AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇకపై ఇడ్లీలు అస్సలు అంటుకోవు.. మీకు ఈ చిన్న టెక్నిక్ తెలిస్తే చాలు..

హోటల్‌ లాగా దూదిలాంటి మెత్తటి ఇడ్లీలు ఇంట్లో ఎందుకు రావు అని ఆలోచిస్తున్నారా? పిండి సరిగ్గానే ఉన్నా, ఇడ్లీలు ఒకదానికొకటి అంటుకుపోయి జిగటగా రావడానికి పాత్రలో జరిగే చిన్న శాస్త్రీయ కారణమేంటో చాలామందికి తెలియదు. ఇడ్లీ స్టాండ్‌ను అమర్చే ఒకే ఒక్క సింపుల్ టెక్నిక్ మార్చితే చాలు... మీరూ పర్ఫెక్ట్ ఇడ్లీలు చేయొచ్చు..

ఇకపై ఇడ్లీలు అస్సలు అంటుకోవు.. మీకు ఈ చిన్న టెక్నిక్ తెలిస్తే చాలు..
How To Use Idli Stand Correctly
Krishna S
|

Updated on: Sep 09, 2026 | 7:23 PM

Share

ఉదయాన్నే వేడివేడిగా, దూదిలాంటి ఇడ్లీలు తింటుంటే ఆ మజాయే వేరు. పైగా నూనె లేకుండా ఆవిరితో చేస్తారు కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి. అయితే ఇంట్లో ఎంత శ్రద్ధగా పిండి రుబ్బినా.. కుక్కర్ మూత తీశాక కింద ప్లేట్‌లోని ఇడ్లీలు నీళ్లగా మారిపోవడం, పిండి ఒకదానికొకటి అంటుకుపోయి ముద్దగా రావడం చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్య. పిండి బాగున్నా ఇడ్లీలు పాడవడానికి అసలు కారణం ఇడ్లీ స్టాండ్‌ను సరిగ్గా అమర్చకపోవడమేనని వంట నిపుణులు చెబుతున్నారు.

ఎక్కడ జరుగుతోంది పొరపాటు?

చాలామంది ఇడ్లీ ప్లేట్లలో పిండి వేసి స్టాండ్‌లో పెట్టేటప్పుడు ఒక ఇడ్లీ గుంతకు సరిగ్గా నిలువుగా పై ప్లేట్ గుంత వచ్చేలా పేర్చుతారు. ఇలా నిటారుగా ఒకదానిపై ఒకటి పెట్టడమే పెద్ద పొరపాటు. ఇడ్లీ ప్లేట్లను గమనిస్తే గుంతల పక్కనే చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తాయి. ఇవి ఆవిరి ప్రసరణ కోసం ఇచ్చినవి. ఒక ఇడ్లీపై నేరుగా మరో ఇడ్లీ వచ్చేలా పెట్టినప్పుడు, కింద నుండి వచ్చే ఆవిరి నేరుగా పై ఇడ్లీ అడుగు భాగానికి తగిలి నీటి బిందువులుగా మారిపోతుంది. దీనివల్ల కింద వరుసలోని ఇడ్లీలు నీరెక్కి, జిగటగా మారి ముద్దవుతాయి.

స్టాండ్‌ను అమర్చే సరైన పద్ధతి

ఆవిరి రంధ్రాల అమరిక: మొదటి ప్లేట్‌పై రెండో ప్లేట్ పెట్టేటప్పుడు, పై ప్లేట్‌లోని రంధ్రాలు కింద ఉన్న ఇడ్లీకి సరిగ్గా పైభాగంలో వచ్చేలా అమర్చాలి. అంటే ఇడ్లీపై నేరుగా ఇడ్లీ రాకుండా మార్చి మార్చి పెట్టాలి.

ఆవిరి ప్రవాహం: ఇలా అమర్చడం వల్ల కింది నుంచి వచ్చే వేడి ఆవిరి ఆ రంధ్రాల గుండా పైకి ఎలాంటి అడ్డంకులు లేకుండా సులభంగా ప్రవహిస్తుంది.

