ప్రేమికుల దినోత్సం కోసం ప్రేమికులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తమ ప్రేమను వ్యక్తపరచడానికి సరైన దినంగా భావించే ఫిబ్రవరి 14కోసం చూస్తున్నారు. అయితే ఈ రోజు తాము ఎంతగానో ఇష్టపడే భాగస్వామికి ఏదైనా బహుమతి ఇవ్వాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే భాగస్వామికి కొన్ని రకాల బహుమతులు ఇవ్వడం ఏమాత్రం మంచిది కాదని వాస్తు పండితులు చెబుతున్నారు. కొన్ని రకాల బహుమతుల కారణంగా బంధం విడిపోయే ప్రమాదం ఉంటుందని సూచిస్తున్నారు. ఇంతకీ ప్రేమికుల దినోత్సవం రోజున మీ భాగస్వామికి ఎలాంటి బహుమతులు ఇవ్వకూడదో ఇప్పుడు చూద్దాం..
* ప్రేమికుల దినోత్సవం రోజున ఎట్టి పరిస్థితుల్లో ఎండిపోయిన పువ్వులను, పదునైన వస్తువులు, గడియారాలు, గాజు వస్తువులను బహుమతిగా ఇవ్వకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలాంటివి ఇవ్వడం వల్ల మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
* అలాగే ప్రేమికుల దినోత్సవం రోజున ఎట్టి పరిస్థితుల్లో మునిగిపోతున్న ఓడ ఫోటోను బహుమతిగా ఇవ్వకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలాంటి ఫోటోలు వాస్తులో అశుభమైనదిగా పరిగణిస్తారు. ఆర్థిక సంక్షోభంతో పాటు, బంధం బలహీనంగా మారుతుందని విశ్వసిస్తుంటారు.
* ఇక మీ భాగస్వామికి ఎట్టి పరిస్థితుల్లో నల్ల దుస్తులను బహుమతిగా ఇవ్వకండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఎప్పుడు కూడా బ్లాక్ డ్రస్‌ను బహుమతిగా ఇవ్వకూడదు. ఇది దుఃఖానికి దారి తీస్తుందని చెబుతున్నారు.
* భాగస్వామికి ఎట్టి పరిస్థితుల్లో చెప్పులను బహుమతిగా ఇవ్వకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం, భాగస్వామికి బూట్లు ఎప్పుడూ బహుమతిగా ఇవ్వకూడదు. బూట్లు బహుమతిగా ఇవ్వడం విభజనకు చిహ్నంగా పరిగణించబడుతుందని చెబుతున్నారు.
* భాగస్వాములు ఒకరికొరు ఎట్టి పరిస్థితుల్లో రుమాలును బహుమతిగా ఇచ్చిపుచ్చుకోకూడదు. ఇలా చేయడం వల్ల భాగస్వాముల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..