AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగితే ఏమవుతుంది..? లైట్ తీసుకోకుండా పక్కా తెలుసుకోండి..

నీరు జీవనాధారం.. ఇది మనందరికీ తెలిసిన సత్యం. రోజంతా తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్యులు చెబుతుంటారు. అయితే రాత్రి పడుకునే ముందు గ్లాసుడు నీళ్లు తాగడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయని కొందరు.. కాదు కాదు, అది నిద్రను చెడగొడుతుందని మరికొందరు వాదిస్తుంటారు. అసలు వాస్తవం ఏంటి? అనేది తెలుసుకుందాం..

రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగితే ఏమవుతుంది..? లైట్ తీసుకోకుండా పక్కా తెలుసుకోండి..
ఉదయం నీళ్లు తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ సక్రియం అవుతుంది. ఇది శరీరానికి శక్తినిస్తుంది. సోమరితనాన్ని తొలగిస్తుంది. మిమ్మల్ని తాజాగా చేస్తుంది. దీనితో పాటు ఉదయం నీళ్లు తాడే అలవాటు రోజంతా తగినంత నీళ్లు తాగే క్రమశిక్షణకు సహాయపడుతుంది.
Krishna S
|

Updated on: Jan 25, 2026 | 9:31 PM

Share

మానవ శరీరంలో నీరు ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుందో మనందరికీ తెలిసిందే. మన శరీరంలో దాదాపు 60 నుండి 70 శాతం వరకు నీరే ఉంటుంది. అందుకే రోజూ కనీసం 8 గ్లాసుల నీరు తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే రాత్రి పడుకునే ముందు నీరు తాగే విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ అలవాటు వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే నిద్రకు భంగం కలిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పడుకునే ముందు నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

రాత్రి వేళ శరీరానికి సరైన మోతాదులో నీరు అందడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. రాత్రి పడుకునే ముందు నీరు తాగడం వల్ల శరీరంలోని విషతుల్యాలు బయటకు వెళ్లిపోతాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరం తన ఉష్ణోగ్రతను సమతుల్యం చేసుకోవడానికి హైడ్రేషన్ అవసరం. నీరు తాగడం వల్ల శరీరం చల్లబడి, ప్రశాంతమైన నిద్రకు సహకరిస్తుంది. గోరువెచ్చని నీరు తాగడం వల్ల కండరాల నొప్పి తగ్గడమే కాకుండా, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నిమ్మరసం కలిపిన నీరు తాగితే రోగనిరోధక శక్తి పెరిగి, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

అతిగా తాగితే వచ్చే ఇబ్బందులు ఏంటి?

ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి, పడుకునే ముందు అతిగా నీరు తాగితే నోక్టోరియా అనే సమస్య వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ నీరు తాగడం వల్ల రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల గాఢ నిద్రకు భంగం కలుగుతుంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల మరుసటి రోజు అలసట, తలనొప్పి, ఏకాగ్రత లోపించడం వంటివి జరుగుతాయి. దీర్ఘకాలంలో ఇది గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపవచ్చు.

వైద్యులు సూచించే సరైన సమయం ఏది?

నీరు తాగిన వెంటనే పడుకోవడం కంటే ఒక క్రమపద్ధతిని పాటించడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

  • నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందే చివరిసారిగా నీరు తాగడం మంచిది.
  • రాత్రి భోజనం చేసిన గంట తర్వాత నీరు తాగడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.
  • పడుకునే ముందు దాహం వేస్తే గ్లాసుల కొద్దీ కాకుండా కేవలం కొన్ని గుక్కల నీరు మాత్రమే తాగాలి.

హైడ్రేటెడ్‌గా ఉండటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది, కానీ అది మన నిద్రను పాడుచేయకూడదు. కాబట్టి పడుకునే ముందు సమయాన్ని బట్టి నీరు తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Follow Us
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు
అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్
అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్
మండే ఎండల్లోను బెజవాడ వాహనదారులను పలకరిస్తున్న చిరు జల్లులు.. ఇలా
మండే ఎండల్లోను బెజవాడ వాహనదారులను పలకరిస్తున్న చిరు జల్లులు.. ఇలా
ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!
ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!
రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.60 వేలు కావాలా?
రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.60 వేలు కావాలా?
మిత్రమా బిగ్‌ అలర్ట్‌.. ముందు ఈ పని చేసుకో.. జూన్‌ 14 వరకే గడువు
మిత్రమా బిగ్‌ అలర్ట్‌.. ముందు ఈ పని చేసుకో.. జూన్‌ 14 వరకే గడువు
తెలుగురాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం..ఏ జిల్లాలో ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం..ఏ జిల్లాలో ఎలా ఉండబోతుందంటే?
ఈ టిప్స్ వాడితే పక్కాగా కరెంట్ బిల్ తగ్గుతుంది..
ఈ టిప్స్ వాడితే పక్కాగా కరెంట్ బిల్ తగ్గుతుంది..
వంటింట్లో మరుగుతున్న పాలు పొంగాయనీ.. ఉరి వేసుకుని భర్త సూసైడ్‌!
వంటింట్లో మరుగుతున్న పాలు పొంగాయనీ.. ఉరి వేసుకుని భర్త సూసైడ్‌!