్యాక్‌ను ముఖానికి పలుచని లేయర్‌లా అప్లై చేయాలి. దీనిని ముఖంపై 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని లేదా సాధారణ నీటితో తేలికపాటి చేతులతో కడిగేసుకోవాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ను వారానికి రెండు సార్లు వేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

తీసుకోవాల్సిన కొన్ని ముఖ‍్యమైన జాగ్రత్తలు:

తేనె చర్మానికి ఎంతో మంచిదే అయినప్పటికీ, మీకు ముందుగానే ఏదైనా చర్మ సంబంధిత అలర్జీలు ఉంటే దీనిని వాడకపోవడమే మంచిది. అలాగే, మొదటిసారి ఉపయోగిస్తున్నప్పుడు పాచ్ టెస్ట్ చేయడం తప్పనిసరి. ఒకవేళ తేనె రాసిన తర్వాత చర్మానికి దురద, మంట లేదా ఎరుపు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దాన్ని ఉపయోగించడం ఆపేయాలి. సున్నితమైన చర్మం ఉన్నవారు నిపుణుల సలహా మేరకు తగు జాగ్రత్తలు పాటించడం ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us