నేటి కాలంలో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో జుట్టు రాలడం ఒకటి. దీంతో అధిక డబ్బు ఖర్చు చేసి చాలా మంది హెయిర్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. కానీ ఇవి దీర్ఘకాలిక ఉపశమనం కలిగించవు. జుట్టు రాలడం ఆగి, బాగా పెరగాలంటే తినే ఆహారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలంటున్నారు నిపుణులు. ఈ కింది ఆహారాలు తీసుకుంటే జుట్టు ఆటోమాటిక్‌గా రాలడం ఆగి చక్కగా పెరుగుతుందని సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
పాలకూరలో ఐరన్, విటమిన్ ఎ, సి, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఐరన్ హెయిర్ ఫోలికల్స్‌కు ఆక్సిజన్‌ను అందించడంలో సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
గుడ్లలో ప్రోటీన్, బయోటిన్, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ప్రొటీన్ జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.
సాల్మన్ చేపలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, విటమిన్ డి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు వెంట్రుకల కుదుళ్లకు పోషణను అందించి, శిరోజాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీంతో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
శనగలు, బీన్స్‌తో సహా ఇతర గింజలు, విత్తనాల్లో జింక్, ప్రోటీన్, ఫైబర్‌లో పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మీ జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా ఆరోగ్యవంతమైన జుట్టు మీ సొంతం అవుతుంది. ఈ పప్పులను సూప్‌లు, సలాడ్‌లు, సైడ్ డిష్‌గా తీసుకోవచ్చు.
నట్స్ తింటే ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, జుట్టు పెరుగుదలలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల బాదం లేదా పొద్దుతిరుగుడు గింజలు వంటి నట్స్ తీసుకుంటే వీటిల్లోని బయోటిన్, ఇతర B విటమిన్లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
చిలగడదుంపలో విటమిన్ బి, పొటాషియం, విటమిన్ సి, జింక్ వంటి జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలు ఉన్నాయి. ఈ చిలగడదుంప జుట్టులో పోషకాల లోపాన్ని పోగొట్టి, వెంట్రుకలను పెంచేలా చేస్తుంది.
క్యారెట్‌లో విటమిన్లు, ఫైబర్, పొటాషియం, ఐరన్, జింక్, ఫాస్పరస్, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. క్యారెట్‌లోని విటమిన్ ఎ స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఇందులోని విటమిన్లు రక్త ప్రసరణను పెంచుతాయి. బయోటిన్, విటమిన్ ఎ కెరాటిన్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.