Beauty: అవాంఛిత రోమాలతో ఇబ్బందిగా ఉందా.? నేచురల్‌గా ఇలా తొలగించుకోండి..

|

Jul 07, 2024 | 5:57 PM

అవాంఛిత రోమాలు మహిళలను ఇబ్బందికి గురి చేస్తుంటాయి. అందంగా ఉన్న ముఖంపై ఉండే వెంట్రుకలు అందాన్ని మొత్తం పాడు చేస్తాయి. అందుకే మహిళలలు బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. ఈ క్రమంలో వెంట్రుకలకు తొలగించుకోవడానికి రకరకాల మార్గాలను వెతుక్కుంటారు. ముఖ్యంగా కెమికల్స్‌తో కూడిన క్రీమ్‌లను ఉపయోగించాల్సి వస్తుంది...

Beauty: అవాంఛిత రోమాలతో ఇబ్బందిగా ఉందా.? నేచురల్‌గా ఇలా తొలగించుకోండి..
Unwanted Hair
Follow us on

అవాంఛిత రోమాలు మహిళలను ఇబ్బందికి గురి చేస్తుంటాయి. అందంగా ఉన్న ముఖంపై ఉండే వెంట్రుకలు అందాన్ని మొత్తం పాడు చేస్తాయి. అందుకే మహిళలలు బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. ఈ క్రమంలో వెంట్రుకలకు తొలగించుకోవడానికి రకరకాల మార్గాలను వెతుక్కుంటారు. ముఖ్యంగా కెమికల్స్‌తో కూడిన క్రీమ్‌లను ఉపయోగించాల్సి వస్తుంది. అయితే ఇంట్లోనే లభించే కొన్ని వస్తువులతో వెంట్రుకలను తొలగించుకోవచ్చని మీకు తెలుసా.? ఆ సింపుల్ నేచురల్‌ టిప్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* అవాంఛిత రోమాలను తొలగిచడంలో తేనె, చక్కెర ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రెండింటితో తయారు చేసిన క్రీమ్‌ వెంట్రుకలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. ఇందుోసం ముందుగా ఒక గిన్నెలో రెండు చెంచాల చక్కెర, ఒక చెంచా తేనె కలపాలి అనంతరం ఈ పేస్ట్‌ను కాసేపు వేడి చేయాలి. తర్వాత మీరు తొలగించాలనుకుంటున్న వెంట్రుకలపై అప్లై చేయాలి. అనంతనం వ్యాక్స్‌ స్ట్రిప్‌ సహాయంతో తొలగిస్తే సరిపోతుంది. వెంట్రుకలు సులభంగా వచ్చేస్తాయ్‌.

* వెంట్రుకలను తొలగించడంలో గుడ్లు, మొక్కజొన్న పిండి కూడా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక గిన్నెలో అర చెంచా మొక్కజొన్న పిండి, గుడ్డు తెల్లసొన కలపాలి. ఇందులో కొంచెం చక్కెర కూడా యాడ్ చేయొచ్చు. అనంతరం ఈ పేస్ట్‌ను వెంట్రుకలు ఉన్న జోట అప్లై చేసి, ఆరబెట్టాలి. అనంతరం స్ట్రిప్‌ను వెంట్రుకలకు వ్యతిరేక దిశలో లాగాలి అంతే వెంట్రుకలు సులభంగా తొలగిపోతాయి.

* నిమ్మ, తేనెతో చేసిన మిశ్రమం కూడా వెంట్రుకలను తొలగించడంలో క్రీయాశీలకంగా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక చెంచా చక్కెరలో తేె, నిమ్మరసం కలపాలి. ఇందులో రెండు, మూడు చెంచాల నీటిని కలపాలి. అననంతరం కాస్త వేడి చేయాలి. చివరిగా పేస్ట్‌ చల్లార్చి ముఖంపై అప్లై చేసుకోవాలి. వ్యాక్సింగ్ స్ట్రిప్ట్‌తో లాగేస్తే వెంట్రుకలు తొలగిపోతాయి.

* ఓట్స్, అరటి పండుతో కూడా అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు. ఇందుకోసం అరటిపండును పేస్ట్‌గా చేసుకొని రెండు చెంచాల ఓట్స్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రెండు మూడు నిమిషాల పాటు అప్లై చేయాలి. ఆ తర్వాత సుమారు 10 నిమిసాల పాటు ముఖాన్ని మసాజ్‌ చేయడం వల్ల వెంట్రుకలు తొలగిపోతాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..