Raw Mango Sharbat: వేసవిలో మామిడికాయతో షర్బత్ చోసుకుని తాగండి.. ఆహా అంటారు.. ఎలా చేయాలంటే..

|

Apr 05, 2022 | 5:23 PM

వేసవి కాలంలో ఆరోగ్య సంరక్షణ చాలా ముఖ్యం. వేడి, బలమైన ఎండ నుంచి శరీరాన్ని రక్షించడానికి తప్పనిసరిగా చల్లని పానీయాలు తాగాలి. అయితే వేసవి వచ్చిందంటే ముందుగా..

Raw Mango Sharbat: వేసవిలో మామిడికాయతో షర్బత్ చోసుకుని తాగండి.. ఆహా అంటారు.. ఎలా చేయాలంటే..
Raw Mango Sharbat
Follow us on

వేసవి కాలంలో(Summer) ఆరోగ్య సంరక్షణ చాలా ముఖ్యం. వేడి, బలమైన ఎండ నుంచి శరీరాన్ని రక్షించడానికి తప్పనిసరిగా చల్లని పానీయాలు తాగాలి. అయితే వేసవి వచ్చిందంటే ముందుగా మనకు మార్కెట్లో మామిడి కాయలు విరివిగా లభిస్తుంటాయి. మామిడి కాయలతో చేసే షర్బత్‌కు(Raw mango sharbat) తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రత్యేకత ఉంది. వేసవి కాలంలో మామిడి కాయ షర్బత్‌ చాలా మేలు చేస్తుంది. మార్కెట్‌లో కూడా మామిడి కాయ షర్బత్‌కు భాగా డిమాండ్ ఉంటుంది. అయితే ఈ మామిడి కాయ షర్బత్‌‌ను మనం ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. వేసవిలో లభించే మామిడి కాయలు మీ శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. పచ్చి మామిడి షర్బత్‌‌ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

మామిడి కాయ షర్బత్‌‌కు కావలసినవి..

  • 2-3 మధ్యస్థంగా ఉండే మామిడి కాయలు
  • 2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1/4 స్పూన్ నల్ల మిరియాలు
  • 100-150 గ్రాముల చక్కెర
  • 3 స్పూన్ పుదీనా ఆకులు
  • రుచికి సరిపడేంత నల్ల ఉప్పు

మామిడి కాయ షర్బత్‌‌ తయారీ రెసిపీ

  1. పచ్చి మామిడి పన్నా చేయడానికి మామిడి కాయలను కడిగి ఒక పాత్రలో ఉడకబెట్టడానికి ఉంచండి.
  2. మీరు కావాలంటే మామిడి కాయలను కుక్కర్‌లో లేదా ఏదైనా తెరిచిన పాత్రలో ఉడకబెట్టవచ్చు.
  3. మామిడి కాయ షర్బత్ చేయడానికి ముందుగా మామిడి కాయలను కడగండి. వాటి పై తొక్కను తొలిగించి అందులోని అందులో ఉండే గుజ్జును మరో పాత్రలో తీసుకోండి.
  4. ఇప్పుడు ఈ గుజ్జులో 1-2 కప్పుల నీరు వేసి మరిగించాలి.
  5. ఈ గుజ్జు చల్లారగానే పంచదార, నల్ల ఉప్పు, పుదీనా ఆకులను మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి.
  6. ఇప్పుడు ఈ గుజ్జులో సుమారు 1 లీటరు చల్లటి నీటిని కలపండి.
  7. ఈ నీటిని ఫిల్టర్ చేసి, దానికి ఎండుమిర్చి, వేయించిన జీలకర్ర పొడిని జోడించండి.
  8. ఐస్ క్యూబ్స్ జోడించడం ద్వారా సిద్ధం చేసిన పచ్చి మామిడి కాయ షర్బత్‌ను సర్వ్ చేయండి.
  9. పుదీనా ఆకులతో అలంకరించిన మామిడి కాయ షర్బత్‌ను సర్వ్ చేయండి.
  10. మీరు ఈ మామిడి కాయ షర్బత్‌ను ఫ్రిజ్‌లో ఉంచి 3-4 రోజులు ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి: Viral Video: ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో.. అమ్మను ముద్దాడింది.. వెళ్లిపోయింది.. వీడియో చూస్తే మీరు అదే అంటారు..

Drugs Case: హాష్ ఆయిల్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్.. విచారణ ముమ్మరం చేసిన నార్కోటిక్ వింగ్..

Sanjay Raut: శివసేన ఎంపీ ఆస్తులపై ఈడీ దాడులు.. మనీలాండరింగ్ చేసినట్లుగా ఆరోపణలు..