AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాయ్, కాఫీ తాగేటప్పుడు అందరూ చేసే తప్పులు ఇవే.. మీకు తెలియని నిజాలు..

పొగలు కక్కే వేడివేడి టీ తాగడం మీకు అలవాటా? అయితే కాస్త ఆగండి. మీరు ఆస్వాదిస్తున్న ఆ మరుగుతున్న గుటకే.. మీ గొంతును, అన్నవాహికను నిశబ్దంగా కాల్చేస్తోందని మీకు తెలుసా? అలవాట్లలో ఒక్క చిన్న మార్పు చేసుకోకపోతే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చాయ్, కాఫీ తాగేటప్పుడు అందరూ చేసే తప్పులు ఇవే.. మీకు తెలియని నిజాలు..
Hot Tea And Cancer Risk
Krishna S
|

Updated on: Sep 11, 2026 | 8:58 PM

Share

ఉదయం లేవగానే పొగలు కక్కే వేడి టీ లేదా స్ట్రాంగ్ కాఫీ గొంతులోకి దిగితే కానీ చాలామందికి రోజు గడవదు. వర్షం పడినా, కాస్త అలసటగా అనిపించినా మరుగుతున్న టీ, కాఫీలు గుటకలేయడం మనలో చాలామందికి నిత్య అలవాటు. అయితే ఈ అలవాటే మన శరీరంలో అత్యంత కీలకమైన భాగాన్ని నిశబ్దంగా నాశనం చేస్తోందని వైద్య నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డ్రింక్ ఏదైనా.. అతి వేడిగా తాగే అలవాటు ప్రాణాంతక క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

అన్నవాహికపై ఉష్ణ ఒత్తిడి.. ఏం జరుగుతుందంటే?

మరుగుతున్న వేడి ద్రవాలు నేరుగా గొంతులోకి దిగినప్పుడు, నోటి నుంచి కడుపు వరకు ఆహారాన్ని చేరవేసే అన్నవాహిక తీవ్రమైన ఉష్ణ నష్టానికి గురవుతుంది. అన్నవాహిక లోపలి గోడలు అత్యంత సున్నితమైన కణాలతో నిర్మితమై ఉంటాయి. అధిక ఉష్ణోగ్రత ఉన్న ద్రవాలు పదేపదే తగిలినప్పుడు ఆ కణాలు తీవ్రమైన ఒత్తిడికి గురై కాలిపోతాయి. అప్పుడప్పుడు వేడిగా తాగితే శరీరం దాన్ని సరిచేసుకుంటుంది. కానీ రోజుకు నాలుగైదు సార్లు, ఏళ్ల తరబడి ఇదే విధంగా అతి వేడిగా తాగడం వల్ల ఆ ప్రాంతంలోని కణజాలంలో జన్యుపరమైన మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది.

అన్నవాహిక క్యాన్సర్‌తో సంబంధం

క్రమం తప్పకుండా తీవ్రమైన వేడితో ఉండే పానీయాలు సేవించడం వల్ల అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు శాస్త్రీయ అధ్యయనాలు సూచిస్తున్నాయి. వేడి టీ తాగే ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ వస్తుందని చెప్పలేకపోయినప్పటికీ, ఇది క్యాన్సర్‌ను ప్రేరేపించే ఒక ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్‌గా వైద్యులు గుర్తిస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది టీ లేదా కాఫీ గుణాన్ని కాదు.. అవి గొంతులోకి దిగేటప్పుడు ఉండే ఉష్ణోగ్రతను మాత్రమే.

టీ తాగడం మానేయక్కర్లేదు.. ఈ చిన్న మార్పు చాలు

ఈ హెచ్చరికల ఉద్దేశం టీ, కాఫీలను పూర్తిగా మానేయాలని కాదు. మన రోజువారీ తాగే పద్ధతిలో ఒక చిన్న జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది.

రెండు నిమిషాలు ఆగండి: టీ, కాఫీలు స్టవ్‌పై నుంచి దించగానే లేదా కప్పులో పోయగానే నేరుగా తాగేయకుండా, కనీసం 3 నుంచి 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి.

గోరువెచ్చగా లేదా మితమైన వేడి: పానీయం కొద్దిగా చల్లారి, తాగడానికి అనువైన మితమైన ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత మాత్రమే ఆస్వాదించాలి.

తరచుగా తాగేవారు జాగ్రత్త: ముఖ్యంగా రోజుకు ఎక్కువసార్లు వేడి పానీయాలు సేవించే అలవాటు ఉన్నవారు, ఉష్ణోగ్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.

ఆరోగ్యకరమైన జీవితానికి భారీ వ్యాయామాలు, కఠినమైన డైట్‌లే కాదు.. మనం ప్రతిరోజూ చేసే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకోవడం కూడా అంతే ముఖ్యం.

Follow Us
పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...
పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...
రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు
రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు
లక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారం రాశుల వారీగా ఈ మంత్రాలు జపించండి
లక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారం రాశుల వారీగా ఈ మంత్రాలు జపించండి
సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ ఫ్యామిలీ
సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ ఫ్యామిలీ
అక్టోబర్ 1న మరింత తగ్గిన పసిడి రేట్లు
అక్టోబర్ 1న మరింత తగ్గిన పసిడి రేట్లు
వాట్సప్‌లో ఈ తప్పులు చేస్తున్నారా..? అకౌంట్ శాశ్వతంగా బ్లాక్..
వాట్సప్‌లో ఈ తప్పులు చేస్తున్నారా..? అకౌంట్ శాశ్వతంగా బ్లాక్..
పంచదారను ఇలా నిల్వ చేస్తే ఇంట్లో సంపద పెరుగడం ఖాయం!
పంచదారను ఇలా నిల్వ చేస్తే ఇంట్లో సంపద పెరుగడం ఖాయం!
దివేగర్ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు..
దివేగర్ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు..
చికెన్ కడిగేటప్పుడు పసుపు, ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
చికెన్ కడిగేటప్పుడు పసుపు, ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? జాగ్రత్త..
ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? జాగ్రత్త..