AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eye Health: స్పష్టమైన కంటిచూపు కోసం 7 సులభమైన టిప్స్.. ఆరోగ్యకరమైన కళ్లను పొందండి!

Healthy Eye Tips: ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, టీవీల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీని ప్రభావం కంటి చూపుపై తీవ్రంగా ఉంటోంది. చాలా మంది చిన్నవయస్సులోనే కళ్ల అద్దాలను వాడాల్సిన పరిస్థితి వస్తోంది. మరికొందరు కంటిచూపులో స్పష్టత కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యమైన కళ్ల కోసం ఆరోగ్య నిపుణుల సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం.

Eye Health: స్పష్టమైన కంటిచూపు కోసం 7 సులభమైన టిప్స్.. ఆరోగ్యకరమైన కళ్లను పొందండి!
Healthy Eye Tips
Rajashekher G
|

Updated on: Mar 29, 2026 | 9:15 PM

Share

ప్రస్తుతం డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర స్క్రీన్‌లు ఉపయోగించడం అనేది కంటి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్న విషయం తెలిసిందే. మనం ఎక్కువ సేపు స్క్రీన్‌ను చూసినా, కంటి కండరాలు అలసిపోతాయి, కళ్ళు పొడిబారతాయి. అంతేగాక, చూపు సమస్యలు పెరిగిపోతాయి. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం సరైన జీవనశైలి, పోషకాహారం, కొన్ని చిట్కాలు పాటించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

1. 20-20-20 సూత్రం:

  • అందరికీ తెలిసిన 20-20-20 రూల్‌ని పాటించడం ద్వారా స్క్రీన్ చూడడం వల్ల కంటి కండరాలపై పడ్డ ఒత్తిడిని తగ్గించవచ్చు. దీనిని ఎలా పాటించాలి:
  • ప్రతి 20 నిమిషాలకు స్క్రీన్ చూడటం ఆపాలి.
  • కనీసం 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు గమనించాలి.
  • ఈ అలవాటు కంటి కండరాలకు విశ్రాంతి ఇచ్చి, కళ్ళు పొడిబారడం, అలసటను తగ్గిస్తుంది.

2. సరైన భంగిమ:

  • స్క్రీన్ కళ్లకు కనీసం ఒక చేతి దూరంలో ఉండాలి.
  • స్క్రీన్ కంటి స్థాయికి కాస్త దిగువగా ఉండేలా పొజిషన్ చేయాలి.
  • గదిలో తగినంత వెలుతురు ఉండాలి, మరీ చీకటి లేదా మరీ ఎక్కువ కాంతి ఉండకూడదు.

3. కనురెప్పలు వాల్చడం:

స్క్రీన్ ఉపయోగిస్తున్నప్పుడు కనురెప్పలు సరిగ్గా వాల్చడం చాలా ముఖ్యం. మీరు కనీసం 60% తక్కువగా కనురెప్పలు వాల్చే అవకాశం ఉంటుంది. కనురెప్పలు వాల్చడం వల్ల కళ్ళు తేమగా ఉంటాయి, కళ్ల పొడిబారడం తగ్గుతుంది.

4. నిద్ర, హైడ్రేషన్:

ప్రతిరోజూ 7–9 గంటల పాటు నిద్రపోవాలి. నిద్రలేమి వల్ల కళ్ళలో పొడిబారడం, కనురెప్పలు అవడం, దృష్టి మసకబారడం వంటి సమస్యలు వస్తాయి. ప్రతిరోజూ 8–10 గ్లాసుల నీరు తాగాలి. డీహైడ్రేషన్ వల్ల కూడా కళ్ళు పొడిబారతాయి.

5. UV రక్షణ:

బయట ఉన్నప్పుడు UV రక్షణ ఉన్న సన్‌గ్లాసెస్ ధరించండి. ఇది కంటి శుక్లాలు, రెటీనా సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

6. పోకాహారం

కంటి ఆరోగ్యం ఆహారంపై ఆధారపడి ఉంటుంది. కంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పోషకాలు:

  • విటమిన్ A: క్యారెట్లు, బొప్పాయి
  • లూటిన్ & జింక్: ఆకుకూరలు (పాలకూర), గింజలు
  • ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్: చేపలు, వాల్‌నట్స్, విత్తనాలు
  • సిట్రస్ పండ్లు: నారింజ, నిమ్మ

7. కంటి వ్యాయామాలు

  • కనురెప్పలు ఆర్పడం: కళ్ళను 10–15 సార్లు వేగంగా ఆర్పండి. ఆ తర్వాత కళ్ళు మూసి విశ్రాంతి తీసుకోండి.
  • కనుబొమ్మలను తిప్పడం: కళ్ళను నెమ్మదిగా వృత్తాకారంలో తిప్పండి. మొదట క్లాక్ వైజ్, తర్వాత యాంటీ క్లాక్ వైజ్.
  • దృష్టిని మార్చడం: మీ బొటనవేలును ముఖం దగ్గర ఉంచి దానిపై దృష్టి పెట్టండి, తర్వాత దూరంగా ఉన్న వస్తువుపై దృష్టి పెట్టండి.

ఈ చిట్కాలు కంటిపై ఒత్తిడిని తగ్గించి, చూపు దెబ్బతినకుండా కాపాడతాయి. అయితే, కంటి సమస్యలు సీరియస్‌గా మారితే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

Follow Us