AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజుకు ఎన్ని చపాతీలు తింటే బరువు తగ్గుతారు..? అసలు రహస్యం ఇదిగో..

బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ ఉన్నవారికి ఎక్కువగా వచ్చే డౌట్.. రోజుకు ఎన్ని రొట్టెలు తినాలి? ఒక రొట్టె తింటే మన శరీరానికి ఎన్ని క్యాలరీలు అందుతాయి? అసలు రొట్టెపై నెయ్యి రాసుకుని తింటే క్యాలరీలు ఎంత పెరుగుతాయి? ఈ ప్రశ్నలన్నింటికీ న్యూట్రిషన్ నిపుణులు కీలక సమాధానాలు ఇచ్చారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

రోజుకు ఎన్ని చపాతీలు తింటే బరువు తగ్గుతారు..? అసలు రహస్యం ఇదిగో..
How Many Rotis Should You Eat A Day
Krishna S
|

Updated on: Aug 06, 2026 | 4:34 PM

Share

మన దేశంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో రోజువారీ ఆహారంలో చపాతీలు చాలా ముఖ్యమైన భాగం. లంచ్ లేదా డిన్నర్‌లలో పప్పు, కూరలతో కలిపి రొట్టెలు తినడం మన సంప్రదాయం. అయితే బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ వ్యాధిగ్రస్తులు, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టే వారు నిత్యం సందేహించే విషయమేంటంటే.. ఒక రొట్టెలో ఎన్ని క్యాలరీలు ఉంటాయి? రోజుకు ఎన్ని రొట్టెలు తినడం ఆరోగ్యానికి మంచిది? ఈ ప్రశ్నలకు సంబంధించి ఎఫ్‌ఎంఆర్‌ఐ గుర్‌గావ్‌కు చెందిన హెడ్ క్లినికల్ న్యూట్రిషియనిస్ట్ డాక్టర్ దీప్తి ఖటూజా క్లారిటీ ఇచ్చారు.

ఒక రొట్టెలో ఎన్ని క్యాలరీలు ఉంటాయి?

గోధుమ పిండితో తయారు చేసిన 40 గ్రాముల సాధారణ సైజ్ రొట్టెలో దాదాపు 110 నుండి 120 క్యాలరీలు ఉంటాయి. అయితే మనం తయారుచేసే రొట్టె సైజ్, దాని మందం, ఉపయోగించే పిండి రకాన్ని బట్టి ఈ క్యాలరీలు మారుతుంటాయి..

  • సగం రొట్టె (20 గ్రాములు): 60 క్యాలరీలు
  • చిన్న రొట్టె (32 గ్రాములు): 96 క్యాలరీలు
  • మధ్యస్థ రొట్టె (40 గ్రాములు):120 క్యాలరీలు
  • పెద్ద రొట్టె (52 గ్రాములు): 156 క్యాలరీలు
  • రెండు మధ్యస్థ రొట్టెలు (80 గ్రాములు): 240 క్యాలరీలు
  • మూడు మధ్యస్థ రొట్టెలు (120 గ్రాములు): 360 క్యాలరీలు

మీరు రొట్టెపై ఒక టీస్పూన్ నెయ్యి రాసుకుని తింటే మరో 40 నుంచి 45 క్యాలరీలు అదనంగా చేరుతాయి.

రొట్టె తినడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు..

సస్టెయిన్డ్ ఎనర్జీ: రొట్టెలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల శరీరానికి నెమ్మదిగా, ఎక్కువ సేపు శక్తి లభిస్తుంది.

మెరుగైన జీర్ణక్రియ: ఇది ఫైబర్‌కు మంచి మూలం కావడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది.

కడుపు నిండిన భావన: పీచు పదార్థం ఎక్కువ సమయం పొట్ట నిండి ఉండేలా చేసి, పదే పదే ఆకలి వేయకుండా చూస్తుంది.

బ్లడ్ షుగర్ కంట్రోల్: రొట్టెలోని పీచు పదార్థం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా అదుపులో ఉంచుతుంది.

ప్రోటీన్లు – మినరల్స్: ఇందులో ఉండే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కండరాలకు మేలు చేస్తుంది. అలాగే విటమిన్-బి, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు అందుతాయి.

రోజుకు ఎన్ని రొట్టెలు తినాలి?

మనం రోజుకు ఎన్ని రొట్టెలు తినాలనేది మన వయస్సు, లింగం, ఎత్తు, బరువు, రోజువారీ శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుంది. డాక్టర్ దీప్తి ఖటూజా ప్రకారం.. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతి పూట 2 నుండి 4 మధ్యస్థ పరిమాణంలో ఉన్న రొట్టెలను తినవచ్చు. అంటే రోజంతటిలో మీ శరీర అవసరాలను బట్టి 6 నుండి 12 రొట్టెల వరకు తీసుకోవచ్చు. అయితే కేవలం రొట్టెలు మాత్రమే కాకుండా వాటితో పాటు తగినన్ని కూరగాయలు, ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల సమతుల్య ఆహారం పూర్తవుతుందని ఆమె సూచిస్తున్నారు.

Follow Us