సమానంగా ఉడకడం: నీటి బిందువులు ఇడ్లీలపై పడకుండా ఉండటంతో పాటు పైనుంచి కింది వరకు ప్రతి ఇడ్లీ సమానంగా, చక్కటి ఆకృతితో ఉడుకుతుంది.

పిండి పక్కాగా ఉండటం కూడా ముఖ్యమే

స్టాండ్ సరిగ్గా పెట్టినా పిండి పర్ఫెక్ట్‌గా లేకపోతే ఇడ్లీలు మెత్తగా రావు. పిండి మరీ పలుచగా ఉంటే ఇడ్లీ చదునుగా, జిగటగా మారుతుంది. అలాగే మరీ గట్టిగా ఉంటే రాళ్లలా తయారవుతాయి. పిండిని సరిగ్గా పులియబెట్టి, మధ్యస్థ చిక్కదనంతో కలిపినప్పుడే ఈ టెక్నిక్ పూర్తి ఫలితాన్ని ఇస్తుంది. వచ్చేసారి ఇడ్లీలు చేసేటప్పుడు ఈ చిన్న టెక్నిక్ ఉపయోగించి చూడండి. హోటల్ కంటే మెత్తగా, మల్లెపూవుల్లాంటి ఇడ్లీలను ఇంట్లోనే ఆస్వాదించవచ్చు.

Follow Us
ఇకపై ఇడ్లీలు అస్సలు అంటుకోవు.. మీకు ఈ చిన్న టెక్నిక్ తెలిస్తే..
ఇకపై ఇడ్లీలు అస్సలు అంటుకోవు.. మీకు ఈ చిన్న టెక్నిక్ తెలిస్తే..
పులుల కొత్త వలస బాట.. 14 ఏళ్ల కవ్వాల్ నిరీక్షణ ఫలించేనా?
పులుల కొత్త వలస బాట.. 14 ఏళ్ల కవ్వాల్ నిరీక్షణ ఫలించేనా?
చాలా తక్కువ మందికి తెలిసిన ఘుమఘుమలాడే సొరకాయ వేపుడు
చాలా తక్కువ మందికి తెలిసిన ఘుమఘుమలాడే సొరకాయ వేపుడు
'పిఠాపురంలో' ఏం జరిగింది? రాజేంద్రప్రసాద్ సినిమా రిలీజ్ డేట్ ఇదే
'పిఠాపురంలో' ఏం జరిగింది? రాజేంద్రప్రసాద్ సినిమా రిలీజ్ డేట్ ఇదే
ఇంట్లో వినాయకుడి తొండం ఏ వైపు ఉండాలి? ఆ దిశగా ఉంటే అశుభమా?
ఇంట్లో వినాయకుడి తొండం ఏ వైపు ఉండాలి? ఆ దిశగా ఉంటే అశుభమా?
పండుగ సీజన్‌లో రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలంటే.. ఈ టిప్స్ పాటించండి
పండుగ సీజన్‌లో రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలంటే.. ఈ టిప్స్ పాటించండి
ఆ హీరోయిన్‌ నాకు అక్కలాంటిది.. ఆమె అకాల మరణం చాలా బాధేసింది
ఆ హీరోయిన్‌ నాకు అక్కలాంటిది.. ఆమె అకాల మరణం చాలా బాధేసింది
ట్రంప్‌లో ఊహించని కొత్త యాంగిల్.. స్టాఫ్ కు నజరానా !
ట్రంప్‌లో ఊహించని కొత్త యాంగిల్.. స్టాఫ్ కు నజరానా !
మరిగించిన పాలను ఫ్రిడ్జ్‌లో పెట్టినా పాడవుతున్నాయా?పొరపాట్లు ఇవే!
మరిగించిన పాలను ఫ్రిడ్జ్‌లో పెట్టినా పాడవుతున్నాయా?పొరపాట్లు ఇవే!
భారత్ అధ్యక్షతలో కీలక నిర్ణయాలకు రంగం సిద్ధం.. ఇదిగో షెడ్యూల్!
భారత్ అధ్యక్షతలో కీలక నిర్ణయాలకు రంగం సిద్ధం.. ఇదిగో షెడ్యూల్!