AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బబ్బ.. ప్రయోజనాలు తెలిసి బొప్పాయిని తెగ లాగించేస్తున్నారా..? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

బొప్పాయి రుచితో పాటు విటమిన్ C, కెరోటినాయిడ్లు, ఫైబర్ వంటి పోషకాలను అందించే పండు. ఇందులోని పాపైన్ ఎంజైమ్ జీర్ణక్రియలో పాత్ర పోషిస్తుంది. అయితే బొప్పాయి తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా గర్భధారణ సమయంలో పచ్చి లేదా సగం పండిన బొప్పాయి విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

అబ్బబ్బ.. ప్రయోజనాలు తెలిసి బొప్పాయిని తెగ లాగించేస్తున్నారా..? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
Papaya Health Benefits
Shaik Madar Saheb
|

Updated on: Sep 07, 2026 | 6:23 PM

Share

బొప్పాయి పండు దాని రుచి, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కారణంగా చాలామందికి నచ్చిన పండు. ఇది మన శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలతో నిండి ఉంటుంది, దీనిని తరచుగా “ఫ్రూట్ ఆఫ్ ఏంజెల్” అని పిలుస్తారు. బొప్పాయిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, ఉదయం అల్పాహారం తీసుకోలేని వారికి ఇది మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. బొప్పాయిలో విటమిన్ ఏ, విటమిన్ బీ, విటమిన్ సీ, విటమిన్ డీ తగిన మోతాదులో ఉంటాయి.

ఈ పండులో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ గుండె సమస్యలను నివారిస్తాయి. అధిక పీచు పదార్థం ప్రేగుల్లోని విష పదార్థాలను గ్రహిస్తుంది. అధ్యయనాల ప్రకారం, క్రమం తప్పకుండా బొప్పాయి తినేవారిలో కంటి సమస్యలు తగ్గి కంటిచూపు మెరుగుపడుతుంది. విటమిన్ సీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. చర్మ సౌందర్యాన్ని పెంచడంలో, ముడతలను తగ్గించడంలో, చర్మానికి ఎరుపు రంగును మెరుగుపరచడంలో కూడా బొప్పాయి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గించడంతో పాటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఇది రక్షిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా బొప్పాయి సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడే మహిళలకు బొప్పాయి చాలా ప్రయోజనకరం, ఎందుకంటే ఇది రక్తం పట్టేలా చేసి రక్తహీనత సమస్యను త్వరగా అధిగమించడంలో సహాయపడుతుంది.

అయితే, ఎంత ఆరోగ్యకరమైనదైనా ఏదైనా సరే మితంగా తీసుకుంటేనే ఔషధంలా పనిచేస్తుంది. బొప్పాయి విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. రోజుకు రెండు లేదా మూడు ముక్కలకు మించి తినకపోవడమే మంచిది. శృతిమించి తింటే, అమృతమైనా విషంగా మారినట్లే, బొప్పాయి కూడా కొన్ని సందర్భాలలో హానికరం కావచ్చు.

ముఖ్యంగా, కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బొప్పాయిని పూర్తిగా నివారించాలని వైద్య నిపుణులు గట్టిగా సూచిస్తున్నారు. ఇలాంటి వారు బొప్పాయిని తీసుకుంటే ప్రాణాలకు కూడా ప్రమాదం వాటిల్లవచ్చని హెచ్చరిస్తున్నారు.

గర్భిణులు: గర్భిణులు పచ్చి బొప్పాయిని లేదా ఉడికించిన బొప్పాయిని అస్సలు తీసుకోకూడదు. ఆయుర్వేదం ప్రకారం, బొప్పాయి వేడిని కలిగించే పదార్థం. పచ్చి బొప్పాయిలో ఉండే పాలు వంటి ద్రవం గర్భస్రావానికి కారణమయ్యే అవకాశం ఉంది.

కామెర్ల సమస్య ఉన్నవారు: కామెర్లతో బాధపడేవారు బొప్పాయిని పూర్తిగా నివారించాలి. ఇందులో ఉండే పాపైన్, బేటా-కెరోటిన్ వంటివి కామెర్ల సమస్యను మరింత పెంచుతాయి.

రక్తం ఎక్కువగా ఉన్నవారు: సాధారణం కంటే రక్తం ఎక్కువగా ఉన్నవారు లేదా రక్తాన్ని పలుచబడడానికి మందులు తీసుకుంటున్నవారు బొప్పాయిని తినకూడదు. ఇది ప్రమాదాన్ని కలిగించవచ్చు.

రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడానికి మందులు వాడుతున్నవారు: బొప్పాయి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెరను తగ్గించడానికి మందులు తీసుకుంటున్నవారు బొప్పాయిని తీసుకుంటే, చక్కెర స్థాయిలు మరీ పడిపోయి ప్రమాదకర పరిస్థితి ఏర్పడవచ్చు.

గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు: ఏదైనా గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు బొప్పాయిని తీసుకోకూడదు. దీనిని తీసుకుంటే గుండె వేగం తగ్గే అవకాశం ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా ముందుజాగ్రత్తగా బొప్పాయిని తీసుకోవడం మంచిదే కానీ, గుండె సమస్యలు ఉన్నవారు మాత్రం డాక్టర్ సలహా తీసుకోకుండా తినకపోవడమే మంచిది.

కాబట్టి, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బొప్పాయి విషయంలో ఈ విషయాలను గుర్తుంచుకోవడం అవసరం. తెలియకుండా బొప్పాయిని తీసుకుని కొత్త సమస్యలను కొని తెచ్చుకోకుండా, పైన పేర్కొన్న సమస్యలతో బాధపడేవారు బొప్పాయికి దూరంగా ఉండటమే మంచిదంటున్నారు నిపుణులు..

ఇంకా ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు లేదా మందులు వాడుతుంటే వ్యక్తిగత వైద్య సలహా తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us