AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరెరె ఇన్నాళ్లు లైట్ తీసుకున్నారా.. రాత్రిపూట ఆపిల్ తింటే ఏమవుతుందో తెలుసా..?

రోజుకో ఆపిల్ తింటే డాక్టర్‌తో పనే ఉండదు అన్నది ఎంత నిజమో.. అదే ఆపిల్‌ను తప్పుడు సమయంలో తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సి వస్తుందన్నదీ అంతే నిజం. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత లేదా పడుకునే ముందు ఆపిల్ తినే అలవాటు మీకుందా? అయితే మీరు తీవ్రమైన జీర్ణ సమస్యలు, ఎసిడిటీని కొని తెచ్చుకుంటున్నట్లేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అరెరె ఇన్నాళ్లు లైట్ తీసుకున్నారా.. రాత్రిపూట ఆపిల్ తింటే ఏమవుతుందో తెలుసా..?
Is Apple Good At Night
Krishna S
|

Updated on: Sep 11, 2026 | 7:11 PM

Share

రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనే ఉండదు అనేది జగమెరిగిన నానుడి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థం పుష్కలంగా ఉండే ఆపిల్ గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు బరువును అదుపులో ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఎంతటి పోషకాలున్న పండైనా సరైన సమయంలో తినకపోతే అమృతం కాస్తా విషతుల్యంగా మారే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత లేదా పడుకునే ముందు ఆపిల్ తినే అలవాటు ఉంటే వెంటనే మార్చుకోవాలని సూచిస్తున్నారు.

రాత్రివేళ ఆపిల్ తింటే ఎదురయ్యే ముప్పులు ఇవే

జీర్ణ సమస్యలు – కడుపుబ్బరం: ఆపిల్‌లో పెక్టిన్ అనే కరిగే పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. పగటిపూట జీర్ణవ్యవస్థ చురుగ్గా ఉన్నప్పుడు ఇది ఎంతో మేలు చేస్తుంది. కానీ రాత్రి సమయంలో జీర్ణక్రియ బాగా నెమ్మదిస్తుంది. దీంతో పెక్టిన్ సరిగ్గా జీర్ణం కాక కడుపుబ్బరం, తీవ్రమైన గ్యాస్, అసౌకర్యానికి దారితీస్తుంది.

ఎసిడిటీ – గుండెల్లో మంట: ఆపిల్స్‌లో సహజసిద్ధమైన ఆర్గానిక్ ఆమ్లాలు ఉంటాయి. రాత్రి పడుకునే ముందు ఆపిల్ తిని నేరుగా పడుకోవడం వల్ల కడుపులో యాసిడ్ స్థాయిలు పెరిగి, ఆహార నాళంలోకి ఎగదన్నుతాయి. దీనివల్ల పుల్లటి త్రేనుపులు, గుండెల్లో తీవ్రమైన మంట వస్తాయి.

నిద్రలేమి సమస్యలు: ఆపిల్‌లో సహజ సిద్ధమైన ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు శరీరానికి అకస్మాత్తుగా ఈ శక్తి లభిస్తే మెదడు, శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్లలేవు. ఫలితంగా నిద్రపట్టక రాత్రంతా మంచంపై దొర్లాల్సి వస్తుంది.

ఆపిల్ తినడానికి సరైన సమయం ఏది?

ఆపిల్ ఇచ్చే పూర్తి పోషకాలు శరీరానికి అందాలంటే సరైన సమయంలోనే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఉదయం వేళల్లో ఉత్తమం: ఉదయం నిద్రలేచిన తర్వాత లేదా బ్రేక్‌ఫాస్ట్‌తో కలిపి ఆపిల్ తినడం అత్యుత్తమ పద్ధతి. ఇది పేగుల కదలికలను మెరుగుపరిచి, రోజంతా శరీరానికి అవసరమైన స్థిరమైన శక్తిని అందిస్తుంది.

మిడ్ డే స్నాక్‌గా: ఉదయం అల్పాహారానికి, మధ్యాహ్న భోజనానికి మధ్యలో వచ్చే చిన్నపాటి ఆకలికి నూనె పదార్థాలు, జంక్ ఫుడ్ బదులు ఆపిల్ ముక్కలు తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఇందులోని ఫైబర్ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచి అధిక బరువును నియంత్రిస్తుంది.

ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని భావించి రాత్రిపూట పండ్లు తినే అలవాటు ఉంటే, ముఖ్యంగా ఇప్పటికే గ్యాస్ట్రిక్ లేదా జీర్ణ సమస్యలతో బాధపడుతున్నవారు రాత్రి పడుకునే ముందు ఆపిల్‌తో పాటు ఎలాంటి పండ్లనూ తీసుకోకూడదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

Follow Us