Punarnava Uses: ఈ మొక్క ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది.. ఆరోగ్యానికి అద్భుత సంజీవని..అస్సలు వదలకండి

తెల్లగలిజేరు ఆకులు పిడికెడు తీసుకొని శుభ్రపరిచి పావు లీటర్ మంచినీటిలో వేసి మరగించాలి. చల్లార్చి వడపోసిరోజు ఉదయం పరగడుపు ఒక గ్లాసు తీసుకున్నట్లయితే కిడ్నీలు శుద్ధితో పాటు మూత్ర నాళ సమస్యలు కూడా పూర్తిగా దూరం అవుతాయి. ఇలా 21 రోజులపాటు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే ఫలితం ఉంటుందిన నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఇది తీసుకున్న తరువాత అరగంట ఏమీ తీసుకోకూడదు.

Punarnava Uses: ఈ మొక్క ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది.. ఆరోగ్యానికి అద్భుత సంజీవని..అస్సలు వదలకండి
Punarnava

Updated on: Jul 25, 2025 | 2:24 PM

తెల్లగలిజేరు.. ఈ మొక్కను చూసిన ప్రతి ఒక్కరూ ఇదేదో పిచ్చిమొక్కగానే భావిస్తారు. కానీ, నిజానికి ఈ మొక్కల్లో ఉన్న ఔషధగుణాల గురించి తెలిస్తే భద్రంగా దాచుకుని మరీ వండుకుని తింటారు. గలిజేరు మొక్కని ఔషధ గనిగా పిలుస్తారు. ఇది ఎన్నో రకాల జబ్బులకు ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ గలిజేరులో రెండు రకాలు ఉన్నాయి. తెల్లపూలు ఉంటే తెల్ల గలిజేరు, ఎర్రపూలు ఉంటే ఎర్ర గలిజేరు అని పిలుస్తారు. నేలమీద పాకే ఈ మొక్కకు ఆకులు గుండ్రంగా, అర్థ రూపాయంత ఉంటాయి. ఔషధ గుణాలు రెండింటికీ ఒకటేలా ఉన్నా తెల్ల గలిజేరు ఉత్తమమని అంటారు. పునర్నవ యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యను నయం చేయడంలో ప్రభావవంతమైన ఔషధంగా పనిచేస్తుంది.

యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూర ఇది. దీనిలోని విటమిన్‌ సి,డి మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. కిడ్నీ సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. తెల్లగలిజేరు ఆకులు పిడికెడు తీసుకొని శుభ్రపరిచి పావు లీటర్ మంచినీటిలో వేసి మరగించాలి. చల్లార్చి వడపోసిరోజు ఉదయం పరగడుపు ఒక గ్లాసు తీసుకున్నట్లయితే కిడ్నీలు శుద్ధితో పాటు మూత్ర నాళ సమస్యలు కూడా పూర్తిగా దూరం అవుతాయి. ఇలా 21 రోజులపాటు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే ఫలితం ఉంటుందిన నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఇది తీసుకున్న తరువాత అరగంట ఏమీ తీసుకోకూడదు.

ఈ తెల్లగలిజేరు ఆకు, కాండం, వేరుతో సహా ఔషధగుణాలు నిండివుంది. ఈ ఆకులను తరచూ తీసుకోవడం వల్ల రేచీకటి, మూత్రనాళ దోషాలు, కఫం వంటి సమస్యలు నయం చేస్తుంది. లివర్‌ వాపు, అధిక బరువు, కామెర్లు, మధుమేహం, వరిబీజం, వాతం, శ్వాస సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. రక్త శుద్ధి, కీళ్ళ నొప్పులు, బహిష్టు సమస్యలు, అన్ని రకాల జ్వరాలను తగ్గించటంలో అద్భుతం చేస్తుంది. ఈ తెల్లగలిజేరు ఆకును నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us