Curd: పెరుగు త్వరగా పులిసిపోతుందా.. అయితే ఈ టిప్స్ పాలో అవ్వండి..

|

May 09, 2022 | 7:07 PM

పెరుగు నుంచి శరీరానికి కావాల్సిన క్యాల్షియం లభిస్తుంది.. ఒత్తిడికి దూరంగా ఉంచుతుంది. గుండె సంబంధిత సమస్యలు చాలామటుకు అదుపులో ఉంటాయి.

Curd: పెరుగు త్వరగా పులిసిపోతుందా.. అయితే ఈ టిప్స్ పాలో అవ్వండి..
Curd
Follow us on

పెరుగు లేకుండా చాలామందికి భోజనం కంప్లీట్ కాదు. జీర్ణవ్యవస్థ పనితీరు బాగుండాలంటే ప్రతిరోజూ పెరుగు తీసుకోవాలి. పెరుగులో.. మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది.. కర్డ్ నుంచి శరీరానికి కావాల్సిన క్యాల్షియం లభిస్తుంది.. ఒత్తిడికి దూరంగా ఉంచుతుంది. గుండె సంబంధిత సమస్యలు చాలామటుకు అదుపులో ఉంటాయి. ఇలా లెక్కలేనన్ని ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఈ కాలంలో త్వరగా పులిసిపోతుంది. అలాకాకుండా ఉండాలంటే… కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. అవి మీ కోసం.

ప్రధానంగా తోడు వేయడానికి ఉపయోగించే పెరుగు పుల్లగా లేకుండా చూసుకోవాలి.  పాలను కూడా బాగా మరిగించాలి. బాగా మసిలేటప్పుడు కాకుండా.. లైట్ వేడిగా ఉన్నప్పుడే కాసిన్ని మజ్జిగ వేసి లేదా.. పెరుగు కలిపి మూత పెట్టాలి. దీన్ని స్టౌకి దూరంగా ఉంచడం బెటర్. పెరుగును మట్టిపాత్రలో లేదా సిరామిక్‌ గిన్నెలో తోడు పెడితే…గట్టిగా తోడుకుంటుంది. మంచి రుచిగానూ ఉంటుంది.  పెరుగు గిన్నెపై మూత తప్పనిసరి. మూత లేకపోతే మిగతా పదార్థాల వాసనలు పెరుగులో కలిసిపోయి కూడా త్వరగా పులిసిపోయే అవకాశం ఉంటుంది.
సాధారణంగా తెల్లారి తినడానికి రాత్రి సమయంలో…. మధ్యాహ్నం తినాలనుకుంటే ఉదయాన్నే తోడు పెడతారు. అలాకాకుండా మనం ఎప్పుడైతే అన్నం తినాలనుకుంటామో..  అందుకు ఐదారు గంటల ముందు తోడు వేస్తే బాగుంటుంది. ఆపై వెంటనే ఫ్రిజ్‌లో పెడితే టేస్ట్ మారదు.

ఒకవేళ పులిసినా ఇలా ఉపయోగించుకోవచ్చు…

ఇవి కూడా చదవండి
  1. గ్రామాల్లో రోటి పచ్చళ్లు బాగా తింటారు. కొందరు రోట్లో నూరిన పచ్చడి లేకపోతే భోజనం చేయరు. అలాంటివారు ఒకవేళ పెరుగు పులిసిపోతే… పచ్చిమిర్చి, వెల్లుల్లి మిశ్రమం చేసి.. దాంట్లో కాస్త పుల్లని పెరుగు కలపండి. నోరూరించే చట్నీ రెడీ అయిపోతుంది.
  2. దోశలకు నానబెట్టిన బియ్యంలో కాస్త పుల్లటి పెరుగు, కాసిన్ని మెంతులు వేసి మూడు గంటలు సైడ్ పెట్టేయండి.  రుబ్బాక… ఇంకొంత పుల్లిటి పెరుగు జత చేస్తే.. దోశలు మంచి రుచిగా వస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే డైటీషియన్లు, ఎక్స్‌పర్ట్స్‌ను సంప్రదించండి.