AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakshmi Charu Recipe: నడుము నొప్పులు, నీరసానికి గుడ్ బై.. రోజూ ఒక గ్లాసు లక్ష్మీ చారు తాగితే శరీరంలో విటమిన్ B12 పెరగడం ఖాయం!

మన బామ్మల కాలం నాటి సాంప్రదాయ వంటకాల్లో రుచితో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగుండేవి. అలాంటి వాటిలో ప్రస్తుత తరానికి దాదాపు దూరమైపోయిన ఒక అద్భుతమైన వంటకం 'లక్ష్మీ చారు'. పూర్వ కాలంలో పల్లెటూళ్లలో ప్రతి ఇంట్లోనూ ఈ చారును ఎంతో ఇష్టంగా కాచుకునేవారు. సాధారణంగా శాఖాహారులలో 'విటమిన్ బీ12' లోపం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విటమిన్ లోపిస్తే విపరీతమైన నీరసం, కాళ్లు-చేతుల తిమ్మిరులు, రక్తహీనత వంటి సమస్యలు వేధిస్తాయి.

Lakshmi Charu Recipe: నడుము నొప్పులు, నీరసానికి గుడ్ బై.. రోజూ ఒక గ్లాసు లక్ష్మీ చారు తాగితే శరీరంలో విటమిన్ B12 పెరగడం ఖాయం!
Lakshmi Charu Recipe In Telugu
Bhavani
|

Updated on: Jul 08, 2026 | 10:41 AM

Share

లక్ష్మీ చారును తయారు చేసే ప్రత్యేకమైన పద్ధతి వల్ల ఇందులో విటమిన్ బీ12 పొట్టకు మేలు చేసే గుడ్ బ్యాక్టీరియా ల్యాబ్ రిపోర్టుల్లో సైతం నిరూపితమయ్యే స్థాయిలో వృద్ధి చెందుతాయి. మరి ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని రెట్టింపు చేసే ఈ సంప్రదాయ లక్ష్మీ చారును ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

 కావలసిన పదార్థాలు:

అన్నం వండగా మిగిలిన చిక్కటి గంజి – 2 గ్లాసులు

పాత చింతపండు – నిమ్మకాయ సైజు అంత

పచ్చిమిర్చి – 3 (నిలువుగా చీల్చినవి)

ఉల్లిపాయ – 1 (పెద్ద ముక్కలుగా కోసినవి)

పోపు దినుసులు (ఆవాలు, జీలకర్ర, మెంతులు) – 1 చెంచా

ఎండుమిర్చి – 2, కరివేపాకు – రెండు రెమ్మలు

ఇంగువ – చిటికెడు

పసుపు – అర చెంచా, రాళ్ల ఉప్పు – రుచికి సరిపడా

కొత్తిమీర – కొద్దిగా

లక్ష్మీ చారు తయారీ విధానం

స్టెప్ 1 (అసలైన సీక్రెట్ ప్రాసెస్): మనం అన్నం వార్చగా వచ్చిన వేడి గంజిని ఒక మట్టి పాత్రలో లేదా గిన్నెలో పోసి మూతపెట్టి.. కనీసం 12 నుండి 24 గంటల పాటు పక్కన పెట్టేయాలి. ఇలా నిల్వ ఉంచడం వల్ల గంజి సహజసిద్ధంగా పులుస్తుంది. ఈ పులిసిన గంజినే ‘లక్ష్మీ చారు’కు బేస్‌గా వాడతారు.

స్టెప్ 2: పులిసిన గంజిలో నిమ్మకాయ సైజు చింతపండును వేసి బాగా రసం తీసి పిప్పిని వేరు చేయాలి. అందులోనే కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పసుపు రాళ్ల ఉప్పు వేసి చేత్తో బాగా కలపాలి.

స్టెప్ 3: ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి చిన్న మంటపై బాగా మరిగించాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు మెత్తబడే వరకు మరిగిస్తే సరిపోతుంది.

స్టెప్ 4: చారు బాగా మరిగాక స్టవ్ ఆపేసి కొత్తిమీర చల్లుకోవాలి. ఆ తర్వాత మరొక చిన్న బాణలిలో రెండు చెంచాల నూనె లేదా నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు ముఖ్యంగా ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. ఈ పోపును మరిగిన చారులో కలిపితే ఘుమఘుమలాడే ‘లక్ష్మీ చారు’ రెడీ!

Follow Us
మీ అలవాట్లే మీ భవిష్యత్తు.. బద్ధకం వల్ల ఏం జరుగుతుందో తెలిపే కథ
మీ అలవాట్లే మీ భవిష్యత్తు.. బద్ధకం వల్ల ఏం జరుగుతుందో తెలిపే కథ
మైదానంలోకి హార్దిక్ పాండ్యా రీఎంట్రీ డేట్ ఫిక్స్
మైదానంలోకి హార్దిక్ పాండ్యా రీఎంట్రీ డేట్ ఫిక్స్
శబరిమలలో రోజుకు 5 పడి పూజలు.. 2040 వరకు బుకింగ్స్, కొత్త నిర్ణయం
శబరిమలలో రోజుకు 5 పడి పూజలు.. 2040 వరకు బుకింగ్స్, కొత్త నిర్ణయం
క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేసేటప్పుడు అదనంగా 2 శాతం అడుగుత
క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేసేటప్పుడు అదనంగా 2 శాతం అడుగుత
ఆయనతో సినిమా చేయడం అంటే హాలీవుడ్ ప్రాజెక్ట్ చేసినట్టే
ఆయనతో సినిమా చేయడం అంటే హాలీవుడ్ ప్రాజెక్ట్ చేసినట్టే
దీని ముందు చికెన్, మటన్ కూడా పనికిరావు.. చిటికెలోనే రెడీ ..
దీని ముందు చికెన్, మటన్ కూడా పనికిరావు.. చిటికెలోనే రెడీ ..
శ్రీ గణేశుడి 108 పవిత్ర నామాలు.. ఒక్కో పేరులో దాగున్న అర్థం ఇదే!
శ్రీ గణేశుడి 108 పవిత్ర నామాలు.. ఒక్కో పేరులో దాగున్న అర్థం ఇదే!
దుమ్ముదుమారం.. 22Aపై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్..
దుమ్ముదుమారం.. 22Aపై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్..
శంషాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ల మెగా హబ్.. ప్రభుత్వం నుంచి అప్డేట్..
శంషాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ల మెగా హబ్.. ప్రభుత్వం నుంచి అప్డేట్..
టాక్సిక్ డిజాస్టర్‌పై హీరో యష్ ఫస్ట్ రియాక్షన్..
టాక్సిక్ డిజాస్టర్‌పై హీరో యష్ ఫస్ట్ రియాక్షన్..