Smoking: స్మోకింగ్ మానలేకపోతున్నారా.? ఇలా చేస్తే రిజల్ట్‌ పక్కా..

|

Nov 05, 2024 | 2:59 PM

స్మోకింగ్ అలవాటు చాలా ప్రమాదకరమని తెలిసిందే. క్యాన్సర్ మొదలు ఎన్నో అనారోగ్య సమస్యలకు ఇది కారణమవుతుందని తెలిసినా.? చాలా మంది ఈ అలవాటును మానుకోవడానికి ఇష్టపడరు. అయితే స్మోకింగ్ మానేయాలనుకునే వారు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు..

Smoking: స్మోకింగ్ మానలేకపోతున్నారా.? ఇలా చేస్తే రిజల్ట్‌ పక్కా..
Smoking
Follow us on

సరదాగా ప్రారంభమై ప్రాణాలు తీస్తుంది మయదారి ధూమపానం. స్మోకింగ్ అలవాటు ఆరోగ్యానికి హానికరమని తెలిసినా చాలా మంది ఈ అలవాటును వదులుకోవడానికి ఇష్టపడరు. దీనికి కారణం సిగరెట్స్‌లో ఉండే నికోటిన్‌ ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఈ నికోటిన్‌ మెదడులో డోపమైన్‌ను విడుదల చేస్తుంది. దీంతో మెదడుకు తక్షణ ఆనందం లభిస్తుంది. అందుకే స్మోకింగ్ అలవాటు ఉన్న వారు ఆ అలవాటును అంత సులభంగా వదిలిపెట్టరు. అయితే కొన్ని రకాల చిట్కాలు పాటించడం ద్వారా ఈ స్మోకింగ్‌ అలవాటును మానుకోవచ్చని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* మీరు ధూమపానం ఎందుకు మానేయాలని అనుకుంటున్నారో ఆ అంశాలను ఒక పేపర్‌పై రాసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం, మీకు కావాల్సిన వారి దగ్గర గౌరవప్రదంగా ఉండాలనుకోవడం కోసం కావొచ్చు.. ఇలా రకరకాల కారణాలను రాసుకోవాలి. ప్రతీ రోజూ వాటిని చూస్తుండాలి. ధూమపానం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడల్లా ఆ పాయింట్స్‌ను ఒకసారి చదవండి.

* ఇక మీకు నికోటిన్‌ తీసుకోవాలని అనిపించినప్పుడల్లా.. దానికి రీప్లేస్‌మెంట్ ఉపయోగించండి. చూయింగమ్‌ లేదా లవంగాలు, సోంప్ లాంటివి అలవాటు చేసుకోవాలి. స్మోకింగ్ చేయాలని అనిపించినప్పుడల్లా వాటిని తీసుకుంటే స్మోకింగ్ చేయాలనే ఆలోచన తగ్గుతుంది.

* మీరు స్మోకింగ్ మానేయాలనుకుంటున్న విషయాన్ని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు చెప్పండి. పొరపాటున మీరు మరోసారి సిగరెట్ పట్టుకున్నా వారు చేసే హెచ్చరికతో స్మోకింగ్ మానేసే అవకాశం ఉంటుంది.

* సాధారణంగా చాలా మంది ఒత్తిడి కారణంగా స్మోకింగ్‌ను ఆశ్రయిస్తుంటారు. అందుకే స్మోకింగ్ మానేయాలనుకుంటే ముందుగా ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇందుకోసం యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా స్మోకింగ్‌ అలవాటు నుంచి బయటపడతారు.

* ఇతర వ్యాపాలకు పెంచుకోవాలి. నవలలు చదవడం, వాకింగ్ చేయడం, వ్యాయామం చేయడం వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. ఇలా ఏదో ఒక వ్యాపకం అలవాటు చేసుకోవడం వల్ల స్మోకింగ్ చేయాలనే ఆలోచన తగ్గుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..