AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నం తింటే బరువు పెరుగుతారా..? అపోహలు కాదు అసలు వాస్తవాలు తెలుసుకోండి..

బరువు తగ్గాలనుకునే వారు ముందుగా చేసే పని అన్నం తినడం మానేయడం. అన్నం తింటే లావైపోతామనే భయం చాలామందిని ఈ ఇష్టమైన ఆహారానికి దూరం చేస్తోంది. అయితే, నిజంగా అన్నం బరువు పెంచుతుందా? లేక ఇదంతా కేవలం ఒక అపోహేనా? ఈ విషయంపై డైట్, న్యూట్రిషన్ నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

అన్నం తింటే బరువు పెరుగుతారా..? అపోహలు కాదు అసలు వాస్తవాలు తెలుసుకోండి..
Does Rice Cause Weight Gain
Krishna S
|

Updated on: May 07, 2026 | 12:59 PM

Share

భారతీయులకు అన్నం కేవలం ఆహారం మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. దక్షిణాదిలో సాంబార్‌తో అయినా, ఉత్తరాదిలో పప్పుతో అయినా.. అన్నం లేనిదే భోజనం పూర్తి కాదు. అయితే ఇటీవలి కాలంలో బరువు తగ్గాలనుకునే వారు అన్నానికి దూరంగా ఉంటున్నారు. అన్నం తింటే లావైపోతారనే భయం చాలామందిలో ఉంది. అయితే బియ్యం కేవలం కార్బోహైడ్రేట్లు మాత్రమే కాదు, శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తుంది. కార్బోహైడ్రేట్లు శరీరానికి కావలసిన శక్తిని వెంటనే అందిస్తాయి. కండరాల మరమ్మత్తుకు అవసరమైన ప్రోటీన్, మెటబాలిజం మెరుగుపరిచే బి విటమిన్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇనుము, మెగ్నీషియం, పాస్ఫరస్ వంటి ఖనిజాలు ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి. బ్రౌన్, ఎర్ర బియ్యంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుండి మనల్ని రక్షిస్తాయి.

బరువు పెరుగుతారా? నిపుణుల మాట..

అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ డైటీషియన్ డాక్టర్ అంజలి తివారీ స్పష్టం చేశారు. బరువు పెరగడం అనేది మీరు రోజూ తీసుకునే మొత్తం కేలరీలు, మీ జీవనశైలి, వ్యాయామంపై ఆధారపడి ఉంటుంది. అన్నం సులభంగా జీర్ణమవుతుంది. దీనిని సరైన మోతాదులో తీసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

సమస్య ఎక్కడ వస్తుంది..?

అన్నం వల్ల బరువు పెరుగుతున్నారంటే దానికి కారణం బియ్యం కాదు, మనం తీసుకునే విధానం.

అధిక మోతాదు: అవసరానికి మించి ప్లేట్ నిండా అన్నం తినడం.

తప్పుడు కాంబినేషన్: వేయించిన కూరలు లేదా ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారంతో అన్నం కలపడం.

రాత్రిపూట భోజనం: రాత్రి సమయంలో శారీరక శ్రమ తక్కువగా ఉన్నప్పుడు భారీగా అన్నం తినడం వల్ల ఆ శక్తి ఖర్చు కాక కొవ్వుగా మారుతుంది.

ఆరోగ్యకరమైన డైట్ చిట్కాలు

మీరు ప్రతిరోజూ అన్నం ఇష్టంగా తినాలనుకుంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి..

  • ఒక పూటకు ఒక చిన్న గిన్నెడు అన్నం మాత్రమే తినండి.
  • తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్ లేదా దంపుడు బియ్యం ఎంచుకోండి. ఇందులో పీచుపదార్థం ఎక్కువ కాబట్టి ఆకలి త్వరగా వేయదు.
  • అన్నం తక్కువగా తీసుకుని, పప్పులు, ఆకుకూరలు, ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి.
  • మధ్యాహ్న భోజనంలో అన్నం తినడం ఉత్తమం. రాత్రిపూట వీలైనంత తక్కువగా తీసుకోండి.

Follow Us
ఆ హీరో ప్రపంచంలోనే బెస్ట్ డ్యాన్సర్..
ఆ హీరో ప్రపంచంలోనే బెస్ట్ డ్యాన్సర్..
అప్పట్లో లవర్ బాయ్.. అమ్మాయిలు పడి చచ్చేవాళ్లు.. కట్ చేస్తే..
అప్పట్లో లవర్ బాయ్.. అమ్మాయిలు పడి చచ్చేవాళ్లు.. కట్ చేస్తే..
తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై రేషన్ షాపుల్లో
తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై రేషన్ షాపుల్లో
టీమిండియా రెండో టీ20 జట్టు సిద్ధం.. వైభవ్, పాటిదార్‌లకు చోటు
టీమిండియా రెండో టీ20 జట్టు సిద్ధం.. వైభవ్, పాటిదార్‌లకు చోటు
ఇంట్లో బంగారం నిలవడంలేదా? వాస్తు చెప్పే ఆశ్చర్యకర కారణాలు ఇవే!
ఇంట్లో బంగారం నిలవడంలేదా? వాస్తు చెప్పే ఆశ్చర్యకర కారణాలు ఇవే!
మార్వాడీస్ బిజినెస్ లాజిక్ ఇదే.. ఇది తెలిస్తే.!
మార్వాడీస్ బిజినెస్ లాజిక్ ఇదే.. ఇది తెలిస్తే.!
IND vs AUS షెడ్యూల్ ఫిక్స్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తేదీలు ఇవే..
IND vs AUS షెడ్యూల్ ఫిక్స్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తేదీలు ఇవే..
సూపర్‌ఫుడ్‌గా పిలిచే ఈ గింజలు రోజూ గుప్పెడు తిన్నారంటే తిరుగులేదు
సూపర్‌ఫుడ్‌గా పిలిచే ఈ గింజలు రోజూ గుప్పెడు తిన్నారంటే తిరుగులేదు
పుచ్చకాయ తిన్న తర్వాత వీటిని అస్సలు తినొద్దు.. లైట్ తీసుకుంటే..
పుచ్చకాయ తిన్న తర్వాత వీటిని అస్సలు తినొద్దు.. లైట్ తీసుకుంటే..
ఐపీఎల్ ఫైనల్ మార్పుపై కర్ణాటక ప్రభుత్వం సంచలన ప్రకటన..!
ఐపీఎల్ ఫైనల్ మార్పుపై కర్ణాటక ప్రభుత్వం సంచలన ప్రకటన..!