Memory Power: పరీక్షల వేళ పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచే సూపర్ ఫుడ్..!

Wallnuts Benefits: పోషకాలు నిండిన వాల్‌నట్స్ నిజంగానే సూపర్‌ఫుడ్స్‌లో ఒకటి. వాల్‌నట్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. గుండె ఆరోగ్యానికి, ఎముకల దృఢత్వానికి తోడ్పడతాయి. రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలను అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి ఆకలిని నియంత్రించి బరువు తగ్గేందుకు కూడా దోహదంచేస్తాయి. పోషకాలతో నిండిన వాల్‌నట్స్ మీ దైనందిన ఆహారంలో తప్పనిసరి చేసుకోవాలి.

Memory Power: పరీక్షల వేళ పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచే సూపర్ ఫుడ్..!
Wallnuts For Memory Power
Image Credit source: Freepik

Updated on: Feb 06, 2026 | 5:42 PM

వాల్‌నట్స్.. ఇవి పోషక విలువలతో నిండిన డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి. వాల్‌నట్స్‌ను మీ దైనందిన ఆహారంలో చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందొచ్చు. ఆకలిగా ఉన్నప్పుడు చిరుతిళ్లకు బదులుగా కేవలం ఐదు వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల పొట్ట నిండుతుంది. వీటిలోని పాలీశాచురేటెడ్ ఫ్యాట్ల కారణంగా త్వరగా ఆకలి వేయదు. కడుపు నిండినట్లు అనిపించి.. మీరు ఎక్కువగా తినకుండా ఉండేందుకు దోహదంచేస్తుంది.

రోజూ వాల్‌నట్స్ తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా..?

  1. మెదడు పనితీరును వాల్‌నట్స్ మెరుగుపరుస్తాయి. చదువుకునే పిల్లల్లో వాల్‌నట్స్ జ్ఞాపకశక్తిని పెంచుతాయి. వీటిలోని ఎసెన్షియల్ ఫ్యాటీ ఆమ్లాలు మెదడు పనితీరును చురుగ్గా ఉంచుతాయి. తరచుగా వాల్‌నట్స్ తీసుకునే పిల్లల్లో ఏకాగ్రత పెరిగి, మతిమరుపు సమస్య దరిచేరదు.
  2. వాల్‌నట్స్‌లో మాంసకృత్తులు, పిండిపదార్థాలు, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. ఈ పోషకాలన్నీ శరీరంలోని జీవక్రియ పనితీరును మెరుగుపరచి, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
  3. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా వాల్‌నట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఒమెగా-3, మోనోశాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు మేలు చేసే కొలెస్ట్రాల్‌ను అందించి, హృదయానికి రక్త సరఫరా సక్రమంగా జరిగేలా చూస్తాయి.
  4. రక్తపోటు, మధుమేహంతో బాధపడేవారు ప్రతిరోజూ ఐదు వాల్‌నట్లను తీసుకుంటే, వాటిలోని పోషకాలు ఈ సమస్యలను అదుపులో ఉంచుతాయి. వాల్‌నట్లలోని పోషకాలు ఎముకలు దృఢంగా ఉండటానికి తోడ్పడతుంది.
  5. వీటిని నానబెట్టి తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది. నేరుగా తినడం ఇష్టంలేని వారు పాలు, స్మూతీలు, సలాడ్స్‌లో కలిపి తీసుకోవచ్చు. అందుకే సంపూర్ణ ఆరోగ్యం కోసం వాల్‌నట్లను మీ ఆహారంలో భాగం చేసుకోండి.
  6. వాల్‌నట్స్ పెద్ద వారు రోజూ 5 తీసుకుంటే సరిపోతుంది. చిన్న పిల్లలు 2-4 తీసుకోవాలి.
  7. అయితే వీటిని ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. అలర్జీ సమస్యలు ఉన్నవారు..వీటిని తమ డైట్‌లో చేర్చుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ఏదైనా ఆరోగ్య సంబంధిత మార్పుల కోసం నిపుణులను సంప్రదించండి.

Loading...
Unable to load recommendations.
Follow Us