Hormonal Imbalance: ఎక్కువసేపు నిద్రపోవడం, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వంటి ఇతర చెడు అలవాట్ల వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. హార్మోన్ల అసమతుల్యత ఏ వయస్సులోనైనా సంభవించవచ్చు. ముఖ్యంగా యుక్తవయస్సు, రుతుక్రమం సమయంలో, వృద్ధాప్యం వంటి కొన్ని దశలలో ఈ సమస్య సాధారణంగా ఉంటుంది. ఒత్తిడి, అధిక కొవ్వు పదార్ధాలు తినడం, తిగినంత నిద్ర లేకపోవడం కూడా హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తుంది. హార్మోన్లు ఎండోక్రైన్ గ్రంధులలో ఉత్పత్తి చేయబడతాయి. శరీరంలో అనేక ముఖ్యమైన విధులను నియంత్రించడంలో సహాయపడతాయి.
వాటిలో 50 కంటే ఎక్కువ హార్మోన్స్.. జీవక్రియ, పెరుగుదల, పునరుత్పత్తి, లైంగిక పనితీరు, మానసిక స్థితి, చర్మం, జుట్టు ఆరోగ్యం, నిద్రకు సహాయపడతాయి. హార్మోన్ల అసమతుల్యత వాటి స్థాయిలు అవసరమైన దానికంటే తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నప్పుడు సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్, PCOD, మధుమేహం, మొటిమలు, వంధ్యత్వం వరకు అనేక దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది.
హార్మోన్ల అసమతుల్యతను ఎలా గుర్తించాలి..
బరువు తగ్గడం, బరువు పెరగడం, తీవ్రమైన అలసట, తిమ్మిర్లు, చేతులు, కాళ్లలో జలదరింపు, అధిక బ్లడ్ కొలెస్ట్రాల్ స్థాయి, నిరాశ, ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలు హార్మోన్ల అసమతుల్యతను సూచిస్తాయి.
హర్మోన్ల అసతుల్యతకు కారణాలేంటి?
1. ఖాళీ కడుపుతో కాఫీ, టీ తాగడం వలన జీవక్రియ నెమ్మదిస్తుంది. ప్రేగుల్లో, జీర్ణ వ్యవస్థకు ఆటంకాలు సృష్టిస్తుంది.
2. ఒత్తిడితో కూడిన జీవన విధానం. కార్టిసాల్ హార్మోన్.. శరీరంలో ఇతర హార్మోన్ల పనితీరుకు ఇబ్బంది కలిగిస్తుంది.
3. పగటిపూట 30 40 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల కూడా జీవక్రియ నెమ్మదిస్తుంది.
4. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం హర్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతుంది.
5. ఆల్కహాల్, ధూమపానం, చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు, మాంసం, వేయించిన ఆహారాలు, ఇతర కారణాలు కూడా హార్మోన్ల అసమతుల్యతకు కారణాలవుతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..