
ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని పొందడానికి మనం రకరకాల ఉత్పత్తులను ఉపయోగిస్తాం. అలాంటి వాటిలో సన్‌స్క్రీన్ కూడా ఒకటి. చాలా మంది ఇది లేకుండా బయటకు వెళ్లరు. సూర్యుని అతినీలలోహిత (UV) కిరణాల నుండి చర్మాన్ని రక్షించడానికి సన్‌స్క్రీన్ చాలా అవసరం. ఎండలో బయటకు వెళ్ళే ముందు సన్‌స్క్రీన్ అప్లై చేయడం వల్ల ఇది మన చర్మాన్ని రక్షిస్తుంది. అధిక టానింగ్, చర్మంపై నల్లటి మచ్చలు, సూర్యకాంతి వల్ల కలిగే అకాల వృద్ధాప్యాన్ని నివారించడానికి మాత్రమే కాకుండా, ప్రాణాంతక చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గింస్తుంది.
అయితే సన్‌స్క్రీన్ వాడడం వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్ డి అందకుండా పోతుందని చాలా మందిలో ఒక అపోహ ఉండిపోయింది. కానీ నిజం ఏమిటంటే చాలా మంది తమ చర్మంపై UVB కిరణాలను పూర్తిగా నిరోధించడానికి తగినంత సన్‌స్క్రీన్‌ను ఉపయోగించరు. సిఫార్సు చేసిన దానికంటే తక్కువ సన్‌స్క్రీన్‌ను ఉపయోగించడం వల్ల సూర్యకాంతి చర్మాన్ని చేరుతుంది. అలాగే సన్‌స్క్రీన్‌ను క్రమం తప్పకుండా తిరిగి అప్లై చేయాలి. కానీ చాలా మంది ఇలా చేయరు, కాబట్టి శరీరానికి విటమిన్ డి ఉత్పత్తి చేయడానికి తగినంత సూర్యకాంతి లభిస్తుంది.
మరో విషయం ఏమిటంటే, చాలా మంది తమ శరీరంలోని అన్ని భాగాలకు సన్‌స్క్రీన్ రాసుకోరు. ముఖం, చేతులకు మాత్రమే అప్లై చేసినప్పుడు, విటమిన్ డి శరీరంలోని ఇతర భాగాలకు అందుతుంది. సన్‌స్క్రీన్ ఉపయోగించినప్పటికీ, చర్మం సహజంగానే అవసరమైన మేర విటమిన్ డి ఉత్పత్తి చేయడానికి అవసరమైన సూర్యకాంతిని పొందుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి సన్‌స్కీన్ వల్ల మన శరీరంలో విటమిన్ డి లోపం పెరుగుతుందనే అపోహ మాత్రమే
విటమిన్ డి లోపానికి ప్రధాన కారణాలు
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.