ఈ పండుగ ఆఫర్లలో వాషింగ్‌ మెషీన్‌ కొంటున్నారా.. ఫ్రంట్ లోడ్ vs టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ ఏది బెటర్..?

ఇంటి అవసరాలకు వాషింగ్ మెషీన్ కొనుగోలు చేసేటప్పుడు ఫ్రంట్ లోడ్ లేదా టాప్ లోడ్ మెషీన్లలో ఏది ఎంచుకోవాలనే గందరగోళం చాలామందిలో ఉంటుంది. ఈ రెండు రకాల మెషీన్లు బట్టలను శుభ్రం చేయడమే లక్ష్యంగా పనిచేసినప్పటికీ, వాటి వెనుక ఉన్న సాంకేతికత, నీటి వినియోగం, విద్యుత్ వాడకం, స్పిన్ స్పీడ్ పరంగా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అవేంటో వివరంగా తెలుసుకుందాం..

ఈ పండుగ ఆఫర్లలో వాషింగ్‌ మెషీన్‌ కొంటున్నారా.. ఫ్రంట్ లోడ్ vs టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ ఏది బెటర్..?
Front Load Washing Machine

Updated on: Oct 17, 2026 | 3:57 PM

పండుగ ఆఫర్లు భారీగా వస్తుంటాయి. ప్రజలు కూడా తమ ఇంటికి అవసరమైన వస్తువులన్నీ ఇదే సీజన్‌లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా భారీ ఎలక్ట్రానిక్‌ వస్తువులైన టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషీంగ్‌ మెషీన్లు వంటివి ఎక్కువగా కొంటుంటారు. అయితే, మీరు కూడా కొత్తగా వాషీంగ్‌ మెషీన్ కొనాలని చూస్తున్నారా..? ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ రెండింటిలో ఏది తీసుకుంటే బెటర్ అనే ఆలోచనలో పడ్డారా..? అయితే, ఈ వార్త మీ కోసమే.. ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు బట్టలను శుభ్రం చేయడానికి వేర్వేరు సాంకేతికతలను ఉపయోగిస్తాయి. కాబట్టి ఈ రెండి మధ్య తేడాలేంటో తెలుసుకోవటం తప్పనిసరి!

ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లలో బట్టలను ముందు వైపు ఉన్న డోర్ ద్వారా వేస్తారు. ఇందులో డ్రమ్ తిరిగేటప్పుడు బట్టలు పైకి లేచి మళ్లీ కిందకు పడతాయి. ఈ విధానం వల్ల బట్టల పై ఉన్న మురికి సులభంగా వదిలిపోతుంది. టాప్ లోడ్ మెషీన్లలో బట్టలను పై భాగం నుండి వేస్తారు. వీటిలో శుభ్రపరిచేందుకు రెండు రకాల సాంకేతికతలు ఉంటాయి.

అజిటేటర్: డ్రమ్ మధ్యలో ఉండే కడ్డీ బట్టలను తిప్పుతూ శుభ్రం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇంపెల్లర్: అడుగుభాగంలో ఉండే డిస్క్ బట్టలను ఒకదానికొకటి రాపిడి కలిగించేలా తిప్పుతుంది.

నీటి వినియోగం:

నీటిని ఆదా చేయడంలో ఫ్రంట్ లోడ్ మెషీన్లు ముందుంటాయి. ఫ్రంట్ లోడ్ మెషీన్ ఒక వాషింగ్ సైకిల్‌కు సుమారు 40 నుండి 50 లీటర్ల నీటిని మాత్రమే ఉపయోగిస్తుంది. అదే సమయంలో, సాంప్రదాయ టాప్ లోడ్ (అజిటేటర్) మెషీన్లకు దాదాపు 120 నుండి 150 లీటర్ల నీరు అవసరమవుతుంది. ఇంపెల్లర్ ఉన్న టాప్ లోడ్ మెషీన్లు సుమారు 80 నుండి 100 లీటర్ల నీటిని తీసుకుంటాయి.

స్పిన్ స్పీడ్, డ్రైయింగ్:

మెషీన్ స్పిన్ స్పీడ్ RPM (రెవొల్యూషన్స్ పర్ మినిట్) లలో కొలుస్తారు. ఫ్రంట్ లోడ్ మెషీన్లు సాధారణంగా 1,400 నుండి 1,600 RPM స్పీడ్‌తో తిరుగుతాయి. దీనివల్ల బట్టలలో ఉన్న నీరు త్వరగా పిండబడి, ఆరడానికి తక్కువ సమయం పడుతుంది. టాప్ లోడ్ మెషీన్ల స్పిన్ స్పీడ్ 600 నుండి 800 RPM వరకు మాత్రమే ఉంటుంది. అయితే, టాప్ లోడ్ మెషీన్లు తక్కువ సమయంలో వాషింగ్ ప్రక్రియను పూర్తి చేయగలవు.

తక్కువ నీరు, ఎక్కువ స్పిన్ స్పీడ్, బట్టల నాణ్యత దెబ్బతినకుండా ఉండాలనుకునే వారికి ఫ్రంట్ లోడ్ మెషీన్ ఉత్తమమైన ఎంపిక. వేగవంతమైన వాషింగ్, బడ్జెట్ అనుకూలమైన ధరను కోరుకునే వారికి టాప్ లోడ్ మెషీన్ సరిపోతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us