Holi 2022: హోలీ రంగుల నుంచి మీ గోళ్లను కాపాడుకోండిలా.. ఈ నేచురల్‌ టిప్స్ పాటిస్తే మీ నెయిల్స్‌ భద్రమే..

|

Mar 15, 2022 | 12:18 PM

Holi 2022 Celebrations: మనదేశంలో వేడుకగా సెలబ్రేట్‌ చేసుకునే పండగల్లో హోలీ (Holi ) కూడా ఒకటి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ రంగుల పండగను జరుపుకుంటారు.

Holi 2022: హోలీ రంగుల నుంచి మీ గోళ్లను కాపాడుకోండిలా.. ఈ నేచురల్‌ టిప్స్ పాటిస్తే మీ నెయిల్స్‌ భద్రమే..
Holi 2022
Follow us on

Holi 2022 Celebrations: మనదేశంలో వేడుకగా సెలబ్రేట్‌ చేసుకునే పండగల్లో హోలీ (Holi ) కూడా ఒకటి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ రంగుల పండగను జరుపుకుంటారు. అయితే హోలీ సంబరాల్లో పాల్గొనే ముందు చర్మ సంరక్షణ గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో కీలకం. హోలీ రంగుల్లో వాడే రసాయనిక రంగుల నుంచి చర్మాన్ని, జుట్టుును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వేడుకల్లో ముఖ్యంగా చూసుకోవాల్సింది గోళ్ల (Nail Polishing) గురించి. నెయిల్‌ పాలిషింగ్ లేదా క్లీనింగ్‌ చేసుకోవడానికి చాలామంది మార్కెట్లో దొరికే వివిధ రకాల ఉత్పత్తులను వాడుతుంటారు. అయితే వీటి బదులు ఇంట్లో ఉండే పదార్థాలతో చక్కగా గోళ్లను శుభ్రం చేసుకోవచ్చు.పైగా ఇందుకోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చాలా తక్కువ సమయంలో సులువుగా గోళ్లను శుభ్రం చేసుకోవచ్చు. మరి అదెలాగో తెలుసుకుందాం రండి.

వెనిగర్

ఒక మిక్సింగ్‌ బౌల్‌ లో 3-4 టేబుల్ స్పూన్ల వైట్ వెనిగర్ ను తీసుకోవాలి. హోలీ వేడుకల అనంతరం రంగు మారిన గోళ్లను అందులో కొన్ని నిమిషాల పాటు ముంచి ఉంచండి. ఆ తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే గోళ్లపై రంగులు సులభంగా పోతాయి.

ఆమ్ చూర్ పౌడర్..

ఆమ్‌చూర్ పౌడర్‌ను వివిధ వంటకాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అయితే గోళ్ల రంగును తొలగించడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో అర టీస్పూన్ ఆమ్‌చూర్ పొడిని తీసుకుని 2-3 చుక్కల నీరు కలపండి. దీనిని బాగా మిక్స్‌ చేయాలి. ఆతర్వాత బ్రష్ సహాయంతో గోళ్లను శుభ్రం చేసుకోవచ్చు.

నెయిల్‌ పాలిష్‌ తో..

హోలీకి ఒక రాత్రి ముందుగా గోళ్లకు డార్క్ కలర్ నెయిల్ పాలిష్ వేసుకోండి. ఎందుకంటే హోలీ వేడుకలో గోళ్లపై రంగుపడినా.. అది మచ్చగా ఉండిపోకుండా.. నెయిల్ పాలిష్ కాపాడుతుంది. హోలీ అయిన తర్వాత, నెయిల్ పెయింట్ రిమూవర్‌తో నెయిల్ పాలిష్‌ను తొలగించండి. అయితే సింగిల్‌ కోట్‌ కంటే డబుల్‌ కోట్‌ వేయడం వల్ల మంచి ఫలితముంటుంది

నిమ్మకాయ

ముందుగా కొన్ని నిమ్మకాయల రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో మీ చేతులను 5 నుంచి 7 నిమిషాల వరకు ఉంచాలి. ఆ తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే గోళ్ళపై రంగులు సులభంగా పోతాయి. ఒకవేళ నిమ్మకాయ అందుబాటులో లేకపోతే.. కొబ్బరి నూనెలో మీ చేతులను నానబెట్టి.. రంగులు పడిన చోట నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వలన సులభంగా రంగు పోగొట్టవచ్చు.

కొబ్బరి నూనె..
హోలీ జరుపుకొనే ముందు రోజు రాత్రి కొబ్బరి నూనెతో గోళ్లను మసాజ్ చేయండి. ఇలా చేయడం వలన గోళ్లు విరిగిపోకుండా..బలంగా తయారవుతాయి. అదేవిధంగా హోలీ సంబరాల్లో పాల్గోనే ముందు బాడీతో పాటు గోళ్లకు కూడా వాసెలిన్ లేదా కొబ్బరి నూనె రాసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల మీపై రంగు పడినా.. రంగు శరీరానికి, గోళ్లకు పట్టుకుని ఉండదు.

Also Read: Ajith Kumar: 30 ఇయర్స్ ఇండస్ట్రీ..  “జీవించండి.. జీవించనివ్వండి” అంటూ ఫ్యాన్స్‏కు హేటర్స్‏కు హీరో అజిత్ స్పెషల్ మేసేజ్..

Health Tips: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 7 రకాల టిప్స్‌ను పాటించండి

Tamil Nadu: ఆదాయానికి మించి ఆస్తుల కేసు.. మాజీ మంత్రి ఇంట్లో విజిలెన్స్‌ సోదాలు.. అరెస్టయ్యే అవకాశం!