AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా.. నోరూరించే చింత చిగురు చికెన్.. ఇలా వండారంటే మటన్ కూడా జూజూబీనే..

చింత చిగురు.. కోడి కూర.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రసిద్ధ, ప్రత్యేకమైన వంటకం.. పుల్లగా రుచికరంగా ఉండే.. స్పైసీ చింత చిగురు చికెన్ ను ఇంట్లో వండుకుని.. తింటే. ఆ కిక్కే వేరు.. ఈ కథనంలో నోరూరించే చింతచిగురు చికెన్ కూర సులభంగా తయారుచేసే విధానం తెలుసుకోండి..

వారెవ్వా.. నోరూరించే చింత చిగురు చికెన్.. ఇలా వండారంటే మటన్ కూడా జూజూబీనే..
Chicken
Shaik Madar Saheb
|

Updated on: Apr 23, 2026 | 2:21 PM

Share

చికెన్ అనగానే.. నాన్‌వెజ్ ప్రియులు లొట్టలేసుకుంటూ మరి తింటారు.. పలు రకాలుగా ఇష్టంగా వండుకుని.. రోటి, అన్నం.. ఇలా పలు ఆహారపదార్థాలతో తింటారు.. అయితే.. కొన్ని పదార్థాల కాంబినేషన్ తో కోడి కూర చేస్తే.. వారెవ్వా అంటూ గిన్నెలకు గిన్నెలు తింటారు.. అలాంటి సూపర్ కాంబినేషన్లలో చింత చిగురు, చికెన్ ఒకటి.. పుల్లని చింత చిగురుతో చికెన్ వండితే.. లొట్టలేసుకుంటూ మరి తింటారు.. ముఖ్యంగా నోరూరించే చింతచిగురు చికెన్ వంటకం తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రసిద్ధ, ప్రత్యేకమైన వంటకం. ఈ వంటకం లేత చింతచిగురు, స్పైసీ చికెన్ కలయికతో అద్భుతమైన రుచిని అందిస్తుంది. దీని తయారీ విధానం చాలా సులభం, ఇంట్లో ఎవరైనా సులువుగా ప్రయత్నించవచ్చు.

కావలసిన పదార్థాలు:

ఈ రుచికరమైన చింత చిగురు చికెన్ కర్రీని తయారుచేయడానికి చికెన్, చికెన్ క్వాంటిటీని బట్టి.. లేత చింతచిగురు, కారం, ధనియాలు-జీలకర్ర పౌడర్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉల్లిపాయలు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, 1 స్పూన్ చికెన్ మసాలా పౌడర్, తగినంత నూనె అవసరం.

తయారీ విధానం:

మ్యారినేషన్: ముందుగా, శుభ్రం చేసి కడిగిన చికెన్ ముక్కల్లో ఉప్పు, ధనియాలు-జీలకర్ర పౌడర్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. మసాలాలు చికెన్ ముక్కలకు బాగా పట్టేలా చూసి, అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇది చికెన్ మరింత మృదువుగా మారి, మసాలాలు బాగా పట్టి మంచి సువాసన వస్తుంది.

వేయించడం: స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి వేయించాలి. పసుపు, ఉప్పు వేసి, ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.

చికెన్ ఉడికించడం: వేగిన ఉల్లిపాయల మిశ్రమంలో మ్యారినేట్ చేసిన చికెన్‌ను వేసి బాగా కలపాలి. రెండు నిమిషాల పాటు వేయించిన తర్వాత, మరింత స్పైసీ రుచి కోసం మరో కొంచెం కారం వేసుకోవాలి. ఆ తర్వాత, అర గ్లాసు నీళ్ళు పోసి, మూత పెట్టి పది నిమిషాల పాటు చికెన్‌ను ఉడకనివ్వాలి. చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత తదుపరి దశకు వెళ్ళాలి.

చింతచిగురు, మసాలా జోడింపు: చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత, కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న లేత చింతచిగురును వేయాలి. చివరగా, 1 స్పూన్ చికెన్ మసాలా పొడిని వేసి, అన్నింటినీ బాగా కలిపి మరో రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ దశలో కర్రీ చిక్కబడుతుంది, గుమగుమలాడే సువాసన వెదజల్లుతుంది.

గార్నిషింగ్: స్టవ్ ఆఫ్ చేసి, చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.

ఈ స్పైసీ అండ్ టేస్టీ చింతచిగురు చికెన్ వేడి వేడి అన్నం లేదా చపాతీలతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. చింతచిగురు పుల్లని రుచి, చికెన్ మసాలాల కలయిక ఈ వంటకానికి ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. ఎండాకాలం చింత చిగురు దొరుకుతుంది.. కావున.. ఇంకెందుకు ఆలస్యం చింతచిగురు కోడికూరను ఇప్పుడే ఇష్టంగా చేసుకుని తినండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us